Mark · chapter 2 · verse 5
Mark 2:5 in Telugu
యేసు వారి విశ్వాసము చూచి కుమారుడా, నీ పాపములు క్షమింపబడియున్నవని పక్ష వాయువుగలవానితో చెప్పెను.
Yesu vaari vishvaasamu choochi kumaarudaa, nee paapamulu kshamimpabadiyunnavani paksha vaayuvugalavaanito cheppenu.
Mark 2:5 in English
- King James Version (KJV)
- When Jesus saw their faith, he said unto the sick of the palsy, Son, thy sins be forgiven thee.
- World English Bible (WEB)
- Jesus, seeing their faith, said to the paralytic, “Son, your sins are forgiven you.”
- American Standard Version (ASV)
- And Jesus seeing their faith saith unto the sick of the palsy, Son, thy sins are forgiven.
- Bible in Basic English (BBE)
- And Jesus, seeing their faith, said to him, Son, you have forgiveness for your sins.
- Darby Translation (DBY)
- But Jesus, seeing their faith, says to the paralytic, Child, thy sins are forgiven [thee].
- Webster's Bible (WBS)
- When Jesus saw their faith, he said to the sick with the palsy, Son, thy sins are forgiven thee.
- Young's Literal Translation (YLT)
- and Jesus having seen their faith, saith to the paralytic, 'Child, thy sins have been forgiven thee.'
Read in context
- 3కొందరు పక్షవాయువుగల ఒక మనుష్యుని నలుగురిచేత మోయించుకొని ఆయనయొద్దకు తీసికొని వచ్చిరి.
- 4చాలమంది కూడియున్నందున వారాయన యొద్దకు చేరలేక, ఆయన యున్నచోటికి పైగా ఇంటి కప్పు విప్పి, సందుచేసి పక్షవాయువుగలవానిని పరుపుతోనే దింపిరి.
- 5యేసు వారి విశ్వాసము చూచి కుమారుడా, నీ పాపములు క్షమింపబడియున్నవని పక్ష వాయువుగలవానితో చెప్పెను.
- 6శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండియుండిరి.
- 7వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు గదా; దేవుడొక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకొనిరి.
Cross references
- Matthew 9:2 మత్తయి 9:2ఇదిగో జనులు పక్ష వాయువుతో మంచముపట్టియున్న యొకని ఆయన యొద్దకు తీసికొనివచ్చిరి. యేసు వారి విశ్వాసముచూచి కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడియున్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను.
- James 5:15 యాకోబు 5:15విశ్వాససహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపును; అతడు పాపములు చేసినవాడైతే పాపక్షమాపణ నొందును.
- Mark 2:9–10 మార్కు 2:9–10ఈ పక్షవాయువుగలవానితో నీ పాపములు క్షమింప బడియున్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరుపెత్తి కొని నడువుమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమిమీద మనుష్యకుమారునికి అధికారము కలదని మీరు తెలిసికొనవలెనని వారితో చెప్పి
- Luke 7:47–50 లూకా 7:47–50ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమెయొక్క విస్తార పాపములు క్షమించబడెనని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచె ముగా క్షమింపబడునో, వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింప బడియున్నవి అని ఆమెతో అనెను. అప్పుడాయనతో కూడ భోజన పంక్తిని కూర్చుండిన వారుపాపములు క్షమించుచున్న యితడెవడని తమలోతాము అను కొనసాగిరి. అందుకాయన నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్లుమని ఆ స్త్రీతో చెప్పెను.
- Luke 5:20 లూకా 5:20ఆయన వారి విశ్వాసము చూచి మనుష్యుడా, నీ పాప ములు క్షమింపబడియున్నవని వానితో చెప్పగా,
- Matthew 9:22 మత్తయి 9:22యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి కుమారీ, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచెనని చెప్పగా ఆ గడియనుండి ఆ స్త్రీ బాగు పడెను.
- Acts 5:31 అపొస్తలుల కార్యములు 5:31ఇశ్రాయేలునకు మారుమనస్సును పాప క్షమాపణను దయచేయుటకై దేవుడాయనను అధిపతిని గాను రక్షకునిగాను తన దక్షిణహస్తబలముచేత హెచ్చించి యున్నాడు.
- Ephesians 2:8 ఎఫెసీయులకు 2:8మీరు విశ్వాసముద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే.
- Colossians 3:13 కొలొస్సయులకు 3:13ఎవడైనను తనకు హానిచేసెనని యొకడనుకొనిన యెడల ఒకని నొకడు సహించుచు ఒకని నొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి.
- Psalm 32:1–5 కీర్తనలు 32:1–5తన అతిక్రమములకు పరిహారమునొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవాచేత నిర్దోషి అని యెంచబడినవాడు ఆత్మలో కపటములేనివాడు ధన్యుడు. నేను మౌనినై యుండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వనివలన నాయెముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చెయ్యి నామీద బరువుగా నుండెను నా సారము వేసవికాలమున ఎండినట్టాయెను. (సెలా. ) నా దోషమును కప్పుకొనక నీ యెదుట నాపాపము ఒప్పుకొంటిని యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందు ననుకొంటిని. నీవు నా పాపదోషమును పరిహరించియున్నావు. (సెలా. )
- Psalm 90:7–9 కీర్తనలు 90:7–9నీ కోపమువలన మేము క్షీణించుచున్నాము నీ ఉగ్రతనుబట్టి దిగులుపడుచున్నాము. మా దోషములను నీవు నీ యెదుట నుంచుకొని యున్నావు నీ ముఖకాంతిలో మా రహస్యపాపములు కనబడు చున్నవి. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నియు గడిపితివిు. నిట్టూర్పులు విడిచినట్టు మా జీవితకాలము జరుపు కొందుము.
- John 5:14 యోహాను 5:14అటుతరువాత యేసు దేవాలయములో వానిని చూచిఇదిగో స్వస్థతనొందితివి; మరి యెక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా