Job · chapter 19 · verse 8
Job 19:8 in Telugu
నేను దాటలేకుండ ఆయన నా మార్గమునకు కంచెవేసి యున్నాడు. నా త్రోవలను చీకటి చేసియున్నాడు
Nenu daatalekunda aayana naa maargamunaku kanchevesi yunnaadu. Naa trovalanu cheekati chesiyunnaadu
Job 19:8 in English
- King James Version (KJV)
- He hath fenced up my way that I cannot pass, and he hath set darkness in my paths.
- World English Bible (WEB)
- He has walled up my way so that I can’t pass, and has set darkness in my paths.
- American Standard Version (ASV)
- He hath walled up my way that I cannot pass, And hath set darkness in my paths.
- Bible in Basic English (BBE)
- My way is walled up by him so that I may not go by: he has made my roads dark.
- Darby Translation (DBY)
- He hath hedged up my way that I cannot pass, and he hath set darkness in my paths.
- Webster's Bible (WBS)
- He hath fenced up my way that I cannot pass, and he hath set darkness in my paths.
- Young's Literal Translation (YLT)
- My way He hedged up, and I pass not over, And on my paths darkness He placeth.
Read in context
- 6ఆలాగైతే దేవుడు నాకు అన్యాయము చేసెననియు తన వలలో నన్ను చిక్కించుకొనెననియు మీరుతెలిసికొనుడి.
- 7నామీద బలాత్కారము జరుగుచున్నదని నేను మొఱ్ఱపెట్టుచున్నాను గాని నా మొఱ్ఱ అంగీకరింపబడదు సహాయము నిమిత్తము నేను మొరలిడుచున్నాను గాని న్యాయము దొరకదు.
- 8నేను దాటలేకుండ ఆయన నా మార్గమునకు కంచెవేసి యున్నాడు. నా త్రోవలను చీకటి చేసియున్నాడు
- 9ఆయన నా ఘనతను కొట్టివేసియున్నాడు తలమీదనుండి నా కిరీటమును తీసివేసియున్నాడు.
- 10నలుదిశలు ఆయన నన్ను విరుగగొట్టగా నేను నాశనమై పోతిని ఒకడు చెట్టును పెల్లగించినట్లు ఆయన నా నిరీక్షణాధారమును పెల్లగించెను.
Cross references
- Lamentations 3:7 విలాపవాక్యములు 3:7ఆయన నా చుట్టు కంచె వేసియున్నాడు నేను బయలు వెళ్లకుండునట్లు బరువైన సంకెళ్లు నాకు వేసియున్నాడు
- Job 3:23 యోబు 3:23మరుగుపడిన మార్గముగలవానికిని, దేవుడు చుట్టుకంచె వేసినవానికిని వెలుగు ఇయ్యబడనేల?
- Proverbs 4:19 సామెతలు 4:19భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము తాము దేనిమీద పడునది వారికి తెలియదు.
- Psalm 88:8 కీర్తనలు 88:8నా నెళవరులను నాకు దూరముగా నీవు ఉంచి యున్నావు నీవు వారి దృష్టికి నన్ను హేయునిగా చేసియున్నావు వెలుపలికి రావల్ల గాకుండ నేను బంధింపబడి యున్నాను
- Lamentations 3:9 విలాపవాక్యములు 3:9ఆయన నా మార్గములకు అడ్డముగా చెక్కుడురాళ్లు కట్టియున్నాడు నేను పోజాలకుండ నా త్రోవలను కట్టివేసి యున్నాడు
- Hosea 2:6 హోషేయ 2:6ముండ్ల కంచె దాని మార్గములకు అడ్డము వేయుదును; దాని మార్గములు దానికి కనబడకుండ గోడ కట్టుదును.
- Joshua 24:7 యెహోషువ 24:7వారు యెహోవాకు మొఱ్ఱపెట్టినప్పుడు ఆయన మీకును ఐగుప్తీయులకును మధ్య చీకటి కల్పించి సముద్ర మును వారిమీదికి రప్పించి వారిని ముంచివేసెను. ఐగుప్తు దేశములో నేను చేసినదానిని మీరు కన్నులార చూచితిరి. అటుతరువాత మీరు బహు దినములు అరణ్యములో నివసించితిరి.
- Isaiah 50:10 యెషయా 50:10మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకునిమాట వినువాడెవడు? వెలుగులేకయే చీకటిలో నడచువాడు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను.
- Job 30:26 యోబు 30:26నాకు మేలు కలుగునని నేను ఆశించుకొనగా నాకు కీడు సంభవించెను వెలుగు నిమిత్తము నేను కనిపెట్టగా చీకటి కలిగెను.
- Jeremiah 23:12 యిర్మీయా 23:12వారి దండన సంవత్సరమున వారి మీదికి నేను కీడు రప్పించుచున్నాను గనుక గాఢాంధకారములో నడుచువానికి జారుడు నేలవలె వారి మార్గముండును; దానిలో వారు తరుమబడి పడిపోయెదరు; ఇదే యెహోవా వాక్కు.
- Jeremiah 13:16 యిర్మీయా 13:16ఆయన చీకటి కమ్మజేయక మునుపే, మీ కాళ్లు చీకటి కొండలకు తగులకమునుపే, వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దాని గాఢాంధకారముగా చేయకమునుపే, మీదేవుడైన యెహోవా మహిమ గలవాడని ఆయనను కొనియాడుడి.
- John 8:12 యోహాను 8:12మరల యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగుగలిగి యుండునని వారితో చెప్పెను.