John · chapter 20 · verse 9
John 20:9 in Telugu
ఆయన మృతులలోనుండి లేచుట అగత్యమను లేఖనము వారింకను గ్రహింపరైరి.
Aayana mrutulalonundi lechuta agatyamanu lekhanamu vaarinkanu grahimparairi.
John 20:9 in English
- King James Version (KJV)
- For as yet they knew not the scripture, that he must rise again from the dead.
- World English Bible (WEB)
- For as yet they didn’t know the Scripture, that he must rise from the dead.
- American Standard Version (ASV)
- For as yet they knew not the scripture, that he must rise again from the dead.
- Bible in Basic English (BBE)
- For at that time they had no knowledge that the Writings said that he would have to come again from the dead.
- Darby Translation (DBY)
- for they had not yet known the scripture, that he must rise from among [the] dead.
- Webster's Bible (WBS)
- For as yet they knew not the scripture, that he must rise again from the dead.
- Young's Literal Translation (YLT)
- for not yet did they know the Writing, that it behoveth him out of the dead to rise again.
Read in context
- 7నారబట్టలు పడియుండుటయు, ఆయన తల రుమాలు నార బట్టలయొద్ద ఉండక వేరుగా ఒకటచోట చుట్టిపెట్టియుండుటయు చూచెను.
- 8అప్పుడు మొదట సమాధియొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను.
- 9ఆయన మృతులలోనుండి లేచుట అగత్యమను లేఖనము వారింకను గ్రహింపరైరి.
- 10అంతట ఆ శిష్యులు తిరిగి తమ వారియొద్దకు వెళ్లిపోయిరి.
- 11అయితే మరియ సమాధి బయట నిలిచి యేడ్చు చుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా,
Cross references
- Psalm 16:10 కీర్తనలు 16:10ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడచిపెట్టవు నీ పరిశుద్ధుని కుళ్లుపట్టనియ్యవు
- Isaiah 25:8 యెషయా 25:8మరెన్నడును ఉండకుండ మరణమును ఆయన మింగి వేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖముమీది బాష్ప బిందువులను తుడిచివేయును భూమిమీదనుండి తన జనులనిందను తీసివేయును ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చియున్నాడు.
- Isaiah 53:10–12 యెషయా 53:10–12అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్నుతానే అపరాధపరిహారార్థబలిచేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతనివలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తినొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి నకున్న అనుభవజ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. కావున గొప్పవారితో నేనతనికి పాలు పంచిపెట్టెదను ఘనులతో కలిసి అతడు కొల్లసొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను అతిక్రమము చేయువారిలో ఎంచబడినవాడాయెను అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసినవారినిగూర్చి విజ్ఞాపనముచేసెను
- Isaiah 26:19 యెషయా 26:19మృతులైన నీవారు బ్రదుకుదురు నావారి శవములు సజీవములగును మంటిలో పడియున్నవారలారా, మేల్కొని ఉత్స హించుడి. నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులనుగా చేయును.
- Luke 24:44–46 లూకా 24:44–46అంతట ఆయన–మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను, కీర్తనలలోను నన్నుగూర్చి వ్రాయబడిన వన్నియు నెరవేరవలెనని నేను మీయొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను అప్పుడు వారు లేఖనములు గ్రహించునట్లుగా ఆయన వారి మనస్సును తెరచి క్రీస్తు శ్రమపడి మూడవ దిన మున మృతులలోనుండి లేచుననియు
- 1 Corinthians 15:4 1 కొరింథీయులకు 15:4లేఖనముల ప్రకారము మూడవదినమున లేపబడెను.
- Luke 24:26 లూకా 24:26క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి
- Matthew 22:29 మత్తయి 22:29అందుకు యేసులేఖనములనుగాని దేవుని శక్తినిగాని ఎరుగక మీరు పొరబడుచున్నారు.
- Hosea 13:14 హోషేయ 13:14అయినను పాతాళ వశములోనుండి నేను వారిని విమోచింతును; మృత్యువు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా, నీ విజయ మెక్కడ? ఓ మరణమా, నీ ముల్లెక్కడ? పశ్చాత్తాపము నాకు పుట్టదు.
- Mark 9:31–32 మార్కు 9:31–32ఏలయనగా ఆయన తన శిష్యులకు బోధించుచు మనుష్యకుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబడు చున్నాడు, వారాయనను చంపెదరు; చంపబడిన మూడు దినములకు ఆయన లేచునని వారితో చెప్పెను. వారు ఆ మాట గ్రహింపలేదు గాని ఆయన నడుగ భయపడిరి.
- Luke 18:33–34 లూకా 18:33–34ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు; మూడవ దినమున ఆయన మరల లేచునని చెప్పెను. వారు ఈ మాటలలో ఒకటైనను గ్రహింపలేదు; ఈ సంగతి వారికి మరుగు చేయబడెను గనుక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధపడలేదు.
- Psalm 22:22–31 కీర్తనలు 22:22–31నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను సమాజమధ్యమున నిన్ను స్తుతించెదను. యెహోవాయందు భయభక్తులు గలవారలారా, ఆయ నను స్తుతించుడి యాకోబు వంశస్థులారా, మీరందరు ఆయనను ఘన పరచుడి ఇశ్రాయేలు వంశస్థులారా, మీరందరు ఆయనకు భయపడుడి ఆయన బాధపడువాని బాధను తృణీకరింపలేదు, దాని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు. వాడాయనకు మొఱ్ఱపెట్టగా ఆయన ఆలకించెను. మహా సమాజములో నిన్నుగూర్చి నేను కీర్తన పాడెదను ఆయనయందు భయభక్తులు గలవారియెదుట నా మ్రొక్కుబడులు చెల్లించెదను. దీనులు భోజనముచేసి తృప్తిపొందెదరు యెహోవాను వెదకువారు ఆయనను స్తుతించెదరు మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రదుకును. భూదిగంతముల నివాసులందరు జ్ఞాపకము చేసికొని యెహోవాతట్టు తిరిగెదరు అన్యజనుల వంశస్థులందరు నీ సన్నిధిని నమస్కారము చేసెదరు రాజ్యము యెహోవాదే అన్యజనులలో ఏలువాడు ఆయనే. భూమిమీద వర్థిల్లుచున్నవారందరు అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారము చేసెదరుతమ ప్రాణము కాపాడుకొనలేక మంటిపాలగు వారందరు ఆయన సన్నిధిని మోకరించెదరు ఒక సంతతివారు ఆయనను సేవించెదరు రాబోవుతరమునకు ప్రభువునుగూర్చి వివరింతురు. వారు వచ్చిఆయన దీని చేసెనని పుట్టబోవు ప్రజలకు తెలియజేతురుఆయన నీతిని వారికి ప్రచురపరతురు.