Mark · chapter 12 · verse 24
Mark 12:24 in Telugu
అందుకు యేసుమీరు లేఖనములనుగాని దేవుని శక్తినిగాని యెరుగక పోవుటవలననే పొరబడు చున్నారు.
Anduku yesumeeru lekhanamulanugaani devuni shaktinigaani yerugaka povutavalanane porabadu chunnaaru.
Mark 12:24 in English
- King James Version (KJV)
- And Jesus answering said unto them, Do ye not therefore err, because ye know not the scriptures, neither the power of God?
- World English Bible (WEB)
- Jesus answered them, “Isn’t this because you are mistaken, not knowing the Scriptures nor the power of God?
- American Standard Version (ASV)
- Jesus said unto them, Is it not for this cause that ye err, that ye know not the scriptures, nor the power of God?
- Bible in Basic English (BBE)
- Jesus said to them, Is not this the reason for your error, that you have no knowledge of the holy Writings or of the power of God?
- Darby Translation (DBY)
- And Jesus answering said to them, Do not ye therefore err, not knowing the scriptures, nor the power of God?
- Webster's Bible (WBS)
- And Jesus answering, said to them, Do ye not therefore err, because ye know not the scriptures, neither the power of God?
- Young's Literal Translation (YLT)
- And Jesus answering said to them, 'Do ye not because of this go astray, not knowing the Writings, nor the power of God?
Read in context
- 22ఇట్లు ఏడుగురును సంతానములేకయే చని పోయిరి. అందరివెనుక ఆ స్త్రీయు చనిపోయెను.
- 23పునరుత్థానమందు వారిలో ఎవనికి ఆమె భార్యగా ఉండును? ఆమె ఆ యేడుగురికిని భార్య ఆయెను గదా అని అడిగిరి.
- 24అందుకు యేసుమీరు లేఖనములనుగాని దేవుని శక్తినిగాని యెరుగక పోవుటవలననే పొరబడు చున్నారు.
- 25వారు మృతులలోనుండి లేచునప్పుడు పెండ్లిచేసికొనరు, పెండ్లికియ్యబడరు గాని పరలోక మందున్న దూతలవలె నుందురు.
- 26వారు లేచెదరని మృతులనుగూర్చిన సంగతి మోషే గ్రంథమందలి పొదను గురించిన భాగములో మీరు చదువలేదా? ఆ భాగములో దేవుడునేను అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడనని అతనితో చెప్పెను.
Cross references
- 2 Timothy 3:15–17 2 తిమోతికి 3:15–17నీవు నేర్చుకొని రూఢియని తెలిసికొన్నవి యెవరివలన నేర్చుకొంటివో ఆ సంగతి తెలిసికొని, వాటియందు నిలుకడగా ఉండుము. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి యుండునట్లు దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది.
- Matthew 22:29 మత్తయి 22:29అందుకు యేసులేఖనములనుగాని దేవుని శక్తినిగాని ఎరుగక మీరు పొరబడుచున్నారు.
- John 20:9 యోహాను 20:9ఆయన మృతులలోనుండి లేచుట అగత్యమను లేఖనము వారింకను గ్రహింపరైరి.
- Ephesians 1:19 ఎఫెసీయులకు 1:19మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి, తన్ను తెలిసికొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయునుగల మనస్సు అనుగ్రహించునట్లు, నేను నా ప్రార్థనలయందు మిమ్మునుగూర్చి విజ్ఞాపన చేయుచున్నాను.
- Isaiah 25:8 యెషయా 25:8మరెన్నడును ఉండకుండ మరణమును ఆయన మింగి వేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖముమీది బాష్ప బిందువులను తుడిచివేయును భూమిమీదనుండి తన జనులనిందను తీసివేయును ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చియున్నాడు.
- Romans 15:4 రోమీయులకు 15:4ఏలయనగా ఓర్పువలనను, లేఖనములవలని ఆదరణవలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడిన వన్నియు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి యున్నవి.
- Hosea 6:2 హోషేయ 6:2రెండు దినములైన తరువాత ఆయన మనలను బ్రదికించును, మనము ఆయన సముఖమందు బ్రదుకునట్లు మూడవ దినమున ఆయన మనలను స్థిరపరచును.
- Jeremiah 32:17 యిర్మీయా 32:17యెహోవా, ప్రభువా సైన్య ములకధిపతియగు యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవా, నీ యధికబలముచేతను చాచిన బాహువుచేతను భూమ్యాకాశములను సృజించితివి, నీకు అసాధ్యమైనదేదియు లేదు.
- Acts 17:11 అపొస్తలుల కార్యములు 17:11వీరు థెస్సలొనీకలో ఉన్న వారికంటె ఘనులైయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి, పౌలును సీలయును చెప్పిన సంగతులు ఆలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి.
- Philippians 3:21 ఫిలిప్పీయులకు 3:21సమస్తమును తనకు లోపరచుకొనజాలిన శక్తినిబట్టి ఆయన మన దీనశరీరమును తన మహిమగల శరీరమునకు సమ రూపము గలదానిగా మార్చును.
- Mark 10:27 మార్కు 10:27యేసు వారిని చూచి ఇది మను ష్యులకు అసాధ్యమే గాని, దేవునికి అసాధ్యము కాదు; దేవునికి సమస్తమును సాధ్యమే అనెను.
- Hosea 13:14 హోషేయ 13:14అయినను పాతాళ వశములోనుండి నేను వారిని విమోచింతును; మృత్యువు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా, నీ విజయ మెక్కడ? ఓ మరణమా, నీ ముల్లెక్కడ? పశ్చాత్తాపము నాకు పుట్టదు.