Job · chapter 37 · verse 15
Job 37:15 in Telugu
దేవుడు తన మేఘపు మెరుపు ప్రకాశింపవలెనని యెట్లు తీర్మానముచేయునో నీకు తెలియునా?
Devudu tana meghapu merupu prakaashimpavalenani yetlu teermaanamucheyuno neeku teliyunaa?
Job 37:15 in English
- King James Version (KJV)
- Dost thou know when God disposed them, and caused the light of his cloud to shine?
- World English Bible (WEB)
- Do you know how God controls them, and causes the lightning of his cloud to shine?
- American Standard Version (ASV)
- Dost thou know how God layeth [his charge] upon them, And causeth the lightning of his cloud to shine?
- Bible in Basic English (BBE)
- Have you knowledge of God's ordering of his works, how he makes the light of his cloud to be seen?
- Darby Translation (DBY)
- Dost thou know how God hath disposed them, and how he causeth the lightning of his cloud to flash?
- Webster's Bible (WBS)
- Dost thou know when God disposed them, and caused the light of his cloud to shine?
- Young's Literal Translation (YLT)
- Dost thou know when God doth place them, And caused to shine the light of His cloud?
Read in context
- 13శిక్షకొరకే గాని తన భూలోకముకొరకే గాని కృప చేయుటకే గాని ఆయన ఆజ్ఞాపించినదానిని అవి నెరవేర్చును.
- 14యోబూ, ఈ మాట ఆలకింపుము ఊరకుండి దేవుని అద్భుతక్రియలను ఆలోచింపుము.
- 15దేవుడు తన మేఘపు మెరుపు ప్రకాశింపవలెనని యెట్లు తీర్మానముచేయునో నీకు తెలియునా?
- 16మేఘములను తేలచేయుటయు పరిపూర్ణజ్ఞానము గలవాని మహా కార్యములును నీకు తెలియునా?
- 17దక్షిణపుగాలి వీచుటచేత ఉబ్బవేయునప్పుడు నీ వస్త్రములెట్లు వెచ్చబడినది నీకు తెలియునా?
Cross references
- Job 36:30–32 యోబు 36:30–32ఆయన తనచుట్టు తన మెరుపును వ్యాపింపజేయును సముద్రపు అడుగుభాగమును ఆయన కప్పును. వీటివలన ఆయన ఆ యా ప్రజలకు తీర్పుతీర్చును. ఆయన ఆహారమును సమృద్ధిగా ఇచ్చువాడు ఇరుప్రక్కలను ఆయన మెరుపులు మెరిపించును గురికి తగలవలెనని ఆయన దానికి ఆజ్ఞాపించును
- Job 37:11 యోబు 37:11మరియు ఆయన దట్టమైన మేఘమును జలముతో నింపును తన మెరుపుగల మేఘమును వ్యాపింపజేయును.
- Job 38:4–41 యోబు 38:4–41నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంటివి?నీకు వివేకము కలిగియున్నయెడల చెప్పుము. నీకు తెలిసినయెడల దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము. దానిమీద పరిమాణపు కొల వేసినవాడెవడో చెప్పుము. దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము. ఉదయనక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరును ఆనందించి జయధ్వనులు చేసి నప్పుడు దాని మూలరాతిని వేసినవాడెవడు? సముద్రము దాని గర్భమునుండి పొర్లి రాగా తలుపులచేత దానిని మూసినవాడెవడు? నేను మేఘమును దానికి వస్త్రముగాను గాఢాంధకారమును దానికి పొత్తిగుడ్డగాను వేసి నప్పుడు నీవుంటివా? దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డగడియలను తలుపులను పెట్టించినప్పుడు నీవు ఇంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదనియు ఇక్కడనే నీ తరంగముల పొంగు అణపబడుననియు నేను చెప్పినప్పుడు నీవుంటివా? అరుణోదయము భూమి దిగంతములవరకు వ్యాపించు నట్లును అది దుష్టులను తనలోనుండకుండ దులిపివేయునట్లును నీ వెప్పుడైన ఉదయమును కలుగజేసితివా? అరుణోదయమునకు దాని స్థలమును తెలిపితివా? ముద్రవలన మంటికి రూపము కలుగునట్లు అది పుట్టగా భూముఖము మార్పునొందును విచిత్రమైన పనిగల వస్త్రమువలె సమస్తమును కనబడును. దుష్టుల వెలుగు వారియొద్దనుండి తీసివేయబడును వారెత్తిన బాహువు విరుగగొట్టబడును. సముద్రపు ఊటలలోనికి నీవు చొచ్చితివా?మహాసముద్రము అడుగున నీవు సంచరించితివా? మరణద్వారములు నీకు తెరవబడెనా? మరణాంధకార ద్వారములను నీవు చూచితివా? భూమి వైశాల్యత ఎంతో నీవు గ్రహించితివా? నీకేమైన తెలిసివయెడల చెప్పుము. వెలుగు నివసించు చోటునకు పోవు మార్గమేది?చీకటి అనుదాని ఉనికిపట్టు ఏది? దాని సరిహద్దునకు నీవు వెలుగును కొనిపోవుదువా? దాని గృహమునకు పోవు త్రోవలను నీవెరుగుదువా?ఇదంతయు నీకు తెలిసియున్నది గదా. నీవు బహు వృద్ధుడవు నీవు అప్పటికి పుట్టియుంటివి. నీవు హిమముయొక్క నిధులలోనికి చొచ్చితివా? ఆపత్కాలముకొరకును యుద్ధముకొరకును యుద్ధ దినముకొరకును నేను దాచియుంచిన వడగండ్ల నిధులను నీవు చూచితివా? వెలుగు విభాగింపబడు చోటికి మార్గమేది? తూర్పు గాలి యెక్కడనుండి వచ్చి భూమిమీద నఖ ముఖములను వ్యాపించును? నిర్మానుష్య ప్రదేశముమీదను జనులులేని యెడారిలోను వర్షము కురిపించుటకును పాడైన యెడారిని తృప్తిపరచుటకునులేత గడ్డి మొలిపించుటకును వరద నీటికి కాలువలను ఉరుములోని మెరుపునకు మార్గమును నిర్ణయించువాడెవడు? వర్షమునకు తండ్రి యున్నాడా? మంచు బిందువులను పుట్టించువాడెవడు? మంచుగడ్డ యెవని గర్భములోనుండి వచ్చును? ఆకాశమునుండి దిగు మంచును ఎవడు పుట్టించును? జలములు రాతివలె గడ్డకట్టును అగాధజలముల ముఖము గట్టిపరచబడును. కృత్తిక నక్షత్రములను నీవు బంధింపగలవా? మృగశీర్షకు కట్లను విప్పగలవా? వాటి వాటి కాలములలో నక్షత్రరాసులను వచ్చు నట్లు చేయగలవా? సప్తర్షి నక్షత్రములను వాటి ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా? ఆకాశమండలపు కట్టడలను నీవెరుగుదువా? దానికి భూమిమీదగల ప్రభుత్వమును నీవు స్థాపింప గలవా? జలరాసులు నిన్ను కప్పునట్లు మేఘములకు నీవు ఆజ్ఞ ఇయ్యగలవా? మెరుపులు బయలువెళ్లి చిత్తము ఉన్నామని నీతో చెప్పునట్లు నీవు వాటిని బయటికి రప్పింపగలవా? అంతరింద్రియములలో జ్ఞానముంచిన వాడెవడు? హృదయమునకు తెలివి నిచ్చినవాడెవడు? జ్ఞానముచేత మేఘములను వివరింపగలవాడెవడు? ధూళి బురదయై పారునట్లును మంటిపెడ్డలు ఒకదానికొకటి అంటుకొనునట్లును ఆకాశపు కలశములలోని వర్షమును కుమ్మరించువాడెవడు? ఆడుసింహము నిమిత్తము నీవు ఎరను వేటాడెదవా? సింహపుపిల్లలు తమ తమ గుహలలో పండుకొను నప్పుడు తమ గుహలలో పొంచి యుండునప్పుడు నీవు వాటి ఆకలి తీర్చెదవా? తిండిలేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొఱ్ఱపెట్టునప్పుడు కాకికి ఆహారము సిద్ధపరచువాడెవడు?
- Isaiah 40:26 యెషయా 40:26మీకన్నులు పైకెత్తి చూడుడి వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్కచొప్పున వీటి సమూహములను బయలు దేరజేసి వీటన్నిటికిని పేరులు పెట్టి పిలుచువాడే గదా. తన అధికశక్తిచేతను తనకు కలిగియున్న బలాతిశయము చేతను ఆయన యొక్కటియైనను విడిచిపెట్టడు.
- Job 28:24–27 యోబు 28:24–27ఆయన భూమ్యంతములవరకు చూచుచున్నాడు. ఆకాశము క్రింది దానినంతటిని తెలిసికొనుచున్నాడు. గాలికి ఇంత బరువు ఉండవలెనని ఆయన నియమించి నప్పుడు ప్రమాణమునుబట్టి జలములకు ఇంత కొలతయని ఆయన వాటిని కొలిచి చూచినప్పుడు వర్షమునకు కట్టడ నియమించినప్పుడు ఉరుముతో కూడిన మెరుపునకు మార్గము ఏర్పరచినప్పుడు ఆయన దాని చూచి బయలుపరచెను దానిని స్థాపనచేసి దాని పరిశోధించెను.
- Psalm 119:90–91 కీర్తనలు 119:90–91నీ విశ్వాస్యత తరతరములుండును. నీవు భూమిని స్థాపించితివి అది స్థిరముగానున్నది సమస్తము నీకు సేవచేయుచున్నవి కావున నీ నిర్ణయముచొప్పున అవి నేటికిని స్థిరపడి యున్నవి
- Job 34:13 యోబు 34:13ఎవడైన భూమిని ఆయనకు అప్పగింతపెట్టెనా? ఎవడైన సర్వప్రపంచ భారమును ఆయన కప్పగించెనా?