John · chapter 8 · verse 5
John 8:5 in Telugu
అట్టివారిని రాళ్లు రువి్వ చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మన కాజ్ఞాపించెను గదా; అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయన నడిగిరి.
Attivaarini raallu ruvi్va champavalenani dharmashaastramulo moshe mana kaajnyaapinchenu gadaa; ayinanu neevemi cheppuchunnaavani aayana nadigiri.
John 8:5 in English
- King James Version (KJV)
- Now Moses in the law commanded us, that such should be stoned: but what sayest thou?
- World English Bible (WEB)
- Now in our law, Moses commanded us to stone such women. What then do you say about her?”
- American Standard Version (ASV)
- Now in the law Moses commanded us to stone such: what then sayest thou of her?
- Bible in Basic English (BBE)
- Now in the law Moses gave directions that such women were to be stoned; what do you say about it?
- Darby Translation (DBY)
- Now in the law Moses has commanded us to stone such; thou therefore, what sayest thou?
- Webster's Bible (WBS)
- Now Moses in the law commanded us, that such should be stoned; but what sayest thou?
- Young's Literal Translation (YLT)
- and in the law, Moses did command us that such be stoned; thou, therefore, what dost thou say?'
Read in context
- 3శాస్త్రులును పరిసయ్యులును, వ్యభిచారమందు పట్టబడిన యొక స్త్రీని తోడు కొనివచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి
- 4బోధకుడా, యీ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను;
- 5అట్టివారిని రాళ్లు రువి్వ చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మన కాజ్ఞాపించెను గదా; అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయన నడిగిరి.
- 6ఆయనమీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఈలాగున అడిగిరి. అయితే యేసు వంగి, నేలమీద వ్రేలితో ఏమో వ్రాయుచుండెను.
- 7వారాయనను పట్టువదలక అడుగుచుండగా ఆయన తలయెత్తి చూచిమీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమెమీద రాయి వేయ వచ్చునని వారితో చెప్పి
Cross references
- Leviticus 20:10 లేవీయకాండము 20:10పరుని భార్యతో వ్యభిచరించిన వానికి, అనగా తన పొరుగు వాని భార్యతో వ్యభిచరించినవానికిని ఆ వ్యభిచారిణికిని మరణశిక్ష విధింపవలెను.
- Deuteronomy 22:21–24 ద్వితీయోపదేశకాండము 22:21–24వారు ఆమె తండ్రి యింటి యొద్దకు ఆ చిన్నదానిని తీసికొని రావలెను. అప్పుడు ఆమె ఊరి వారు ఆమెను రాళ్లతో చావగొట్టవలెను. ఏల యనగా ఆమె తన తండ్రియింట వ్యభిచరించి ఇశ్రా యేలీయులలో దుష్కార్యము చేసెను. అట్లు ఆ చెడు తనమును మీ మధ్యనుండి మీరు పరిహరించుదురు. ఒకడు మగనాలితో శయనించుచుండగా కనబడిన యెడల వారిద్దరు, అనగా ఆ స్త్రీతో శయనించిన పురు షుడును ఆ స్త్రీయును చంపబడవలెను. అట్లు ఆ చెడు తనమును ఇశ్రాయేలులోనుండి పరిహరించుదురు. కన్యకయైన చిన్నది ప్రధానము చేయబడిన తరువాత ఒకడు ఊరిలో ఆమెను కలిసికొని ఆమెతో శయనించిన యెడల ఆ ఊరి గవినియొద్దకు వారిద్దరిని తీసికొనివచ్చి, ఆ చిన్నది ఊరిలో కేకలు వేయకయున్నందున ఆమెను, తన పొరుగువాని భార్యను అవమానపరచినందున ఆ మను ష్యుని, రాళ్లతో చావగొట్టవలెను. అట్లు ఆ చెడు తనమును మీలోనుండి పరిహరించుదురు.
- Ezekiel 16:38–40 యెహెజ్కేలు 16:38–40జారిణులై హత్యలు జరిగించు స్త్రీలకు రావలసిన తీర్పు నీకు విధించి, క్రోధముతోను రోషముతోను నీకు రక్తము నియమింతును. వారి చేతికి నిన్ను అప్పగించెదను, నీవు కట్టిన గుళ్లను వారు పడద్రోసి నీవు నిలువబెట్టిన బలిపీఠములను ఊడబెరికి నీ బట్టలను తీసివేసి నీ సొగసైన ఆభరణములను తీసికొని నిన్ను దిగంబరిగాను వస్త్రహీనురాలుగాను చేయుదురు. వారు నీమీదికి సమూహములను రప్పించి నిన్ను రాళ్లతో కొట్టి చంపుదురు, కత్తులచేత నిన్ను పొడిచి వేయుదురు.
- Matthew 5:17 మత్తయి 5:17ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టి వేయవచ్చితినని తలంచవద్దు; నెరవేర్చుటకే గాని కొట్టి వేయుటకు నేను రాలేదు.
- Matthew 19:6–8 మత్తయి 19:6–8కాబట్టి వారికను ఇద్దరుకాక ఏకశరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరచినవారిని మనుష్యుడు వేరుపరచ కూడదని చెప్పెను. అందుకు వారు ఆలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడుమని మోషే యెందుకు ఆజ్ఞాపించెనని వారాయనను అడుగగా ఆయనమీ హృదయకాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చెను, గాని ఆదినుండి ఆలాగు జరుగలేదు.
- Matthew 22:16–18 మత్తయి 22:16–18బోధకుడా, నీవు సత్యవంతుడవై యుండి, దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు, నీవు ఎవనిని లక్ష్యపెట్టవనియు, మోమాటము లేనివాడవనియు ఎరుగుదుము. నీకేమి తోచుచున్నది? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా? కాదా? మాతో చెప్పుమని అడుగుటకు హేరోదీయులతో కూడ తమ శిష్యులను ఆయనయొద్దకు పంపిరి. యేసు వారి చెడు తన మెరిగి వేషధారులారా, నన్నెందుకు శోధించు చున్నారు?
- Ezekiel 23:47 యెహెజ్కేలు 23:47ఆ సైనికులు రాళ్లు రువ్వి వారిని చంపుదురు, ఖడ్గముచేత హతము చేయుదురు, వారి కుమారులను కుమార్తెలను చంపుదురు, వారి యిండ్లను అగ్నిచేత కాల్చివేయుదురు.