Matthew · chapter 21 · verse 44
Matthew 21:44 in Telugu
మరియు ఈ రాతిమీద పడువాడు తునకలైపోవును గాని అది ఎవనిమీద పడునో వానిని నలి చేయుననెను.
Mariyu ee raatimeeda paduvaadu tunakalaipovunu gaani adi evanimeeda paduno vaanini nali cheyunanenu.
Matthew 21:44 in English
- King James Version (KJV)
- And whosoever shall fall on this stone shall be broken: but on whomsoever it shall fall, it will grind him to powder.
- World English Bible (WEB)
- He who falls on this stone will be broken to pieces, but on whomever it will fall, it will scatter him as dust.”
- American Standard Version (ASV)
- And he that falleth on this stone shall be broken to pieces: but on whomsoever it shall fall, it will scatter him as dust.
- Bible in Basic English (BBE)
- Any man falling on this stone will be broken, but he on whom it comes down will be crushed to dust.
- Darby Translation (DBY)
- And he that falls on this stone shall be broken, but on whomsoever it shall fall, it shall grind him to powder.
- Webster's Bible (WBS)
- And whoever shall fall on this stone, shall be broken: but on whomsoever it shall fall, it will grind him to powder.
- Young's Literal Translation (YLT)
- and he who is falling on this stone shall be broken, and on whomsoever it may fall it will crush him to pieces.'
Read in context
- 42మరియు యేసు వారిని చూచి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను. ఇది ప్రభువువలననే కలిగెను. ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను మాట మీరు లేఖనములలో ఎన్నడును చదువలేదా?
- 43కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్దనుండి తొల గింపబడి, దాని ఫలమిచ్చు జనులకియ్యబడునని మీతో చెప్పుచున్నాను.
- 44మరియు ఈ రాతిమీద పడువాడు తునకలైపోవును గాని అది ఎవనిమీద పడునో వానిని నలి చేయుననెను.
- 45ప్రధానయాజకులును పరిసయ్యులును ఆయన చెప్పిన ఉపమానములను విని, తమ్మును గూర్చియే చెప్పెనని గ్రహించి
- 46ఆయనను పట్టుకొన సమయము చూచుచుండిరి గాని జనులందరు ఆయనను ప్రవక్తయని యెంచిరి గనుక వారికి భయపడిరి.
Cross references
- Isaiah 8:14–15 యెషయా 8:14–15అయితే ఆయన ఇశ్రాయేలుయొక్క రెండు కుటుంబ ములకు తగులు రాయిగాను అభ్యంతరము కలిగించు బండగాను ఉండును యెరూషలేము నివాసులకు బోనుగాను చిక్కువలగాను ఉండును అనేకులు వాటికి తగిలి తొట్రిల్లుచు పడి కాళ్లు చేతులు విరిగి చిక్కుబడి పట్టబడుదురు.
- 1 Peter 2:8 1 పేతురు 2:8కట్టువారు వాక్యమున కవిధేయులై తొట్రిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడిరి.
- Daniel 2:34–35 దానియేలు 2:34–35మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి, యినుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమయొక్క పాదములమీద పడి దాని పాదములను తుత్తునియలుగా విరుగగొట్టినట్టు తమకు కన బడెను. అంతట ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్లములోని చెత్తవలె కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండ గాలి వాటిని కొట్టుకొనిపోయెను; ప్రతిమను విరుగగొట్టిన ఆ రాయి సర్వభూతలమంత మహా పర్వతమాయెను.
- Daniel 2:44–45 దానియేలు 2:44–45ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. దానికెన్నటికిని నాశనము కలుగదు, ఆ రాజ్యము దాని పొందినవారికి గాక మరెవరికిని చెందదు; అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగములవరకు నిలుచును. చేతి సహాయము లేక పర్వతమునుండి తియ్యబడిన ఆ రాయి యినుమును ఇత్తడిని మట్టిని వెండిని బంగారమును పగులగొట్టగా తమరు చూచితిరే; యిందువలన మహా దేవుడు ముందు జరుగ బోవు సంగతి రాజునకు తెలియజేసియున్నాడు; కల నిశ్చయము, దాని భావము నమ్మదగినది అని దానియేలు రాజుతో చెప్పెను.
- Romans 9:33 రోమీయులకు 9:33ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సీయోనులో స్థాపించుచున్నాను; ఆయనయందు విశ్వాసముంచు వాడు సిగ్గుపరచబడడు అని వ్రాయబడిన ప్రకారము వారు అడ్డురాయి తగిలి, తొట్రుపడిరి.
- Luke 20:18 లూకా 20:18ఈ రాతిమీద పడు ప్రతివాడును తునకలై పోవును; గాని అది ఎవనిమీద పడునో వానిని నలిచేయుననెను.
- Matthew 27:25 మత్తయి 27:25అందుకు ప్రజ లందరువాని రక్తము మా మీదను మా పిల్లలమీదను ఉండుగాకనిరి.
- Zechariah 12:3 జెకర్యా 12:3ఆ దినమందు నేను యెరూషలేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేతును, దానిని ఎత్తి మోయువారందరు మిక్కిలి గాయ పడుదురు, భూజనులందరును దానికి విరోధులై కూడు దురు.
- Psalm 21:8–9 కీర్తనలు 21:8–9నీ హస్తము నీ శత్రువులందరిని చిక్కించుకొనును నీ దక్షిణహస్తము నిన్ను ద్వేషించువారిని చిక్కించుకొనును. నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండమువలె అగుదురుతన కోపమువలన యెహోవా వారిని నిర్మూలముచేయును అగ్ని వారిని దహించును.
- Psalm 110:5–6 కీర్తనలు 110:5–6ప్రభువు నీ కుడిపార్శ్వమందుండి తన కోపదినమున రాజులను నలుగగొట్టును. అన్యజనులకు ఆయన తీర్పు తీర్చును దేశము శవములతో నిండియుండును విశాలదేశము మీది ప్రధానుని ఆయన నలుగగొట్టును.
- Matthew 26:24 మత్తయి 26:24మనుష్యకుమా రునిగూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు గాని యెవనిచేత మనుష్యకుమారుడు అప్ప గింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ; ఆ మనుష్యుడు పుట్టియుండనియెడల వానికి మేలని చెప్పెను.
- 2 Corinthians 4:3–4 2 కొరింథీయులకు 4:3–4మా సువార్త మరుగుచేయబడిన యెడల నశించుచున్నవారి విషయములోనే మరుగుచేయ బడియున్నది. దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకా శింపకుండు నిమిత్తము, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైనవారి మనో నేత్రములకు గ్రుడ్డితనము కలుగ జేసెను.