Leviticus · chapter 16 · verse 8
Leviticus 16:8 in Telugu
అప్పుడు అహరోను యెహోవా పేరట ఒక చీటిని, విడిచిపెట్టే మేక పేరట ఒక చీటిని ఆ రెండు మేకలమీద రెండు చీట్లను వేయవలెను.
Appudu aharonu yehovaa perata oka cheetini, vidichipette meka perata oka cheetini aa rendu mekalameeda rendu cheetlanu veyavalenu.
Leviticus 16:8 in English
- King James Version (KJV)
- And Aaron shall cast lots upon the two goats; one lot for the LORD, and the other lot for the scapegoat.
- World English Bible (WEB)
- Aaron shall cast lots for the two goats: one lot for the LORD, and the other lot for the scapegoat.
- American Standard Version (ASV)
- And Aaron shall cast lots upon the two goats; one lot for Jehovah, and the other lot for Azazel.
- Bible in Basic English (BBE)
- And Aaron will make selection from the two goats by the decision of the Lord, one goat for the Lord and one for Azazel.
- Darby Translation (DBY)
- And Aaron shall cast lots upon the two goats: one lot for Jehovah, and the other lot for Azazel.
- Webster's Bible (WBS)
- And Aaron shall cast lots upon the two goats; one lot for the LORD, and the other lot for the scape-goat.
- Young's Literal Translation (YLT)
- 'And Aaron hath given lots over the two goats, one lot for Jehovah, and one lot for a goat of departure;
Read in context
- 6అహరోను తన కొరకు పాపపరిహారార్థబలిగా ఒక కోడెను అర్పించి తన నిమిత్తమును తన యింటివారి నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసి
- 7ఆ రెండు మేకపిల్లలను తీసికొని వచ్చి, ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్ద యెహోవా సన్నిధిని వాటిని ఉంచవలెను.
- 8అప్పుడు అహరోను యెహోవా పేరట ఒక చీటిని, విడిచిపెట్టే మేక పేరట ఒక చీటిని ఆ రెండు మేకలమీద రెండు చీట్లను వేయవలెను.
- 9ఏ మేకమీద యెహోవాపేరట చీటి పడునో, ఆ మేకను అహరోను తీసికొని వచ్చి పాపపరిహారార్థబలిగా అర్పింపవలెను.
- 10ఏ మేకమీద విడిచిపెట్టుట అనే చీటి పడునో దానివలన ప్రాయ శ్చి త్తము కలుగునట్లు, దానిని అరణ్యములో విడిచిపెట్టు టకై యెహోవా సన్నిధిని దానిని ప్రాణముతోనే ఉంచ వలెను.
Cross references
- Acts 1:23–26 అపొస్తలుల కార్యములు 1:23–26అప్పుడు వారు యూస్తు అను మారుపేరుగల బర్సబ్బా అనబడిన యోసేపు, మత్తీయ అను ఇద్దరిని నిలువబెట్టి ఇట్లని ప్రార్థనచేసిరి అందరి హృదయములను ఎరిగియున్న ప్రభువా, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన యీ పరిచర్యలోను అపొస్తలత్వములోను పాలుపొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకొనినవానిని కనబరచుమనిరి. అంతట వారు వీరినిగూర్చి చీట్లువేయగా మత్తీయ పేరట చీటి వచ్చెను గనుక అతడు పదునొకండుమంది అపొస్తలులతో కూడ లెక్కింపబడెను.
- Proverbs 16:33 సామెతలు 16:33చీట్లు ఒడిలో వేయబడును వాటివలని తీర్పు యెహోవా వశము.
- Jonah 1:7 యోనా 1:7అంతలో ఓడ వారు ఎవనినిబట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలియుటకై మనము చీట్లు వేతము రండని యొకరితో ఒకరు చెప్పుకొని, చీట్లు వేయగా చీటి యోనామీదికి వచ్చెను.
- Joshua 18:10–11 యెహోషువ 18:10–11వారికొరకు యెహోషువ షిలోహులో యెహోవా సన్నిధిని వంతుచీట్లు వేసి వారి వారి వంతులచొప్పున ఇశ్రాయేలీయులకు దేశమును పంచి పెట్టెను. బెన్యామీనీయుల గోత్రమునకు వారి వంశముల చొప్పున, వంతుచీటి వచ్చెను; వారి చీటివలన కలిగిన సరిహద్దు యూదా వంశస్థుల సరిహద్దుకును యోసేపు పుత్రుల సరిహద్దుకును మధ్యనుండెను.
- 1 Samuel 14:41–42 1 సమూయేలు 14:41–42అప్పుడు సౌలుఇశ్రాయేలీయులకు దేవుడవైన యెహోవా, దోషిని కనుపరచుమని ప్రార్థింపగా సౌలు పేరటను యోనాతాను పేరటను చీటిపడెను గాని జనులు తప్పించుకొనిరి. నాకును నా కుమారుడైన యోనాతానునకును చీట్లు వేయుడని సౌలు ఆజ్ఞ ఇయ్యగా యోనాతాను పేరట చీటి పడెను.
- Ezekiel 48:29 యెహెజ్కేలు 48:29మీరు చీట్లువేసి ఇశ్రాయేలీయుల గోత్రము లకు విభాగింపవలసిన దేశము ఇదే. వారివారి భాగములు ఇవే. యిదే యెహోవా యిచ్చిన ఆజ్ఞ.
- Numbers 33:54 సంఖ్యాకాండము 33:54మీరు మీ వంశములచొప్పున చీట్లువేసి ఆ దేశమును స్వాస్థ్యములుగా పంచుకొనవలెను. ఎక్కువ మందికి ఎక్కువ స్వాస్థ్యమును తక్కువమందికి తక్కువ స్వాస్థ్యము ఇయ్యవలెను. ఎవని చీటి యే స్థలమున పడునో వానికి ఆ స్థలమే కలుగును. మీ తండ్రుల గోత్రముల చొప్పున మీరు స్వాస్థ్యములు పొందవలెను.
- Numbers 26:55 సంఖ్యాకాండము 26:55చీట్లువేసి ఆ భూమిని పంచిపెట్టవలెను. వారు తమ తమ పితరుల గోత్రముల జనసంఖ్యచొప్పున స్వాస్థ్యమును పొందవలెను.