Joel · chapter 2 · verse 21
Joel 2:21 in Telugu
దేశమా, భయపడక సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్పకార్యములు చేసెను.
Deshamaa, bhayapadaka santoshinchi gantulu veyumu, yehovaa goppakaaryamulu chesenu.
Joel 2:21 in English
- King James Version (KJV)
- Fear not, O land; be glad and rejoice: for the LORD will do great things.
- World English Bible (WEB)
- Land, don’t be afraid. Be glad and rejoice, for the LORD has done great things.
- American Standard Version (ASV)
- Fear not, O land, be glad and rejoice; for Jehovah hath done great things.
- Bible in Basic English (BBE)
- Have no fear, O land; be glad with great joy; for the Lord has done great things.
- Darby Translation (DBY)
- — Fear not, O land; be glad and rejoice: for Jehovah doeth great things.
- Webster's Bible (WBS)
- Fear not, O land; be glad and rejoice: for the LORD will do great things.
- Young's Literal Translation (YLT)
- Do not fear, O land! joy and rejoice, For Jehovah hath exerted Himself to work.
Read in context
- 19మరియు యెహోవా తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పినదే మనగాఇకను అన్యజనులలో మిమ్మును అవమానాస్పదముగా చేయక, మీరు తృప్తినొందునంతగా నేను ధాన్యమును క్రొత్త ద్రాక్షారసమును తైలమును మీకు పంపించెదను
- 20మరియు ఉత్తరదిక్కునుండి వచ్చువాటిని మీకు దూరముగా పార దోలి, యెండిపోయిన నిష్ఫల భూమిలోనికి వాటిని తోలివేతును; అవి గొప్ప కార్యములు చేసెను గనుక వాటి ముందటి భాగమును తూర్పు సముద్రములోకిని, వెనుకటి భాగమును పడమటి సముద్రములోకిని పడగొట్టుదును; అక్కడ వాటి దుర్గంధము లేచును అవి కుళ్లువాసన కొట్టును.
- 21దేశమా, భయపడక సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్పకార్యములు చేసెను.
- 22పశువులారా, భయపడకుడి, గడ్డిబీళ్లలో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును, అంజూరపుచెట్లును, ద్రాక్షచెట్లు సమృద్ధిగా ఫలించును,
- 23సీయోను జనులారా, ఉత్సహించి మీ దేవుడైన యెహోవాయందు సంతోషించుడి; తన నీతినిబట్టి ఆయన తొలకరి వర్షమును మీకనుగ్రహించును, వాన కురిపించి పూర్వమందువలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకనుగ్రిహించును
Cross references
- Zephaniah 3:16–17 జెఫన్యా 3:16–17ఆ దినమున జనులు మీతో ఇట్లందురు యెరూషలేమూ, భయపడ కుము, సీయోనూ, ధైర్యము తెచ్చుకొనుము; నీ దేవుడైన యెహోవా నీమధ్య ఉన్నాడు; ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీయందు సంతోషించును, నీయందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీయందలి సంతోషముచేత ఆయన హర్షించును.
- Psalm 126:1–3 కీర్తనలు 126:1–3సీయోనుకు తిరిగి వచ్చినవారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకనినవారివలె నుంటిమి మన నోటి నిండ నవ్వుండెను మన నాలుక ఆనందగానముతో నిండియుండెను. అప్పుడుయెహోవా వీరికొరకు గొప్పకార్యములు చేసెనని అన్యజనులు చెప్పుకొనిరి. యెహోవా మనకొరకు గొప్పకార్యములు చేసి యున్నాడు మనము సంతోషభరితులమైతివిు.
- Isaiah 41:10 యెషయా 41:10నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక యేర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను నీకు తోడైయున్నాను భయపడకుము నేను నీ దేవుడనై యున్నాను దిగులుపడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే నీతియను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొం దును.
- Isaiah 54:4 యెషయా 54:4భయపడకుము నీవు సిగ్గుపడనక్కరలేదు అవమానమును తలంచకుము నీవు లజ్జపడనక్కరలేదు, నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచుదువు నీ వైధవ్యపు నిందను ఇకమీదట జ్ఞాపకము చేసికొనవు.
- 1 Samuel 12:16 1 సమూయేలు 12:16మీరు నిలిచి చూచుచుండగా యెహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి.
- Jeremiah 33:3 యిర్మీయా 33:3నాకు మొఱ్ఱపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చెదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును.
- Jeremiah 30:9–10 యిర్మీయా 30:9–10వారు తమ దేవుడైన యెహోవా నగు నేను వారిమీద రాజుగా నియమించు దావీదును సేవించుదురు. మరియు యెహోవా సెలవిచ్చునదేమనగా నా సేవకుడవైన యాకోబూ, భయపడకుము; ఇశ్రాయేలూ, విస్మయమొందకుము, నేను దూరముననుండు నిన్నును, చెర లోనికి పోయిన దేశముననుండు నీ సంతానపువారిని రక్షించుచున్నాను; బెదరించువాడు లేకుండ యాకోబు సంతతి తిరిగి వచ్చి నిమ్మళించి నెమ్మది పొందును.
- 1 Samuel 12:24 1 సమూయేలు 12:24ఆయన మీకొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసెనో అది మీరు తలంచుకొని, మీరు యెహోవాయందు భయభక్తులు కలిగి, నిష్కపటులై పూర్ణహృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము.
- Isaiah 35:1 యెషయా 35:1అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును అడవి ఉల్లసించి కస్తూరిపుష్పమువలె పూయును
- Psalm 65:12–13 కీర్తనలు 65:12–13అడవి బీడులు సారము చిలకరించుచున్నవి కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొని యున్నవి. పచ్చికపట్లు మందలను వస్త్రమువలె ధరించియున్నవి. లోయలు సస్యములతో కప్పబడియున్నవి అన్నియు సంతోషధ్వని చేయుచున్నవి అన్నియు గానము చేయుచున్నవి.
- Deuteronomy 4:32 ద్వితీయోపదేశకాండము 4:32దేవుడు భూమిమీద నరుని సృజించిన దినము మొదలు కొని నీకంటె ముందుగానుండిన మునుపటి దినములలో ఆకాశము యొక్క యీ దిక్కునుండి ఆకాశముయొక్క ఆ దిక్కువరకు ఇట్టి గొప్ప కార్యము జరిగెనా? దీనివంటి వార్త వినబడెనా? అని నీవు అడుగుము
- Joel 2:20 యోవేలు 2:20మరియు ఉత్తరదిక్కునుండి వచ్చువాటిని మీకు దూరముగా పార దోలి, యెండిపోయిన నిష్ఫల భూమిలోనికి వాటిని తోలివేతును; అవి గొప్ప కార్యములు చేసెను గనుక వాటి ముందటి భాగమును తూర్పు సముద్రములోకిని, వెనుకటి భాగమును పడమటి సముద్రములోకిని పడగొట్టుదును; అక్కడ వాటి దుర్గంధము లేచును అవి కుళ్లువాసన కొట్టును.