John · chapter 7 · verse 19
John 7:19 in Telugu
మోషే మీకు ధర్మశాస్త్రము ఇయ్యలేదా? అయినను మీలో ఎవడును ఆ ధర్మశాస్త్ర మును గైకొనడు; మీరెందుకు నన్ను చంప జూచుచున్నారని వారితో చెప్పెను.
Moshe meeku dharmashaastramu iyyaledaa? Ayinanu meelo evadunu aa dharmashaastra munu gaikonadu; meerenduku nannu champa joochuchunnaarani vaarito cheppenu.
John 7:19 in English
- King James Version (KJV)
- Did not Moses give you the law, and [yet] none of you keepeth the law? Why go ye about to kill me?
- World English Bible (WEB)
- Didn’t Moses give you the law, and yet none of you keeps the law? Why do you seek to kill me?”
- American Standard Version (ASV)
- Did not Moses give you the law, and [yet] none of you doeth the law? Why seek ye to kill me?
- Bible in Basic English (BBE)
- Did not Moses give you the law? Even so, not one of you keeps the law. Why have you a desire to put me to death?
- Darby Translation (DBY)
- Has not Moses given you the law, and no one of you practises the law? Why do ye seek to kill me?
- Webster's Bible (WBS)
- Did not Moses give you the law, and [yet] none of you keepeth the law? Why go ye about to kill me?
- Young's Literal Translation (YLT)
- hath not Moses given you the law? and none of you doth the law; why me do ye seek to kill?'
Read in context
- 17ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొనినయెడల, ఆ బోధ దేవునివలన కలిగినదో, లేక నా యంతట నేనే బోధించు చున్నానో, వాడు తెలిసికొనును.
- 18తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదకును గాని తన్ను పంపినవాని మహి మను వెదకువాడు సత్యవంతుడు, ఆయన యందు ఏ దుర్నీతియులేదు.
- 19మోషే మీకు ధర్మశాస్త్రము ఇయ్యలేదా? అయినను మీలో ఎవడును ఆ ధర్మశాస్త్ర మును గైకొనడు; మీరెందుకు నన్ను చంప జూచుచున్నారని వారితో చెప్పెను.
- 20అందుకు జనసమూహము నీవు దయ్యము పట్టినవాడవు, ఎవడు నిన్ను చంప జూచుచున్నాడని అడుగగా
- 21యేసు వారిని చూచి నేను ఒక కార్యము చేసితిని; అందుకు మీరందరు ఆశ్చర్యపడు చున్నారు.
Cross references
- John 1:17 యోహాను 1:17ధర్మశాస్త్రము మోషేద్వారా అను గ్రహింపబడెను; కృపయు సత్యమును యేసు క్రీస్తుద్వారా కలిగెను.
- John 7:1 యోహాను 7:1అటు తరువాత యూదులు ఆయనను చంప వెదకి నందున యేసు యూదయలో సంచరించనొల్లక గలిలయలో సంచరించుచుండెను.
- Matthew 12:14 మత్తయి 12:14అంతట పరిసయ్యులు వెలుపలికి పోయి, ఆయనను ఏలాగు సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి.
- John 11:53 యోహాను 11:53కాగా ఆ దినమునుండి వారు ఆయనను చంప నాలో చించుచుండిరి.
- Galatians 6:13 గలతీయులకు 6:13అయితే వారు సున్నతిపొందిన వారైనను ధర్మశాస్త్రము ఆచరింపరు; తాము మీ శరీరవిషయమందు అతిశయించు నిమిత్తము మీరు సున్నతి పొందవలెనని కోరుచున్నారు.
- Deuteronomy 1:17 ద్వితీయోపదేశకాండము 1:17తీర్పు తీర్చు నప్పుడు అల్పుల సంగతి గాని ఘనుల సంగతి గాని పక్ష పాతములేకుండ వినవలెను; న్యాయపుతీర్పు దేవునిదే. కాబట్టి మీరు మనుష్యుని ముఖము చూచి భయపడవద్దు. మీకు అసాధ్యమైన కఠినవ్యాజ్యెమును నాయొద్దకు తీసి కొని రావలెను; నేను దానిని విచారించెదనని వారి కాజ్ఞా పించితిని.
- Exodus 24:2–3 నిర్గమకాండము 24:2–3మోషే మాత్రము యెహోవాను సమీపింపవలెను, వారు సమీ పింపకూడదు, ప్రజలు అతనితో ఎక్కి రాకూడదు. మోషే వచ్చి యెహోవా మాటలన్నిటిని విధులన్నిటిని ప్రజలతో వివరించి చెప్పెను. ప్రజలందరుయెహోవా చెప్పిన మాట లన్నిటి ప్రకారము చేసెదమని యేక శబ్దముతో ఉత్తరమిచ్చిరి.
- Deuteronomy 33:4 ద్వితీయోపదేశకాండము 33:4మోషే మనకు ధర్మశాస్త్రమును విధించెను అది యాకోబు సమాజ స్వాస్థ్యము.
- Mark 3:4 మార్కు 3:4వారిని చూచివిశ్రాంతి దినమున మేలుచేయుట ధర్మమా కీడు చేయుట ధర్మమా? ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా! అని అడి గెను; అందుకు వారు ఊరకుండిరి.
- John 5:45 యోహాను 5:45మీరాశ్రయించుచున్న మోషే మీమీద నేరము మోపును.
- Psalm 2:1–6 కీర్తనలు 2:1–6అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు? జనములు ఏల వ్యర్థమైనదానిని తలంచుచున్నవి? మనము వారి కట్లు తెంపుదము రండివారి పాశములను మనయొద్ద నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికిని విరోధముగా నిలువబడుచున్నారు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు ప్రభువు వారినిచూచి అపహసించుచున్నాడు ఆయన ఉగ్రుడై వారితో పలుకును ప్రచండ కోపముచేత వారిని తల్లడింపజేయును నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీదనా రాజును ఆసీనునిగా చేసియున్నాను
- Romans 2:12–13 రోమీయులకు 2:12–13ధర్మశాస్త్రము కలిగినవారై పాపము చేసినవారందరు ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నొందు దురు. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతి మంతులు కారుగాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు.