Job · chapter 22 · verse 23
Job 22:23 in Telugu
సర్వశక్తునివైపు నీవు తిరిగినయెడలనీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించినయెడల నీవు అభివృద్ధి పొందెదవు.
Sarvashaktunivaipu neevu tiriginayedalanee gudaaramulalo nundi durmaargamunu dooramugaa tolaginchinayedala neevu abhivruddhi pondedavu.
Job 22:23 in English
- King James Version (KJV)
- If thou return to the Almighty, thou shalt be built up, thou shalt put away iniquity far from thy tabernacles.
- World English Bible (WEB)
- If you return to the Almighty, you will be built up, if you put away unrighteousness far from your tents.
- American Standard Version (ASV)
- If thou return to the Almighty, thou shalt be built up, If thou put away unrighteousness far from thy tents.
- Bible in Basic English (BBE)
- If you come back to the Ruler of all, making yourself low before him; if you put evil far away from your tents;
- Darby Translation (DBY)
- If thou return to the Almighty, thou shalt be built up. If thou remove unrighteousness far from thy tents,
- Webster's Bible (WBS)
- If thou shalt return to the Almighty, thou shalt be built up, thou shalt put away iniquity far from thy tabernacles.
- Young's Literal Translation (YLT)
- If thou dost return unto the Mighty Thou art built up, Thou puttest iniquity far from thy tents.
Read in context
- 21ఆయనతో సహవాసము చేసినయెడల నీకు సమాధానము కలుగునుఆలాగున నీకు మేలు కలుగును.
- 22ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము.
- 23సర్వశక్తునివైపు నీవు తిరిగినయెడలనీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించినయెడల నీవు అభివృద్ధి పొందెదవు.
- 24మంటిలో నీ బంగారమును ఏటిరాళ్లలో ఓఫీరు సువర్ణమును పారవేయుము
- 25అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును.
Cross references
- Job 11:13–14 యోబు 11:13–14నీవు నీ మనస్సును తిన్నగా నిలిపినయెడల నీ చేతులు ఆయనవైపు చాపినయెడల పాపము నీ చేతిలోనుండుట చూచి నీవు దానివిడిచిన యెడలనీ గుడారములలోనుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన యెడల
- Zechariah 1:3 జెకర్యా 1:3కాబట్టి నీవు వారితో ఇట్లనుము సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున దేమనగామీరు నాతట్టు తిరిగినయెడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.
- Job 8:5–6 యోబు 8:5–6నీవు జాగ్రత్తగా దేవుని వెదకినయెడల సర్వశక్తుడగు దేవుని బతిమాలుకొనినయెడల నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైనయెడల నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాసస్థలమును వర్ధిల్లజేయును.
- Isaiah 55:6–7 యెషయా 55:6–7యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడు కొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను దుష్టులు తమ తలంపులను మానవలెను వారు యెహోవావైపు తిరిగినయెడల ఆయన వారి యందు జాలిపడును వారు మన దేవునివైపు తిరిగినయెడల ఆయన బహుగా క్షమించును.
- Hosea 14:1–2 హోషేయ 14:1–2ఇశ్రాయేలూ, నీ పాపముచేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవాతట్టుకు తిరుగుము. మాటలు సిద్ధ పరచుకొని యెహోవాయొద్దకు తిరుగుడి; మీరు ఆయ నతో చెప్పవలసినదేమనగామా పాపములన్నిటిని పరిహరింపుము; ఎడ్లకు బదులుగా నీకు మా పెదవుల నర్పించు చున్నాము; నీవంగీకరింపదగినవి అవే మాకున్నవి.
- 2 Timothy 2:19 2 తిమోతికి 2:19అయినను దేవునియొక్క స్థిరమైన పునాది నిలుకడగా ఉన్నది. ప్రభువు తనవారిని ఎరుగును అనునదియు ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతినుండి తొలగిపోవలెను అనునదియు దానికి ముద్రగా ఉన్నది.
- Acts 26:20 అపొస్తలుల కార్యములు 26:20మొదట దమస్కులోనివారికిని, యెరూషలేములోను యూదయ దేశమంతటను, తరువాత అన్యజనులకును, వారు మారు మనస్సు పొంది దేవునితట్టు తిరిగి మారుమనస్సునకు తగిన క్రియలు చేయవలెనని ప్రకటించుచుంటిని.
- Joshua 7:13–16 యెహోషువ 7:13–16నీవు లేచి జనులను పరిశుద్ధపఱచి వారితో ఈలాగు చెప్పుమురేపటికి మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి; ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగాఇశ్రాయేలీయు లారా, మీ మధ్య శాపగ్రస్తమైన దొకటి కలదు; మీరు దానిని మీ మధ్య నుండకుండ నిర్మూ లము చేయువరకు మీ శత్రువుల యెదుట మీరు నిలువలేరు. ఉదయమున మీ గోత్రముల వరుసనుబట్టి మీరు రప్పింపబడుదురు; అప్పుడు యెహోవా ఏ గోత్రమును సూచించునో అది వంశముల వరుసప్రకారము దగ్గరకు రావలెను; యెహోవా సూచించు వంశము కుటుంబములప్రకారము దగ్గరకు రావలెను; యెహోవా సూచించు కుటుంబము పురుషుల వరుసప్రకారము దగ్గరకు రావలెను. అప్పుడు శపిత మైనది యెవనియొద్ద దొరుకునో వానిని వానికి కలిగినవారి నందరిని అగ్నిచేత కాల్చివేయవలెను, ఏలయనగా వాడు యెహోవా నిబంధనను మీరి ఇశ్రాయేలులో దుష్కా ర్యము చేసినవాడు అనెను. కాబట్టి యెహోషువ ఉదయమున లేచి ఇశ్రాయేలీ యులను వారి గోత్రముల వరుసనుబట్టి దగ్గరకు రప్పించి నప్పుడు యూదాగోత్రము పట్టుబడెను.
- Zechariah 5:3–4 జెకర్యా 5:3–4అందుకతడు నాతో ఇట్లనెనుఇది భూమియంతటిమీదికి బయలువెళ్లు శాపమే; దానికి ఒక ప్రక్కను వ్రాసియున్న దానినిబట్టి దొంగిలువారందరును కొట్టివేయబడుదురు; రెండవ ప్రక్కను వ్రాసియున్న దానినిబట్టి అప్రమాణికులందరును కొట్టివేయబడుదురు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు నేనే దాని బయలుదేరజేయుచున్నాను; అది దొంగల యిండ్లలోను, నా నామమునుబట్టి అబద్ధప్రమాణము చేయువారి యిండ్లలోను ప్రవేశించి వారి యిండ్లలో ఉండి వాటిని వాటి దూలములను రాళ్లను నాశనము చేయును.
- Jude 1:20 యూదా 1:20ప్రియులారా, మీరు విశ్వసించు అతిపరిశుద్దమైనదానిమీద మిమ్మును మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థనచేయుచు,
- Colossians 2:7 కొలొస్సయులకు 2:7మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు, ఆయనయందుండి నడుచుకొనుడి.
- Job 18:15 యోబు 18:15వారికి అన్యులైన వారు వారి గుడారములో నివాసము చేయుదురు వారి నివాసస్థలము మీద గంధకము చల్లబడును.