Luke · chapter 8 · verse 35
Luke 8:35 in Telugu
జనులు జరిగినదానిని చూడవెళ్లి, యేసునొద్దకు వచ్చి, దయ్యములు వదలిపోయిన మనుష్యుడు బట్టలు కట్టుకొని, స్వస్థచిత్తుడై యేసు పాదములయొద్ద కూర్చుండుట చూచి భయపడిరి.
Janulu jariginadaanini choodavelli, yesunoddaku vachchi, dayyamulu vadalipoyina manushyudu battalu kattukoni, svasthachittudai yesu paadamulayodda koorchunduta choochi bhayapadiri.
Luke 8:35 in English
- King James Version (KJV)
- Then they went out to see what was done; and came to Jesus, and found the man, out of whom the devils were departed, sitting at the feet of Jesus, clothed, and in his right mind: and they were afraid.
- World English Bible (WEB)
- People went out to see what had happened. They came to Jesus and found the man from whom the demons had gone out, sitting at Jesus’ feet, clothed and in his right mind; and they were afraid.
- American Standard Version (ASV)
- And they went out to see what had come to pass; and they came to Jesus, and found the man, from whom the demons were gone out, sitting, clothed and in his right mind, at the feet of Jesus: and they were afraid.
- Bible in Basic English (BBE)
- And they went out to see what had taken place, and they came to Jesus and saw the man out of whom the evil spirits had gone, seated, clothed and with full use of his senses, at the feet of Jesus; and fear came on them.
- Darby Translation (DBY)
- And they went out to see what had happened, and came to Jesus, and found the man from whom the demons had gone out, sitting, clothed and sensible, at the feet of Jesus. And they were afraid.
- Webster's Bible (WBS)
- Then they went out to see what was done; and came to Jesus, and found the man out of whom the demons had departed, sitting at the feet of Jesus, clothed, and in his right mind: and they were afraid.
- Young's Literal Translation (YLT)
- and they came forth to see what was come to pass, and they came unto Jesus, and found the man sitting, out of whom the demons had gone forth, clothed, and right-minded, at the feet of Jesus, and they were afraid;
Read in context
- 33అప్పుడు దయ్యములు ఆ మనుష్యుని విడిచిపోయి పందులలో చొచ్చెను గనుక, ఆ మంద ప్రపాతమునుండి సరస్సులోనికి వడిగా పరుగెత్తి ఊపిరి తిరుగక చచ్చెను.
- 34మేపుచున్నవారు జరిగినదానిని చూచి, పారిపోయి ఆ పట్టణములోను గ్రామములలోను ఆ సంగతి తెలియజేసిరి.
- 35జనులు జరిగినదానిని చూడవెళ్లి, యేసునొద్దకు వచ్చి, దయ్యములు వదలిపోయిన మనుష్యుడు బట్టలు కట్టుకొని, స్వస్థచిత్తుడై యేసు పాదములయొద్ద కూర్చుండుట చూచి భయపడిరి.
- 36అది చూచినవారు దయ్యములు పట్టినవాడేలాగు స్వస్థతపొందెనో జనులకు తెలియజేయగా
- 37గెరసీనీయుల ప్రాంతములలోనుండు జనులందరు బహు భయాక్రాంతులైరి గనుక తమ్మును విడిచిపొమ్మని ఆయనను వేడుకొనిరి.
Cross references
- Luke 10:39 లూకా 10:39ఆమెకు మరియ అను సహోదరియుండెను. ఈమె యేసు పాదములయొద్ద కూర్చుండి ఆయన బోధవిను చుండెను.
- 1 John 3:8 1 యోహాను 3:8అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి; అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను.
- Acts 22:3 అపొస్తలుల కార్యములు 22:3నేను కిలికియలోని తార్సులో పుట్టిన యూదుడను. అయితే ఈ పట్టణములో గమలీయేలు పాదములయొద్ద పెరిగి, మన పితరుల ధర్మశాస్త్రసంబంధమగు నిష్ఠయందు శిక్షితుడనై, మీరందరు నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడనైయుండి
- Psalm 51:10 కీర్తనలు 51:10దేవా, నాయందు శుద్ధహృదయము కలుగజేయుము నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము.
- Luke 8:27 లూకా 8:27ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరివాడొకడు ఆయనకు ఎదురుగావచ్చెను. వాడు దయ్యములుపట్టినవాడై, బహుకాలమునుండి బట్టలు కట్టు కొనక, సమాధులలోనేగాని యింటిలో ఉండువాడు కాడు.
- Isaiah 53:12 యెషయా 53:12కావున గొప్పవారితో నేనతనికి పాలు పంచిపెట్టెదను ఘనులతో కలిసి అతడు కొల్లసొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను అతిక్రమము చేయువారిలో ఎంచబడినవాడాయెను అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసినవారినిగూర్చి విజ్ఞాపనముచేసెను
- Hebrews 2:14–15 హెబ్రీయులకు 2:14–15కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణముయొక్క బలముగలవానిని, అనగా అపవాదిని మరణముద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణభయము చేత దాస్యమునకు లోబడినవారిని విడిపించుటకును, ఆయనకూడ రక్తమాంసములలో పాలివాడాయెను.
- Isaiah 49:24–25 యెషయా 49:24–25బలాఢ్యుని చేతిలోనుండి కొల్లసొమ్ము ఎవడు తీసికొన గలడు? భీకరులు చెరపట్టినవారు విడిపింపబడుదురా? యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు బలాఢ్యులు చెరపట్టినవారు సహితము విడిపింప బడుదురు భీకరులు చెరపట్టినవారు విడిపింపబడుదురు నీతో యుద్ధము చేయువారితో నేనే యుద్ధము చేసెదను నీ పిల్లలను నేనే రక్షించెదను.
- Mark 5:15 మార్కు 5:15జనులు జరిగినది చూడ వెళ్లి యేసునొద్దకు వచ్చి, సేన అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించు కొని, స్వస్థచిత్తుడై కూర్చుండియుండుట చూచి భయపడిరి.
- Luke 15:17 లూకా 15:17అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రియొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవు చున్నాను.
- Luke 2:46 లూకా 2:46మూడు దినములైన తరువాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి, వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలడుగుచు ఉండగా చూచిరి.
Original words (Greek)
- Then · G1161δέ dé
- out · G1831ἐξέρχομαι exérchomai
- see · G1492εἴδω eídō
- done · G1096γίνομαι gínomai
- and · G2532καί kaí
- came · G2064ἔρχομαι érchomai
- to · G4314πρός prós
- Jesus · G2424Ἰησοῦς Iēsoûs
- and · G2532καί kaí
- found · G2147εὑρίσκω heurískō
- man · G444ἄνθρωπος ánthrōpos
- of · G575ἀπό apó
- whom · G3739ὅς hós
- devils · G1140δαιμόνιον daimónion
- departed · G1831ἐξέρχομαι exérchomai
- sitting · G2521κάθημαι káthēmai
- at · G3844παρά pará
- feet · G4228πούς poús
- Jesus · G2424Ἰησοῦς Iēsoûs
- clothed · G2439ἱματίζω himatízō
- and · G2532καί kaí
- mind · G4993σωφρονέω sōphronéō
- and · G2532καί kaí
- afraid · G5399φοβέω phobéō