Luke · chapter 17 · verse 3
Luke 17:3 in Telugu
మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి. నీ సహోదరుడు తప్పిదము చేసినయెడల అతని గద్దించుము; అతడు మారుమనస్సు పొందిన యెడల అతని క్షమించుము.
Mee vishayamai meere jaagrattagaa undudi. Nee sahodarudu tappidamu chesinayedala atani gaddinchumu; atadu maarumanassu pondina yedala atani kshaminchumu.
Luke 17:3 in English
- King James Version (KJV)
- Take heed to yourselves: If thy brother trespass against thee, rebuke him; and if he repent, forgive him.
- World English Bible (WEB)
- Be careful. If your brother sins against you, rebuke him. If he repents, forgive him.
- American Standard Version (ASV)
- Take heed to yourselves: if thy brother sin, rebuke him; and if he repent, forgive him.
- Bible in Basic English (BBE)
- Give attention to yourselves: if your brother does wrong, say a sharp word to him; and if he has sorrow for his sin, let him have forgiveness.
- Darby Translation (DBY)
- Take heed to yourselves: if thy brother should sin, rebuke him; and if he should repent, forgive him.
- Webster's Bible (WBS)
- Take heed to yourselves: If thy brother shall trespass against thee, rebuke him; and if he shall repent forgive him.
- Young's Literal Translation (YLT)
- 'Take heed to yourselves, and, if thy brother may sin in regard to thee, rebuke him, and if he may reform, forgive him,
Read in context
- 1ఆయన తన శిష్యులతో ఇట్లనెను అభ్యంతరములు రాకపోవుట అసాధ్యముకాని అవి ఎవనివలన వచ్చునో వానికి శ్రమ.
- 2వాడీ చిన్నవారిలో ఒకనికి అభ్యంతరము కలుగజేయుటకంటె వాని మెడకు తిరు గటిరాయి కట్టబడి సముద్రములో పడద్రోయబడుట వానికి మేలు.
- 3మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి. నీ సహోదరుడు తప్పిదము చేసినయెడల అతని గద్దించుము; అతడు మారుమనస్సు పొందిన యెడల అతని క్షమించుము.
- 4అతడు ఒక దినమున ఏడుమారులు నీయెడల తప్పిదము చేసి యేడు మారులు నీవైపుతిరిగిమారుమనస్సు పొందితి ననినయెడల అతని క్షమింపవలెననెను.
- 5అపొస్తలులుమా విశ్వాసము వృద్ధిపొందించుమని ప్రభువుతో చెప్పగా
Cross references
- Leviticus 19:17 లేవీయకాండము 19:17నీ హృదయములో నీ సహోదరుని మీద పగపట్టకూడదు, నీ పొరుగువాని పాపము నీ మీదికి రాకుండునట్లు నీవు తప్పక వానిని గద్దింపవలెను.
- Matthew 18:15–17 మత్తయి 18:15–17మరియు నీ సహోదరుడు నీయెడల తప్పిదము చేసిన యెడల నీవు పోయి, నీవును అతడును ఒంటరిగానున్నప్పుడు అతనిని గద్దించుము; అతడు నీ మాట వినినయెడల నీ సహోదరుని సంపాదించుకొంటివి. అతడు విననియెడల, ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడునట్లు నీవు ఒకరినిద్దరిని వెంటబెట్టుకొని అతనియొద్దకు పొమ్ము. అతడు వారి మాటయు విననియెడల ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పుము; అతడు సంఘపు మాటయు విననియెడల అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము.
- Matthew 18:21 మత్తయి 18:21ఆ సమయమున పేతురు ఆయనయొద్దకు వచ్చి ప్రభువా, నా సహోదరుడు నాయెడల తప్పిదము చేసిన యెడల నేనెన్నిమారులు అతని క్షమింపవలెను? ఏడు మారులమట్టుకా? అని అడిగెను.
- Proverbs 9:8 సామెతలు 9:8అపహాసకుని గద్దింపకుము గద్దించినయెడల వాడు నిన్ను ద్వేషించును. జ్ఞానముగలవానిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును.
- 2 Chronicles 19:6–7 2 దినవృత్తాంతములు 19:6–7మీరు యెహోవా నియమమునుబట్టియే గాని మనుష్యుల నియ మమునుబట్టి తీర్పు తీర్చవలసినవారు కారు; ఆయన మీతో కూడ నుండును గనుక మీరు తీర్చు తీర్పు బహు జాగ్రత్తగా చేయుడి. యెహోవా భయము మీమీద ఉండునుగాక; హెచ్చరికగానుండి తీర్పు తీర్చుడి; మన దేవుడైన యెహోవాయందు దౌష్ట్యములేదు, ఆయన పక్షపాతికాడు, లంచము పుచ్చుకొనువాడు కాడు.
- Proverbs 27:5 సామెతలు 27:5లోలోపల ప్రేమించుటకంటె బహిరంగముగా గద్దించుట మేలు
- James 5:19 యాకోబు 5:19నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరియొకడు అతనిని సత్య మునకు మళ్లించినయెడల
- Exodus 34:12 నిర్గమకాండము 34:12నీవు ఎక్కడికి వెళ్లుచున్నావో ఆ దేశపు నివాసులతో నిబంధన చేసికొనకుండ జాగ్రత్తపడుము. ఒకవేళ అది నీకు ఉరికావచ్చును.
- Deuteronomy 4:9 ద్వితీయోపదేశకాండము 4:9అయితే నీవు జాగ్రత్తపడుము; నీవు కన్నులార చూచినవాటిని మరువక యుండునట్లును, అవి నీ జీవితకాల మంతయు నీ హృదయములోనుండి తొలగిపోకుండు నట్లును, నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి
- Deuteronomy 4:23 ద్వితీయోపదేశకాండము 4:23మీ దేవుడైన యెహోవా మీకు ఏర్పరచిన నిబంధనను మరచి, నీ దేవు డైన యెహోవా నీ కాజ్ఞాపించినట్లు ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసికొనకుండునట్లు మీరు జాగ్రత్తపడవలెను.
- Hebrews 12:15 హెబ్రీయులకు 12:15మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండ తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుటవలన అనేకులు అపవిత్రులై పోవుదురేమో అనియు,
- Luke 21:34 లూకా 21:34మీ హృదయములు ఒకవేళ తిండివలనను మత్తువలనను ఐహిక విచారములవలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరివచ్చినట్టు రాకుండ మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి.