Job · chapter 21 · verse 3
Job 21:3 in Telugu
నాకు సెలవిచ్చినయెడల నేను మాటలాడెదను నేను మాటలాడిన తరువాత మీరు అపహాస్యము చేయవచ్చును.
Naaku selavichchinayedala nenu maatalaadedanu nenu maatalaadina taruvaata meeru apahaasyamu cheyavachchunu.
Job 21:3 in English
- King James Version (KJV)
- Suffer me that I may speak; and after that I have spoken, mock on.
- World English Bible (WEB)
- Allow me, and I also will speak. After I have spoken, mock on.
- American Standard Version (ASV)
- Suffer me, and I also will speak; And after that I have spoken, mock on.
- Bible in Basic English (BBE)
- Let me say what is in my mind, and after that, go on making sport of me.
- Darby Translation (DBY)
- Suffer me and I will speak; and after I have spoken, mock on!
- Webster's Bible (WBS)
- Suffer me that I may speak; and after I have spoken, mock on.
- Young's Literal Translation (YLT)
- Bear with me, and I speak, And after my speaking — ye may deride.
Read in context
- 1అప్పుడు యోబు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను
- 2నా మాట మీరు జాగ్రత్తగా వినుడి నా మాట మీ ఆదరణ మాటకు ప్రతిగా నుండుగాక.
- 3నాకు సెలవిచ్చినయెడల నేను మాటలాడెదను నేను మాటలాడిన తరువాత మీరు అపహాస్యము చేయవచ్చును.
- 4నేను మనుష్యుని గురించి మొఱ్ఱపెట్టుకొన్నానా? లేదు గనుక నేను ఏల ఆతురపడకూడదు?
- 5నన్ను తేరిచూచి ఆశ్చర్యపడుడి నోటిమీద చేయి వేసికొనుడి.
Cross references
- Job 17:2 యోబు 17:2ఎగతాళి చేయువారు నాయొద్ద చేరియున్నారు వారు పుట్టించు వివాదములు నా కన్నుల కెదురుగానున్నవి.
- Job 16:10 యోబు 16:10జనులు నామీద తమ నోరు తెరతురు నన్ను తిట్టి చెంపమీద కొట్టుదురు. వారు ఏకీభవించి నామీద గుంపు కూడుదురు
- Job 16:20 యోబు 16:20నా స్నేహితులు నన్ను ఎగతాళి చేయుచున్నారు. నరునివిషయమై యొకడు దేవునితో వ్యాజ్యెమాడవలెననియు
- Job 33:31–33 యోబు 33:31–33యోబూ, చెవిని బెట్టుము నా మాట ఆలకింపుము మౌనముగా నుండుము నేను మాటలాడెదను. చెప్పవలసిన మాట యేదైన నీకున్నయెడల నాతో ప్రత్యుత్తరము చెప్పుము మాటలాడుము, నీవు నీతిమంతుడవని స్థాపింప గోరుచున్నాను. మాట యేమియు లేనియెడల నీవు నా మాట ఆలకింపుము మౌనముగా నుండుము, నేను నీకు జ్ఞానము బోధించెదను.
- Job 12:4–5 యోబు 12:4–5నా స్నేహితునికి అపహాస్యాస్పదముగా నుండవలసి వచ్చెను. నీతియు యథార్థతయు గలవాడు అపహాస్యాస్పదముగా నుండవలసి వచ్చెను. దుర్దశ నొందినవానిని తిరస్కరించుట క్షేమముగలవారు యుక్తమను కొందురు. కాలుజారు వారికొరకు తిరస్కారము కనిపెట్టుచున్నది.
- Job 13:13 యోబు 13:13నేను మాటలాడెదను నా జోలికి రాక మౌనులైయుండుడి నామీదికి వచ్చునది ఏదో అది వచ్చునుగాక.
- Job 13:9 యోబు 13:9ఆయన మిమ్మును పరిశోధించుట మీకు క్షేమమా? లేక ఒకడు నరులను మోసముచేయునట్లు మీరు ఆయనను మోసము చేయుదురా?