Lamentations · chapter 5 · verse 19
Lamentations 5:19 in Telugu
యెహోవా, నీవు నిత్యము ఆసీనుడవై యుందువు నీ సింహాసనము తరతరములుండును.
Yehovaa, neevu nityamu aaseenudavai yunduvu nee sinhaasanamu tarataramulundunu.
Lamentations 5:19 in English
- King James Version (KJV)
- Thou, O LORD, remainest for ever; thy throne from generation to generation.
- World English Bible (WEB)
- You, LORD, remain forever. Your throne is from generation to generation.
- American Standard Version (ASV)
- Thou, O Jehovah, abidest for ever; Thy throne is from generation to generation.
- Bible in Basic English (BBE)
- You, O Lord, are seated as King for ever; the seat of your power is eternal.
- Darby Translation (DBY)
- Thou, Jehovah, dwellest for ever; thy throne is from generation to generation.
- Webster's Bible (WBS)
- Thou, O LORD, remainest for ever; thy throne from generation to generation.
- Young's Literal Translation (YLT)
- Thou, O Jehovah, to the age remainest, Thy throne to generation and generation.
Read in context
- 17దీనివలన మాకు ధైర్యము చెడియున్నది. సీయోను పర్వతము పాడైనది.
- 18నక్కలు దానిమీద తిరుగులాడుచున్నవి మా కన్నులు దీని చూచి మందగిలెను.
- 19యెహోవా, నీవు నిత్యము ఆసీనుడవై యుందువు నీ సింహాసనము తరతరములుండును.
- 20నీవు మమ్ము నెల్లప్పుడును మరచిపోవుట ఏల? మమ్ము నింతకాలము విడిచిపెట్టుట ఏల?
- 21యెహోవా, నీవు మమ్మును నీతట్టు త్రిప్పినయెడల మేము తిరిగెదము. మా పూర్వస్థితి మరల మాకు కలుగజేయుము.
Cross references
- Psalm 102:12 కీర్తనలు 102:12యెహోవా, నీవు నిత్యము సింహాసనాసీనుడవు నీ నామస్మరణ తరతరములుండును.
- Hebrews 1:8–12 హెబ్రీయులకు 1:8–12గాని తన కుమారునిగూర్చియైతే దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచునది;నీ రాజదండము న్యాయార్థమయినది. నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి అందుచేత దేవుడు నీతోడివారికంటె నిన్ను హెచ్చించునట్లుగా ఆనందతైలముతో అభిషేకించెను. మరియు ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి ఆకాశములుకూడ నీ చేతిపనులే అవి నశించును గాని నీవు నిలిచియుందువు అవన్నియు వస్త్రమువలె పాతగిలును ఉత్తరీయమువలె వాటిని మడిచివేతువు అవి వస్త్రమువలె మార్చబడును గాని నీవు ఏకరీతిగానే యున్నావు నీ సంవత్సరములు తరుగవు అని చెప్పుచున్నాడు.
- Psalm 45:6 కీర్తనలు 45:6దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును నీ రాజదండము న్యాయార్థమైన దండము.
- Psalm 145:13 కీర్తనలు 145:13నీ రాజ్యము శాశ్వతరాజ్యము నీ రాజ్యపరిపాలన తరతరములు నిలుచును.
- Psalm 102:25–27 కీర్తనలు 102:25–27ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి ఆకాశములు కూడ నీ చేతిపనులే. అవి నశించును గాని నీవు నిలచియుందువు అవియన్నియు వస్త్రమువలె పాతగిలును ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయుదువు అవి మార్చబడును. నీవు ఏకరీతిగా నుండువాడవు నీ సంవత్సరములకు అంతము లేదు.
- Revelation 1:8 ప్రకటన 1:8అల్ఫాయు ఓమెగయు నేనే వర్తమాన భూత భవిష్యత్కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు.
- Psalm 9:7 కీర్తనలు 9:7యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడైయున్నాడు. న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి యున్నాడు.
- 1 Timothy 1:17 1 తిమోతికి 1:17సకల యుగములలో రాజైయుండి, అక్షయుడును అదృ శ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగును గాక. ఆమేన్.
- Psalm 90:2 కీర్తనలు 90:2పర్వతములు పుట్టకమునుపు భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు యుగయుగములు నీవే దేవుడవు
- Psalm 146:10 కీర్తనలు 146:10యెహోవా నిరంతరము ఏలును సీయోనూ, నీ దేవుడు తరములన్నిటను రాజ్యము చేయును
- Habakkuk 1:12 హబక్కూకు 1:12యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆదినుండి నీవున్నవాడవు కావా? మేము మరణమునొందము; యెహోవా, తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించియున్నావు; ఆశ్రయ దుర్గమా, మమ్మును దండించుటకు వారిని పుట్టించితివి.
- Hebrews 13:8 హెబ్రీయులకు 13:8యేసుక్రీస్తు నిన్న, నేడు, ఒక్కటేరీతిగా ఉన్నాడు; అవును యుగయుగములకును ఒక్కటే రీతిగా ఉండును.