Job · chapter 29 · verse 13
Job 29:13 in Telugu
నశించుటకు సిద్ధమైయున్నవారి దీవెన నామీదికి వచ్చెను విధవరాండ్ర హృదయమును సంతోషపెట్టితిని
Nashinchutaku siddhamaiyunnavaari deevena naameediki vachchenu vidhavaraandra hrudayamunu santoshapettitini
Job 29:13 in English
- King James Version (KJV)
- The blessing of him that was ready to perish came upon me: and I caused the widow’s heart to sing for joy.
- World English Bible (WEB)
- the blessing of him who was ready to perish came on me, and I caused the widow’s heart to sing for joy.
- American Standard Version (ASV)
- The blessing of him that was ready to perish came upon me; And I caused the widow’s heart to sing for joy.
- Bible in Basic English (BBE)
- The blessing of him who was near to destruction came on me, and I put a song of joy into the widow's heart.
- Darby Translation (DBY)
- The blessing of him that was perishing came upon me, and I caused the widow's heart to sing for joy.
- Webster's Bible (WBS)
- The blessing of him that was ready to perish came upon me: and I caused the widow's heart to sing for joy.
- Young's Literal Translation (YLT)
- The blessing of the perishing cometh on me, And the heart of the widow I cause to sing.
Read in context
- 11నా సంగతి చెవినిబడిన ప్రతివాడు నన్ను అదృష్ట వంతునిగా ఎంచెను. నేను కంటబడిన ప్రతివాడు నన్నుగూర్చి సాక్ష్యమిచ్చెను.
- 12ఏలయనగా మొఱ్ఱపెట్టిన దీనులను తండ్రిలేనివారిని సహాయములేనివారిని నేను విడి పించితిని.
- 13నశించుటకు సిద్ధమైయున్నవారి దీవెన నామీదికి వచ్చెను విధవరాండ్ర హృదయమును సంతోషపెట్టితిని
- 14నేను నీతిని వస్త్రముగా ధరించుకొని యుంటిని గనుక అది నన్ను ధరించెను నా న్యాయప్రవర్తన నాకు వస్త్రమును పాగాయు ఆయెను.
- 15గ్రుడ్డివారికి నేను కన్నులైతిని కుంటివారికి పాదము లైతిని.
Cross references
- 2 Timothy 1:16–18 2 తిమోతికి 1:16–18ప్రభువు ఒనేసిఫోరు ఇంటివారియందు కనికరము చూపునుగాక. అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంకెళ్లనుగూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదకి, కనుగొని, అనేక పర్యాయములు ఆదరించెను. మరియు అతడు ఎఫెసులో ఎంతగా ఉపచారముచేసెనో అది నీవు బాగుగా ఎరుగుదువు. ఆ దినమునందు అతడు ప్రభువువలన కనికరము పొందునట్లు ప్రభువు అనుగ్రహించును గాక.
- Isaiah 27:13 యెషయా 27:13ఆ దినమున పెద్ద బూర ఊదబడును అష్షూరుదేశములో నశింప సిద్ధమైనవారును ఐగుప్తుదేశములో వెలివేయబడినవారును, వచ్చెదరు, యెరూషలేములోనున్న పరిశుద్ధపర్వతమున యెహోవాకు నమస్కారము చేయుదురు.
- Job 31:19–20 యోబు 31:19–20వారి దేహములు నన్ను దీవింపకపోయినయెడలను వారు నా గొఱ్ఱెలబొచ్చుచేత వేడిమి పొందకపోయిన యెడలను గుమ్మములో నాకు సహాయము దొరకునని తండ్రిలేనివారిని నేను అన్యాయము చేసినయెడలను
- Job 22:9 యోబు 22:9విధవరాండ్రను వట్టిచేతులతో పంపివేసితివి తండ్రిలేనివారి చేతులు విరుగగొట్టితివి.
- Philemon 1:7 ఫిలేమోనుకు 1:7సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమనుబట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగెను.
- Isaiah 65:14 యెషయా 65:14నా సేవకులు హృదయానందముచేత కేకలు వేసెదరుగాని మీరు చింతాక్రాంతులై యేడ్చెదరు మనోదుఃఖముచేత ప్రలాపించెదరు.
- Psalm 67:4 కీర్తనలు 67:4జనములు సంతోషించుచు ఉత్సాహధ్వని చేయును గాక
- Nehemiah 8:10–12 నెహెమ్యా 8:10–12మరియు అతడు వారితో నిట్లనెనుపదండి, క్రొవ్విన మాంసము భక్షించుడి, మధురమైనదాని పానము చేయుడి, ఇదివరకు తమకొరకు ఏమియు సిద్ధము చేసికొనని వారికి వంతులు పంపించుడి. ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయెను, మీరు దుఃఖ పడకుడి, యెహోవాయందు ఆనందించుటవలన మీరు బలమొందుదురు. ఆలాగున లేవీయులు జనులందరిని ఓదార్చి మీరు దుఃఖము మానుడి, ఇది పరిశుద్ధదినము, మీరు దుఃఖ పడకూడదని వారితో అనిరి. ఆ తరువాత జనులు తమకు తెలియజేయబడిన మాటలన్నిటిని గ్రహించి, తినుటకును త్రాగుటకును లేనివారికి ఫలాహారములు పంపించుటకును సంభ్రమముగా ఉండుటకును ఎవరి యిండ్లకు వారు వెళ్లిరి.
- Deuteronomy 24:13 ద్వితీయోపదేశకాండము 24:13అది నీ దేవుడైన యెహోవా దృష్టికి నీకు నీతి యగును.
- 2 Corinthians 9:12–14 2 కొరింథీయులకు 9:12–14ఏలయనగా ఈ సేవనుగూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయము కలుగజేయుట మాత్రము కాకుండ, అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా విస్తరించుచున్నది. ఏలాగనగా క్రీస్తుసువార్తను అంగీకరింతుమని ఒప్పుకొనుట యందు మీరు విధేయులైనందుచేతను, వారి విషయమును అందరి విషయమును ఇంత ఔదార్యముగా ధర్మము చేసి నందుచేతను, ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యత కనబడినందున వారు దేవుని మహిమపరచుచున్నారు. మరియు మీయెడల దేవుడు కనుపరచిన అత్యధికమైన కృపను చూచి, వారు మీ నిమిత్తమై ప్రార్థన చేయుచు, మిమ్మును చూడవలెనని ఎక్కువ కోరిక గలవారై యున్నారు.
- Proverbs 31:6–9 సామెతలు 31:6–9ప్రాణము పోవుచున్నవానికి మద్యము నియ్యుడి మనోవ్యాకులముగలవారికి ద్రాక్షారసము నియ్యుడి. వారు త్రాగి తమ పేదరికము మరతురు తమ శ్రమను ఇక తలంచకుందురు. మూగవారికిని దిక్కులేనివారికందరికిని న్యాయము జరుగునట్లు నీ నోరు తెరువుము. నీ నోరు తెరచి న్యాయముగా తీర్పు తీర్చుము దీనులకును శ్రమపడువారికిని దరిద్రులకును న్యాయము జరిగింపుము.
- Acts 9:39–41 అపొస్తలుల కార్యములు 9:39–41పేతురు లేచి వారితోకూడ వెళ్లి అక్కడ చేరినప్పుడు, వారు మేడగదిలోనికి అతనిని తీసికొని వచ్చిరి; విధవరాండ్రందరు వచ్చి యేడ్చుచు, దొర్కా తమతోకూడ ఉన్నప్పుడు కుట్టిన అంగీలును వస్త్రములును చూపుచు అతని యెదుట నిలిచిరి. పేతురు అందరిని వెలుపలికి పంపి మోకాళ్లూని ప్రార్థనచేసి శవమువైపు తిరిగి తబితా, లెమ్మనగా ఆమె కన్నులు తెరచి పేతురును చూచి లేచి కూర్చుండెను. అతడామెకు చెయ్యి యిచ్చి లేవనెత్తి, పరిశుద్ధులను విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవురాలనుగా వారికి అప్పగించెను.