Mark · chapter 11 · verse 14
Mark 11:14 in Telugu
అందుకాయన ఇకమీదట ఎన్నటికిని నీ పండ్లు ఎవరును తినకుందురు గాక అని చెప్పెను; ఇది ఆయన శిష్యులు వినిరి.
Andukaayana ikameedata ennatikini nee pandlu evarunu tinakunduru gaaka ani cheppenu; idi aayana shishyulu viniri.
Mark 11:14 in English
- King James Version (KJV)
- And Jesus answered and said unto it, No man eat fruit of thee hereafter for ever. And his disciples heard [it.]
- World English Bible (WEB)
- Jesus told it, “May no one ever eat fruit from you again!” and his disciples heard it.
- American Standard Version (ASV)
- And he answered and said unto it, No man eat fruit from thee henceforward for ever. And his disciples heard it.
- Bible in Basic English (BBE)
- And he said to it, Let no man take fruit from you for ever. And his disciples took note of his words.
- Darby Translation (DBY)
- And answering he said to it, Let no one eat fruit of thee any more for ever. And his disciples heard [it].
- Webster's Bible (WBS)
- And Jesus answered and said to it, Let no man eat fruit of thee hereafter for ever. And his disciples heard [it] .
- Young's Literal Translation (YLT)
- and Jesus answering said to it, 'No more from thee — to the age — may any eat fruit;' and his disciples were hearing.
Read in context
- 12మరునాడు వారు బేతనియనుండి వెళ్లుచుండగా ఆయన ఆకలిగొని
- 13ఆకులుగల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి, దానిమీద ఏమైనను దొరకునేమో అని వచ్చెను. దానియొద్దకు వచ్చి చూడగా, ఆకులు తప్ప మరేమియు కనబడలేదు; ఏలయనగా అది అంజూరపు పండ్లకాలము కాదు.
- 14అందుకాయన ఇకమీదట ఎన్నటికిని నీ పండ్లు ఎవరును తినకుందురు గాక అని చెప్పెను; ఇది ఆయన శిష్యులు వినిరి.
- 15వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవా లయములో ప్రవేశించి, దేవాలయములో క్రయ విక్రయ ములు చేయువారిని వెళ్లగొట్ట నారంభించి, రూకలు మార్చువారి బల్లలను, గువ్వలమ్మువారి పీటలను పడద్రోసి
- 16దేవాలయము గుండ ఏపాత్రయైనను ఎవనిని తేనియ్య కుండెను.
Cross references
- Matthew 21:19 మత్తయి 21:19అప్పుడు త్రోవప్రక్కను ఉన్న యొక అంజూరపుచెట్టును చూచి, దానియొద్దకు రాగా, దానియందు ఆకులు తప్ప మరేమియు కనబడలేదు గనుక దానిని చూచి–ఇకమీదట ఎన్నటికిని నీవు కాపు కాయ కుందువుగాక అని చెప్పెను; తక్షణమే ఆ అంజూరపుచెట్టు ఎండిపోయెను.
- Matthew 7:19 మత్తయి 7:19మంచి ఫలములు ఫలింపని ప్రతిచెట్టు నరకబడి అగ్నిలో వేయబడును.
- Matthew 3:10 మత్తయి 3:10ఇప్పుడే గొడ్డలి చెట్లవేరున ఉంచబడియున్నది గనుక మంచి ఫలము ఫలిం పని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును.
- John 15:6 యోహాను 15:6ఎవడైనను నాయందు నిలిచియుండని యెడల వాడు తీగెవలె బయట పారవేయ బడి యెండిపోవును; మనుష్యులు అట్టివాటిని పోగుచేసి అగ్నిలో పార వేతురు, అవి కాలిపోవును.
- Mark 11:20–21 మార్కు 11:20–21ప్రొద్దున వారు మార్గమున పోవుచుండగా ఆ అంజూరపుచెట్టు వేళ్లు మొదలుకొని యెండియుండుట చూచిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొని బోధకుడా, యిదిగో నీవు శపించిన అంజూరపుచెట్టు ఎండిపోయెనని ఆయనతో చెప్పెను.
- Matthew 12:33–35 మత్తయి 12:33–35చెట్టు మంచిదని యెంచి దాని పండును మంచిదే అని యెంచుడి; లేదా, చెట్టు చెడ్డదని యెంచి దాని పండును చెడ్డదే అని యెంచుడి. చెట్టు దాని పండువలన తెలియబడును. సర్పసంతానమా, మీరు చెడ్డవారైయుండి ఏలాగు మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండియుండు దానినిబట్టి నోరు మాటలాడును గదా. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును; దుర్జనుడు తన చెడ్డ ధననిధిలోనుండి దుర్విషయములను తెచ్చును.
- Isaiah 5:5–6 యెషయా 5:5–6ఆలోచించుడి, నేను నా ద్రాక్షతోటకు చేయబోవు కార్యమును మీకు తెలియజెప్పెదను నేను అది మేసివేయబడునట్లు దాని కంచెను కొట్టి వేసెదను. అది త్రొక్కబడునట్లు దాని గోడను పడగొట్టి దాని పాడుచేసెదను అది శుద్ధిచేయబడదు పారతో త్రవ్వబడదు దానిలో గచ్చపొదలును బలురక్కసి చెట్లును బలిసి యుండును దానిమీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞ నిచ్చెదను.
- Deuteronomy 6:4–8 ద్వితీయోపదేశకాండము 6:4–8ఇశ్రాయేలూ వినుము. మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణశక్తితోను నీ దేవుడైన యెహో వాను ప్రేమింపవలెను. నేడు నేను నీకాజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమా రులకు వాటిని అభ్యసింపజేసి, నీ యింట కూర్చుండునప్పు డును త్రోవను నడుచునప్పుడును పండుకొనునప్పుడును లేచునప్పుడును వాటినిగూర్చి మాటలాడవలెను; సూచ నగా వాటిని నీ చేతికి కట్టు కొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికమువలె ఉండవలెను.
- Matthew 21:44 మత్తయి 21:44మరియు ఈ రాతిమీద పడువాడు తునకలైపోవును గాని అది ఎవనిమీద పడునో వానిని నలి చేయుననెను.
- Revelation 22:11 ప్రకటన 22:11అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే యుండ నిమ్ము, నీతి మంతుడు ఇంకను నీతిమంతుడుగానే యుండనిమ్ము. పరిశుద్ధుడు ఇంకనుపరిశుద్ధుడుగానే యుండనిమ్ము.
- 2 Peter 2:20 2 పేతురు 2:20వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానముచేత ఈ లోకమాలిన్యములను తప్పించుకొనిన తరువాత మరల వాటిలో చిక్కుబడి వాటిచేత జయింప బడినయెడల, వారి కడవరి స్థితి మొదటి స్థితికంటె మరి చెడ్డదగును.
- Deuteronomy 11:26–31 ద్వితీయోపదేశకాండము 11:26–31చూడుడి; నేడు నేను మీ యెదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను. నేడు నేను మీకాజ్ఞాపించు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు వినినయెడల దీవెనయు, మీరు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను వినక నేడు నేను మికాజ్ఞాపించు మార్గమును విడిచి మీరెరుగని యితర దేవతలను అనుస రించిన యెడల శాపమును మీకు కలుగును. కాబట్టి నీవు స్వాధీనపరచుకొనబోవు దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చిన తరువాత గెరిజీమను కొండమీద ఆ దీవెన వచనమును, ఏబాలుకొండ మీద ఆ శాపవచనమును ప్రకటింపవలెను. అవి యొర్దాను అవతల సూర్యుడు అస్తమించు మార్గము వెనుక మోరేలోని సింధూరవృక్షములకు దాపున గిల్గాలునకు ఎదురుగానున్న అరాబాలో నివసించు కనానీయుల దేశమందున్నవి గదా. మీరు చేరి మీ దేవుడైన యెహోవా మీకిచ్చు చున్న దేశమును స్వాధీన పరచుకొనుటకు ఈ యొర్దానును దాటబోవుచున్నారు. మీరు దాని స్వాధీనపరచుకొని దానిలో నివసించెదరు.