Leviticus · chapter 11 · verse 29
Leviticus 11:29 in Telugu
నేలమీద ప్రాకు జీవరాసులలో మీకు అపవిత్ర మైనవి ఏవేవనగా, చిన్నముంగిస, చిన్నపందికొక్కు, ప్రతి విధమైన బల్లి,
Nelameeda praaku jeevaraasulalo meeku apavitra mainavi evevanagaa, chinnamungisa, chinnapandikokku, prati vidhamaina balli,
Leviticus 11:29 in English
- King James Version (KJV)
- These also [shall be] unclean unto you among the creeping things that creep upon the earth; the weasel, and the mouse, and the tortoise after his kind,
- World English Bible (WEB)
- “‘These are they which are unclean to you among the creeping things that creep on the earth: the weasel, the rat, any kind of great lizard,
- American Standard Version (ASV)
- And these are they which are unclean unto you among the creeping things that creep upon the earth: the weasel, and the mouse, and the great lizard after its kind,
- Bible in Basic English (BBE)
- And these are unclean to you among things which go low down on the earth; the weasel and the mouse and the great lizard, and animals of that sort;
- Darby Translation (DBY)
- And these shall be unclean unto you among the crawling things which crawl on the earth: the mole, and the field-mouse, and the lizard, after its kind;
- Webster's Bible (WBS)
- These also [shall be] unclean to you among the creeping animals that creep upon the earth; the weasel, and the mouse, and the tortoise, after its kind,
- Young's Literal Translation (YLT)
- 'And this [is] to you the unclean among the teeming things which are teeming on the earth: the weasel, and the mouse, and the tortoise after its kind,
Read in context
- 27నాలుగు కాళ్లతో నడుచు సమస్త జీవరాసులలో ఏవి అరకాలితో నడుచునో అవన్నియు అపవిత్రములు; వాటి కళేబరములను ముట్టిన ప్రతివాడు సాయంకాలమువరకు అపవిత్రుడగును;
- 28వాటి కళేబరమును మోసిన ప్రతివాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలమువరకు అపవిత్రు డగును; అవి మీకు అపవిత్రమైనవి.
- 29నేలమీద ప్రాకు జీవరాసులలో మీకు అపవిత్ర మైనవి ఏవేవనగా, చిన్నముంగిస, చిన్నపందికొక్కు, ప్రతి విధమైన బల్లి,
- 30ఊసరవెల్లి, నేలమొసలి, తొండ, సరటము, అడవి యెలుక.
- 31ప్రాకువాటిలో ఇవి మీకు అపవిత్రములు; ఇవి చచ్చిన తరువాత వీటిని ముట్టిన ప్రతి వాడు సాయంకాలమువరకు అపవిత్రుడగును.
Cross references
- Leviticus 11:41–42 లేవీయకాండము 11:41–42నేలమీద ప్రాకు జీవరాసులన్నియు హేయములు, వాటిని తినకూడదు. నేలమీద ప్రాకు జీవరాసు లన్నిటిలో కడుపుతో చరించుదానినైనను నాలుగుకాళ్లతో చరించుదానినైనను చాలా కాళ్లుగల దానినైనను మీరు తినకూడదు; అవి హేయములు.
- Psalm 10:3 కీర్తనలు 10:3దుష్టులు తమ మనోభిలాషనుబట్టి అతిశయపడుదురు లోభులు యెహోవాను తిరస్కరింతురు
- Colossians 3:5 కొలొస్సయులకు 3:5కావున భూమిమీదనున్న మీ అవయవములను, అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనయైన ధనాపేక్షను చంపి వేయుడి.
- Leviticus 11:20–21 లేవీయకాండము 11:20–21రెక్కలుకలిగి నాలుగుకాళ్లతో చరించు చరము లన్నియు మీకు హేయములు. అయితే నాలుగుకాళ్లతో చరించుచు నేల గంతులువేయుటకు కాళ్లమీద తొడలు గల పురుగులన్ని తినవచ్చును.
- Psalm 17:13–14 కీర్తనలు 17:13–14యెహోవా లెమ్ము, వానిని ఎదుర్కొని వానిని పడ గొట్టుముదుష్టునిచేతిలోనుండి నీ ఖడ్గముచేత నన్ను రక్షింపుము లోకులచేతిలోనుండి ఈ జీవితకాలములోనే తమ పాలు పొందిన యీ లోకుల చేతిలోనుండినీ హస్తబలముచేత నన్ను రక్షింపుము. నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావువారు కుమారులు కలిగి తృప్తినొందుదురు తమ ఆస్తిని తమ పిల్లలకు విడచిపెట్టుదురు.
- Luke 16:14 లూకా 16:14ధనాపేక్షగల పరిసయ్యులు ఈ మాటలన్నియు విని ఆయనను అపహసించుచుండగా
- John 6:26 యోహాను 6:26యేసు మీరు సూచనలను చూచుటవలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుటవలననే నన్ను వెదకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
- Ephesians 4:14 ఎఫెసీయులకు 4:14అందువలన మనమిక మీదట పసిపిల్లలమై యుండి, మనుష్యుల మాయో పాయములచేత వంచనతోను, తప్పుమార్గమునకు లాగు కుయుక్తితోను, గాలికి కొట్టుకొనిపోవునట్లు, కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొనిపోవుచు అలలచేత ఎగురగొట్టబడినవారమైనట్లుండక
- Philippians 3:19 ఫిలిప్పీయులకు 3:19నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు; వారు తాము సిగ్గుపడవలసిన సంగతులయందు అతిశయపడుచున్నారు, భూసంబంధమైనవాటి యందే మనస్సు నుంచుచున్నారు.
- Hebrews 13:5 హెబ్రీయులకు 13:5ధనాపేక్షలేనివారై మీకు కలిగినవాటితో తృప్తిపొందియుండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పెను గదా.
- Luke 12:15 లూకా 12:15మరియు ఆయన వారితోమీరు ఏవిధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్తపడుడి; ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను.
- 2 Timothy 3:2–5 2 తిమోతికి 3:2–5ఏలాగనగా మనుష్యులు స్వార్థ ప్రియులు ధనాపేక్షులు బింకములాడువారు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు అనురాగరహితులు అతిద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జనద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవునికంటె సుఖాను భవము నెక్కువగా ప్రేమించువారు, పైకి భక్తిగలవారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించనివారునై యుందురు. ఇట్టివారికి విముఖుడవై యుండుము.