Matthew · chapter 10 · verse 15
Matthew 10:15 in Telugu
విమర్శదినమందు ఆ పట్టణపు గతికంటె సొదొమ గొమొఱ్ఱా ప్రదేశముల గతి ఓర్వతగినదై యుండునని నిశ్చయముగా మీతో చెప్పు చున్నాను.
Vimarshadinamandu aa pattanapu gatikante sodoma gomorraa pradeshamula gati orvataginadai yundunani nishchayamugaa meeto cheppu chunnaanu.
Matthew 10:15 in English
- King James Version (KJV)
- Verily I say unto you, It shall be more tolerable for the land of Sodom and Gomorrha in the day of judgment, than for that city.
- World English Bible (WEB)
- Most certainly I tell you, it will be more tolerable for the land of Sodom and Gomorrah in the day of judgment than for that city.
- American Standard Version (ASV)
- Verily I say unto you, It shall be more tolerable for the land of Sodom and Gomorrah in the day of judgment, than for that city.
- Bible in Basic English (BBE)
- Truly I say to you, It will be better for the land of Sodom and Gomorrah in the day of God's judging than for that town.
- Darby Translation (DBY)
- Verily I say unto you, It shall be more tolerable for the land of Sodom and Gomorrha in judgment-day than for that city.
- Webster's Bible (WBS)
- Verily, I say to you, It shall be more tolerable for the land of Sodom and Gomorrah, in the day of judgment, than for that city.
- Young's Literal Translation (YLT)
- verily I say to you, It shall be more tolerable for the land of Sodom and Gomorrah in the day of judgment than for that city.
Read in context
- 13ఆ యిల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దానిమీదికి వచ్చును; అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును.
- 14ఎవడైనను మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుండిన యెడల మీరు ఆ యింటినైనను ఆ పట్టణమైనను విడిచిపోవునప్పుడు మీ పాదధూళి దులిపివేయుడి.
- 15విమర్శదినమందు ఆ పట్టణపు గతికంటె సొదొమ గొమొఱ్ఱా ప్రదేశముల గతి ఓర్వతగినదై యుండునని నిశ్చయముగా మీతో చెప్పు చున్నాను.
- 16ఇదిగో తోడేళ్లమధ్యకు గొఱ్ఱెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాములవలె వివేకులును పావురములవలె నిష్కపటులునై యుండుడి.
- 17మనుష్యు లనుగూర్చి జాగ్రత్తపడుడి; వారు మిమ్మును మహాసభలకు అప్పగించి, తమ సమాజమందిరములలో మిమ్మును కొరడా లతో కొట్టింతురు,
Cross references
- 2 Peter 2:6 2 పేతురు 2:6మరియు ఆయన సొదొమ గొమొఱ్ఱాలను పట్టణములను భస్మముచేసి, ముందుకు భక్తిహీనులగువారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము విధించి,
- John 15:22–24 యోహాను 15:22–24నేను వచ్చి వారికి బోధింపకుండినయెడల, వారికి పాపము లేకపోవును; ఇప్పుడైతే వారి పాపమునకు మిషలేదు. నన్ను ద్వేషించువాడు నా తండ్రినికూడ ద్వేషించుచున్నాడు. ఎవడును చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుండినయెడల వారికి పాపము లేకపోవును; ఇప్పుడైతే వారు నన్నును నా తండ్రిని చూచి ద్వేషించియున్నారు.
- Luke 10:11–12 లూకా 10:11–12మీరు దాని వీధులలోనికి పోయిమా పాదములకు అంటిన మీ పట్టణపు ధూళినికూడ మీ యెదుటనే దులిపివేయుచున్నాము; అయినను దేవుని రాజ్యము సమీపించి యున్నదని తెలిసికొనుడని చెప్పుడి. ఆ పట్టణపు గతికంటె సొదొమ పట్టణపు గతి ఆ దినమున ఓర్వతగినదై యుండునని మీతో చెప్పుచున్నాను.
- Matthew 11:22–24 మత్తయి 11:22–24విమర్శదినమందు మీ గతికంటె తూరు సీదోను పట్టణములవారి గతి ఓర్వతగినదై యుండునని మీతో చెప్పుచున్నాను. కపెర్నహూమా, ఆకాశము మట్టునకు హెచ్చింపబడెదవా? నీవు పాతాళమువరకు దిగి పోయెదవు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన యెడల అది నేటివరకు నిలిచియుండును. విమర్శదినమందు నీ గతికంటె సొదొమ దేశపువారి గతి ఓర్వతగినదై యుండునని మీతో చెప్పుచున్నాననెను.
- Ezekiel 16:48–56 యెహెజ్కేలు 16:48–56నీవును నీ కుమార్తెలును చేసినట్లు నీ చెల్లెలైన సొదొమయైనను దాని కుమార్తెలైనను చేసినవారు కారని నా జీవముతోడు ప్రమాణము చేయుచున్నాను; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషమేదనగా, దానికిని దాని కుమార్తెలకును కలిగిన గర్వమును ఆహార సమృద్ధియు నిర్విచారమైన సుఖస్థితియు ననునదియే; అది దీనులకును దరిద్రులకును సహాయము చేయకుండెను. వారు అహంకరించి నా దృష్టికి హేయక్రియలు చేసిరి గనుక నేను దాని చూచి వారిని వెళ్లగొట్టితిని. షోమ్రోను సహా నీ పాపములలో సగమైన చేయలేదు, అది చేసినవాటి కంటె నీవు అత్యధికముగా హేయక్రియలు చేసితివి; నీవు ఇన్ని హేయ క్రియలు చేసి నీ సహోదరిని నిర్దోషురాలినిగా కనుపరచితివి. నీవు వారికంటె అత్యధికముగా హేయక్రియలు జరిగించినందున నిన్నుబట్టి చూడగా నీ సహోదరీలు నిర్దోషురాండ్రుగా కనబడుదురు; నీవు వారికి విధించిన అవమానశిక్ష నీకే రావలెను; నిన్నుబట్టి చూడగా నీ సహోదరీలు నిర్దోషురాండ్రుగా కనబడుదురు గనుక నీవు అవమానపరచబడి సిగ్గునొందుము. నీవు చేసినది అంతటి విషయమై నీవు బిడియపడి సిగ్గునొంది వారిని ఓదార్చు నట్లు అపాయమునొందిన సొదొమను దాని కుమార్తెలను షోమ్రోనును దాని కుమార్తెలను వారివలెనే అపాయమొందిన నీ వారిని మరల స్థాపించెదరు. సొదొమయు దాని కుమార్తెలును తమ పూర్వస్థితికి వచ్చెదరు, షోమ్రోనును దాని కుమార్తెలును తమ పూర్వస్థితికి వచ్చెదరు, నీవును నీ కుమార్తెలును మీ పూర్వస్థితికి వచ్చెదరు. నీ చుట్టు ఉండి నిన్ను తృణీకరించిన ఫిలిష్తీయుల కుమార్తెలును సిరియా కుమార్తెలును నిన్ను అవమానపరచగా
- 1 John 4:17 1 యోహాను 4:17తీర్పుదినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీనివలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి యున్నది; ఏలయనగా ఆయన ఎట్టివాడై యున్నాడో మనముకూడ ఈ లోకములో అట్టివారమై యున్నాము.
- Matthew 12:36 మత్తయి 12:36నేను మీతో చెప్పునదేమనగా మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటనుగూర్చియు విమర్శదినమున లెక్క చెప్పవలసియుండును.
- Mark 6:11 మార్కు 6:11ఏ స్థలమందైనను జనులు మిమ్మును చేర్చు కొనక మీ మాటలు వినకుంటే, మీరు అక్కడనుండి బయలుదేరునప్పుడు వారిమీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదముల క్రింది ధూళి దులిపివేయుడి.
- 2 Peter 3:7 2 పేతురు 3:7అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినమువరకు అగ్నికొరకు నిలువచేయబడినవై, అదే వాక్యమువలన భద్రము చేయబడియున్నవి.
- 2 Peter 2:9 2 పేతురు 2:9భక్తులను శోధనలోనుండి తప్పించుటకును, దుర్ణీతిపరులను ముఖ్యముగా మలినమైన దురాశకలిగి శరీరానుసారముగా నడుచు కొనుచు, ప్రభుత్వమును నిరాకరించుచు,
- Matthew 5:18 మత్తయి 5:18ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరువరకు దానినుండి యొక పొల్లయినను ఒక సున్నయైనను తప్పి పోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.
- Matthew 24:34–35 మత్తయి 24:34–35ఇవన్నియు జరుగువరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలుఏ మాత్రమును గతింపవు.