Job · chapter 21 · verse 4
Job 21:4 in Telugu
నేను మనుష్యుని గురించి మొఱ్ఱపెట్టుకొన్నానా? లేదు గనుక నేను ఏల ఆతురపడకూడదు?
Nenu manushyuni gurinchi morrapettukonnaanaa? Ledu ganuka nenu ela aaturapadakoodadu?
Job 21:4 in English
- King James Version (KJV)
- As for me, [is] my complaint to man? and if [it were so], why should not my spirit be troubled?
- World English Bible (WEB)
- As for me, is my complaint to man? Why shouldn’t I be impatient?
- American Standard Version (ASV)
- As for me, is my complaint to man? And why should I not be impatient?
- Bible in Basic English (BBE)
- As for me, is my outcry against man? is it then to be wondered at if my spirit is troubled?
- Darby Translation (DBY)
- As for me, is my complaint to a man? or wherefore should not my spirit be impatient?
- Webster's Bible (WBS)
- As for me, [is] my complaint to man? and if [it were so] , why should not my spirit be troubled?
- Young's Literal Translation (YLT)
- I — to man [is] my complaint? and if [so], wherefore May not my temper become short?
Read in context
- 2నా మాట మీరు జాగ్రత్తగా వినుడి నా మాట మీ ఆదరణ మాటకు ప్రతిగా నుండుగాక.
- 3నాకు సెలవిచ్చినయెడల నేను మాటలాడెదను నేను మాటలాడిన తరువాత మీరు అపహాస్యము చేయవచ్చును.
- 4నేను మనుష్యుని గురించి మొఱ్ఱపెట్టుకొన్నానా? లేదు గనుక నేను ఏల ఆతురపడకూడదు?
- 5నన్ను తేరిచూచి ఆశ్చర్యపడుడి నోటిమీద చేయి వేసికొనుడి.
- 6నేను దాని మనస్సునకు తెచ్చుకొనిన యెడల నాకేమియు తోచకున్నది నా శరీరమునకు వణకు పుట్టుచున్నది.
Cross references
- Psalm 102:1 కీర్తనలు 102:1యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము నా మొఱ్ఱ నీయొద్దకు చేరనిమ్ము.
- Psalm 42:11 కీర్తనలు 42:11నా ప్రాణమా, నీవేల క్రుంగియున్నావు? నాలో నీవేల తొందరపడుచున్నావు? దేవునియందు నిరీక్షణ యుంచుము, ఆయనే నా రక్షణకర్త నా దేవుడు ఇంకను నేనాయనను స్తుతించెదను.
- Psalm 142:2–3 కీర్తనలు 142:2–3బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొఱ్ఱ పెట్టుచున్నాను నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొను చున్నాను. నాలో నా ప్రాణము క్రుంగియున్నప్పుడు నా మార్గము నీకు తెలియును నన్ను పట్టుకొనుటకై నేను నడువవలసిన త్రోవలో చాటుగా పగవారు ఉరినొడ్డుచున్నారు.
- 1 Samuel 1:16 1 సమూయేలు 1:16నీ సేవకురాలనైన నన్ను పనికిమాలిన దానిగా ఎంచవద్దు; అత్యంతమైన కోపకారణమునుబట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీని చెప్పుకొనుచుంటిననెను.
- Psalm 77:3–9 కీర్తనలు 77:3–9దేవుని జ్ఞాపకము చేసికొనునప్పుడు నేను నిట్టూర్పు విడుచుచున్నాను నేను ధ్యానించునప్పుడు నా ఆత్మ క్రుంగిపోవుచున్నది (సెలా. ) నీవు నా కన్నులు మూతపడనీయవు. నేను కలవరపడుచు మాటలాడలేక యున్నాను. తొల్లిటి దినములను, పూర్వకాల సంవత్సరములను నేను మనస్సునకు తెచ్చుకొందును. నేను పాడిన పాట రాత్రియందు జ్ఞాపకము చేసి కొందును హృదయమున ధ్యానించుకొందును. దేవా, నా ఆత్మ నీ తీర్పుమార్గము శ్రద్ధగా వెదకెను. ప్రభువు నిత్యము విడనాడునా? ఆయన ఇకెన్నడును కటాక్షింపడా? ఆయన కృప ఎన్నటికిలేకుండ మానిపోయెనా? ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పి పోయెనా? దేవుడు కటాక్షింప మానెనా? ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా?(సెలా. )
- Exodus 6:9 నిర్గమకాండము 6:9మోషే ఇశ్రాయేలీయులతో ఆలాగు చెప్పెను. అయితే వారు మనోవ్యాకులమునుబట్టియు కఠిన దాసత్వమును బట్టియు మోషే మాట వినరైరి.
- Psalm 22:1–3 కీర్తనలు 22:1–3నా దేవా నా దేవా, నీవు నన్నేల విడనాడితివి? నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేల దూరముగానున్నావు? నా దేవా, పగలు నేను మొఱ్ఱపెట్టుచున్నాను రాత్రివేళను నేను మౌనముగా నుండుట లేదు అయినను నీవు నా కుత్తరమియ్యకున్నావు. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రములమీద ఆసీనుడవై యున్నావు.
- Job 7:11–21 యోబు 7:11–21కావున నేను నా నోరు మూసికొననునా ఆత్మ వేదనకొలది నేను మాటలాడెదనునా మనోవేదననుబట్టి మూల్గుచుండెదను. నేనొక సముద్రమునా? సముద్రములోని భుజంగమునా? నీవెందుకు నా మీద కావలి యుంచెదవు? నా మంచము నాకు ఆదరణ ఇచ్చును. నా పరుపు నా బాధకు ఉపశాంతి ఇచ్చును అనినేననుకొనగా నీవు స్వప్నములవలన నన్ను బెదరించెదవు దర్శనములవలన నన్ను భయపెట్టెదవు. కావున నేను ఉరితీయబడవలెనని కోరుచున్నానుఈ నా యెముకలను చూచుటకన్న మరణమొందుట నాకిష్టము. అవి నాకు అసహ్యములు, నిత్యము బ్రదుకుటకు నా కిష్టము లేదునా దినములు ఊపిరివలె నున్నవి, నా జోలికి రావద్దు. మనుష్యుడు ఏపాటివాడు? అతని ఘనపరచనేల? అతనిమీద నీవు మనస్సు నిలుపనేల? ప్రతి పగలు నీవతని దర్శింపనేల?ప్రతి క్షణమున నీవతని శోధింపనేల? ఎంత కాలము నీవు నన్ను చూచుట మానకుందువు?నేను గుటక వేయువరకు నన్ను విడిచిపెట్టవా? నేను పాపముచేసితినా? నరులను కనిపెట్టువాడా, నేను నీ యెడల ఏమి చేయగలను?నాకు నేనే భారముగా నున్నాను, నీవేల గురి పెట్టితివి? నీవేల నా అతిక్రమమును పరిహరింపవు? నా దోషము నేల క్షమింపవు?నేనిప్పుడు మంటిలో పండుకొనెదనునీవు నన్ను జాగ్రత్తగా వెదకెదవు గాని నేనులేక పోయెదను.
- 2 Kings 6:26–27 2 రాజులు 6:26–27అంతట ఇశ్రాయేలురాజు పట్టణపు ప్రాకారముమీద సంచారముచేయగా ఒక స్త్రీ రాజును చూచిరాజవైన నా యేలినవాడా, సహాయము చేయుమని కేకలు వేయుట విని యెహోవా నీకు సహాయము చేయనిది నేనెక్కడ నుండి నీకు సహాయము చేయుదును? కళ్లములోనుండి యైనను ద్రాక్షగానుగలోనుండియైనను దేనినైనను ఇచ్చి సహాయముచేయ వల్లపడదని చెప్పి
- Matthew 26:38 మత్తయి 26:38అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగియున్నది;మీరు ఇక్కడ నిలిచి, నాతోకూడ మెలకువగా నుండుడని వారితో చెప్పి
- Job 6:11 యోబు 6:11నా బలము ఏపాటిది? నేను కనిపెట్టుకొనుట యేల?నా అంతము ఏపాటిది? నేను తాళుకొనుట యేల?
- Job 10:1–2 యోబు 10:1–2నా బ్రదుకునందు నాకు విసుకు పుట్టినది నేను అడ్డులేకుండ అంగలార్చెదను నా మనోవ్యాకులము కొలది నేను పలికెదను నా మీద నేరము మోపకుండుము నీవేల నాతో వ్యాజ్యెమాడుచున్నావో నాకు తెలియ జేయుమని నేను దేవునితో చెప్పెదను.