Job · chapter 19 · verse 7
Job 19:7 in Telugu
నామీద బలాత్కారము జరుగుచున్నదని నేను మొఱ్ఱపెట్టుచున్నాను గాని నా మొఱ్ఱ అంగీకరింపబడదు సహాయము నిమిత్తము నేను మొరలిడుచున్నాను గాని న్యాయము దొరకదు.
Naameeda balaatkaaramu jaruguchunnadani nenu morrapettuchunnaanu gaani naa morra angeekarimpabadadu sahaayamu nimittamu nenu moraliduchunnaanu gaani nyaayamu dorakadu.
Job 19:7 in English
- King James Version (KJV)
- Behold, I cry out of wrong, but I am not heard: I cry aloud, but [there is] no judgment.
- World English Bible (WEB)
- “Behold, I cry out of wrong, but I am not heard. I cry for help, but there is no justice.
- American Standard Version (ASV)
- Behold, I cry out of wrong, but I am not heard: I cry for help, but there is no justice.
- Bible in Basic English (BBE)
- Truly, I make an outcry against the violent man, but there is no answer: I give a cry for help, but no one takes up my cause.
- Darby Translation (DBY)
- Behold, I cry out of wrong, and I am not heard; I cry aloud, but there is no judgment.
- Webster's Bible (WBS)
- Behold, I cry out of wrong, but I am not heard: I cry aloud, but [there is] no judgment.
- Young's Literal Translation (YLT)
- Lo, I cry out — violence, and am not answered, I cry aloud, and there is no judgment.
Read in context
- 5మిమ్మను మీరు నామీద హెచ్చించుకొందురా? నా నేరము నామీద మీరు మోపుదురా?
- 6ఆలాగైతే దేవుడు నాకు అన్యాయము చేసెననియు తన వలలో నన్ను చిక్కించుకొనెననియు మీరుతెలిసికొనుడి.
- 7నామీద బలాత్కారము జరుగుచున్నదని నేను మొఱ్ఱపెట్టుచున్నాను గాని నా మొఱ్ఱ అంగీకరింపబడదు సహాయము నిమిత్తము నేను మొరలిడుచున్నాను గాని న్యాయము దొరకదు.
- 8నేను దాటలేకుండ ఆయన నా మార్గమునకు కంచెవేసి యున్నాడు. నా త్రోవలను చీకటి చేసియున్నాడు
- 9ఆయన నా ఘనతను కొట్టివేసియున్నాడు తలమీదనుండి నా కిరీటమును తీసివేసియున్నాడు.
Cross references
- Habakkuk 1:2–3 హబక్కూకు 1:2–3యెహోవా, నేను మొఱ్ఱపెట్టినను నీవెన్నాళ్లు ఆలకింప కుందువు? బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొఱ్ఱపెట్టినను నీవు రక్షింపక యున్నావు. నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీవేల ఊరకయే చూచుచున్నావు? ఎక్కడ చూచినను నాశనమును బలా త్కారమును అగుపడుచున్నవి, జగడమును కలహమును రేగుచున్నవి.
- Lamentations 3:8 విలాపవాక్యములు 3:8నేను బతిమాలి మొరలిడినను నా ప్రార్థన వినబడకుండ తన చెవి మూసికొని యున్నాడు.
- Job 31:35–36 యోబు 31:35–36నా మనవి వినుటకై నాకొకడు ఉండవలెనని నేనెంతో కోరుచున్నాను; ఇదిగో నా చేవ్రాలు గురుతు. ఇదిగో నా ప్రతివాది వ్రాసిన ఫిర్యాదు, సర్వశక్తుడు నాకుత్తరమిచ్చును గాక. నిశ్చయముగా నేను నా భుజముమీద దానిని వేసి కొందును నాకు కిరీటముగా దానిని ధరించుకొందును.
- Job 30:20 యోబు 30:20నీకు మొఱ్ఱపెట్టుచున్నాను అయితే నీవు ప్రత్యుత్తర మేమియు నియ్యకున్నావు నేను నిలుచుండగా నీవు నన్ను తేరి చూచుచున్నావు.
- Job 23:3–7 యోబు 23:3–7ఆయన నివాసస్థానమునొద్ద నేను చేరునట్లుగా ఆయనను ఎక్కడ కనుగొందునో అది నాకు తెలియబడును గాక. ఆయన సన్నిధిని నేను నా వ్యాజ్యెమును విశదపరచెదను వాదములతో నా నోరు నింపుకొనెదను. ఆయన నాకు ప్రత్యుత్తరముగా ఏమి పలుకునో అదినేను తెలిసికొందునుఆయన నాతో పలుకు మాటలను గ్రహించుకొందును. ఆయన తన అధికబలముచేత నాతో వ్యాజ్యెమాడునా?ఆయన ఆలాగు చేయక నా మనవి ఆలకించును అప్పుడు యథార్ధవంతుడు ఆయనతో వ్యాజ్యెమాడవచ్చును. కావున నేను ఎన్నటికిని నా న్యాయాధిపతివలనశిక్ష నొందకపోవుదును.
- Job 34:5 యోబు 34:5నేను నీతిమంతుడను దేవుడు నా పట్ల న్యాయము తప్పెను
- Job 40:8 యోబు 40:8నీవు నా న్యాయమును బొత్తిగా కొట్టివేసెదవా? నిర్దోషివని నీవు తీర్పు పొందుటకై నామీద అపరాధము మోపుదువా?
- Job 21:27 యోబు 21:27మీ తలంపులు నేనెరుగుదును మీరు నామీద అన్యాయముగా పన్నుచున్న పన్నాగములు నాకు తెలిసినవి.
- Job 9:24 యోబు 9:24భూమి దుష్టులచేతికి అప్పగింపబడియున్నదివారి న్యాయాధిపతులు మంచి చెడ్డలు గుర్తింపలేకుండ ఆయన చేయును. ఆయన గాక ఇవి అన్నియు జరిగించువాడు మరి ఎవడు?
- Psalm 22:2 కీర్తనలు 22:2నా దేవా, పగలు నేను మొఱ్ఱపెట్టుచున్నాను రాత్రివేళను నేను మౌనముగా నుండుట లేదు అయినను నీవు నా కుత్తరమియ్యకున్నావు.
- Job 16:21 యోబు 16:21నర పుత్రుని విషయమై వాని స్నేహితునితో వ్యాజ్యెమాడవలెననియు కోరి నేను దేవునితట్టు దృష్టియుంచి కన్నీళ్లు ప్రవాహముగా విడుచుచున్నాను.
- Job 9:32 యోబు 9:32ఆయన నావలె నరుడు కాడునేను ఆయనతో వ్యాజ్యెమాడజాలనుమేము కలిసి న్యాయవిమర్శకు పోలేము.