Job · chapter 32 · verse 3
Job 32:3 in Telugu
మరియు యోబుయొక్క ముగ్గురు స్నేహితులు ప్రత్యుత్తర మేమియు చెప్పకయే యోబుమీద దోషము మోపి నందుకు వారిమీద కూడ అతడు బహుగా కోపగించెను.
Mariyu yobuyokka mugguru snehitulu pratyuttara memiyu cheppakaye yobumeeda doshamu mopi nanduku vaarimeeda kooda atadu bahugaa kopaginchenu.
Job 32:3 in English
- King James Version (KJV)
- Also against his three friends was his wrath kindled, because they had found no answer, and [yet] had condemned Job.
- World English Bible (WEB)
- Also his wrath was kindled against his three friends, because they had found no answer, and yet had condemned Job.
- American Standard Version (ASV)
- Also against his three friends was his wrath kindled, because they had found no answer, and yet had condemned Job.
- Bible in Basic English (BBE)
- And he was angry with his three friends, because they had been unable to give him an answer, and had not made Job's sin clear.
- Darby Translation (DBY)
- and against his three friends was his anger kindled, because they found no answer, and [yet] condemned Job.
- Webster's Bible (WBS)
- Also against his three friends was his wrath kindled, because they had found no answer, and [yet] had condemned Job.
- Young's Literal Translation (YLT)
- and against his three friends hath his anger burned, because that they have not found an answer, and condemn Job.
Read in context
- 1యోబు తన దృష్టియందు తాను నీతిమంతుడై యున్నాడని ఆ ముగ్గురు మనుష్యులు తెలిసికొని అతనికి ప్రత్యుత్తరము చెప్పుట చాలించిరి.
- 2అప్పుడు రాము వంశస్థుడును బూజీయుడును బరకెయేలు కుమారుడునగు ఎలీహు, యోబు దేవునికంటె తానే నీతిమంతుడైనట్లు చెప్పుకొనుట చూచి ఆతనిమీద బహుగా కోపగించెను.
- 3మరియు యోబుయొక్క ముగ్గురు స్నేహితులు ప్రత్యుత్తర మేమియు చెప్పకయే యోబుమీద దోషము మోపి నందుకు వారిమీద కూడ అతడు బహుగా కోపగించెను.
- 4వారు ఎలీహుకన్న ఎక్కువ వయస్సుగలవారు గనుక అతడు యోబుతో మాటలాడవలెనని కనిపెట్టి యుండెను.
- 5అయితే ఎలీహు ఆ ముగ్గురు మనుష్యులు ప్రత్యుత్తర మేమియు ఇయ్యకపోవుట చూచినప్పుడు అతని కోపము రేగెను.
Cross references
- Job 8:6 యోబు 8:6నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైనయెడల నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాసస్థలమును వర్ధిల్లజేయును.
- Job 22:5–30 యోబు 22:5–30నీ చెడుతనము గొప్పది కాదా?నీ దోషములు మితిలేనివి కావా? ఏమియు ఇయ్యకయే నీ సోదరులయొద్ద నీవు తాకట్టు పుచ్చుకొంటివి వస్త్రహీనుల బట్టలను తీసికొంటివి దప్పిచేత ఆయాసపడినవారికి నీళ్లియ్యవైతివి ఆకలిగొనినవానికి అన్నము పెట్టకపోతివి. బాహుబలముగల మనుష్యునికే భూమి ప్రాప్తించును ఘనుడని యెంచబడినవాడు దానిలో నివసించును. విధవరాండ్రను వట్టిచేతులతో పంపివేసితివి తండ్రిలేనివారి చేతులు విరుగగొట్టితివి. కావుననే బోనులు నిన్ను చుట్టుకొనుచున్నవి ఆకస్మిక భయము నిన్ను బెదరించుచున్నది. నిన్ను చిక్కించుకొన్న అంధకారమును నీవు చూచుట లేదా?నిన్ను ముంచబోవు ప్రళయజలములను నీవు చూచుట లేదా? దేవుడు ఆకాశమంత మహోన్నతుడు కాడా?నక్షత్రముల ఔన్నత్యమును చూడుము అవి ఎంతపైగా నున్నవి? దేవునికి ఏమి తెలియును?గాఢాంధకారములోనుండి ఆయన న్యాయము కనుగొనునా? గాఢమైన మేఘములు ఆయనకు చాటుగా నున్నవి, ఆయన చూడలేదుఆకాశములో ఆయన తిరుగుచున్నాడు అని నీవనుకొనుచున్నావు. పూర్వమునుండి దుష్టులు అనుసరించిన మార్గమును నీవు అనుసరించెదవా? వారు అకాలముగా ఒక నిమిషములో నిర్మూలమైరివారి పునాదులు జలప్రవాహమువలె కొట్టుకొని పోయెను. ఆయన మంచి పదార్థములతో వారి యిండ్లను నింపినను మాయొద్ద నుండి తొలగిపొమ్మనియు సర్వశక్తుడగు దేవుడు మాకు ఏమి చేయుననియు వారు దేవునితో అందురు. భక్తిహీనుల ఆలోచన నాకు దూరమై యుండునుగాక. మన విరోధులు నిశ్చయముగా నిర్మూలమైరనియు వారి సంపదను అగ్ని కాల్చివేసెననియు పలుకుచు నీతిమంతులు దాని చూచి సంతోషించుదురు నిర్దోషులు వారిని హేళన చేయుదురు. ఆయనతో సహవాసము చేసినయెడల నీకు సమాధానము కలుగునుఆలాగున నీకు మేలు కలుగును. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము. సర్వశక్తునివైపు నీవు తిరిగినయెడలనీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించినయెడల నీవు అభివృద్ధి పొందెదవు. మంటిలో నీ బంగారమును ఏటిరాళ్లలో ఓఫీరు సువర్ణమును పారవేయుము అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును. అప్పుడు సర్వశక్తునియందు నీవు ఆనందించెదవుదేవునితట్టు నీ ముఖము ఎత్తెదవు. నీవు ఆయనకు ప్రార్థనచేయగాఆయన నీ మనవి నాలకించునునీ మ్రొక్కుబళ్లు నీవు చెల్లించెదవు. మరియు నీవు దేనినైన యోచనచేయగా అది నీకుస్థిరపరచబడునునీ మార్గములమీద వెలుగు ప్రకాశించును. నీవు పడద్రోయబడినప్పుడుమీదు చూచెదనందువువినయముగలవానిని ఆయన రక్షించును. నిర్దోషికానివానినైనను ఆయన విడిపించును. అతడు నీ చేతుల శుద్ధివలన విడిపింపబడును.
- Job 24:25 యోబు 24:25ఇప్పుడు ఈలాగు జరుగని యెడల నేను అబద్ధికుడనని రుజువుపరచువాడెవడు? నా మాటలు వట్టివని దృష్టాంతపరచువాడెవడు?
- Job 25:2–6 యోబు 25:2–6అధికారమును భీకరత్వమును ఆయనకు తోడైయున్నవిఆయన తన ఉన్నతస్థలములలో సమాధానము కలుగ జేయును. ఆయన సేనలను లెక్కింప శక్యమా?ఆయన వెలుగు ఎవరిమీదనైనను ఉదయింపకుండునా? నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు?స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడుకాగలడు? ఆయన దృష్టికి చంద్రుడు కాంతిగలవాడు కాడునక్షత్రములు పవిత్రమైనవి కావు. మరి నిశ్చయముగా పురుగువంటి మనుష్యుడు పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరడు గదా.
- Job 26:2–4 యోబు 26:2–4శక్తిలేనివానికి నీవు ఎంత సహాయము చేసితివి? బలములేని బాహువును ఎంత బాగుగా రక్షించితివి? జ్ఞానము లేనివానికి నీ వెంత చక్కగా ఆలోచనచెప్పితివి? సంగతిని ఎంత చక్కగా వివరించితివి? నీవు ఎవనియెదుట మాటలను ఉచ్చరించితివి? ఎవని ఊపిరి నీలోనుండి బయలుదేరినది?
- Acts 24:5 అపొస్తలుల కార్యములు 24:5ఈ మనుష్యుడు పీడవంటివాడును, భూలోకమందున్న సకలమైన యూదులను కలహమునకు రేపు వాడును, నజరేయుల మతభేదమునకు నాయకుడునై యున్నట్టు మేము కనుగొంటిమి,
- Job 15:34 యోబు 15:34భక్తిహీనుల కుటుంబము నిస్సంతువగును. లంచగొండుల గుడారములను అగ్ని కాల్చివేయును
- Job 32:1 యోబు 32:1యోబు తన దృష్టియందు తాను నీతిమంతుడై యున్నాడని ఆ ముగ్గురు మనుష్యులు తెలిసికొని అతనికి ప్రత్యుత్తరము చెప్పుట చాలించిరి.
- Acts 24:13 అపొస్తలుల కార్యములు 24:13మరియు వారు ఇప్పుడు నామీద మోపు నేరములను తమరికి ఋజువుపరచలేరు.