Numbers · chapter 23 · verse 10
Numbers 23:10 in Telugu
యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు?ఇశ్రాయేలు నాల్గవపాలును ఎవరు లెక్కపెట్టగలరు? నీతిమంతుల మరణమువంటి మరణము నాకు లభించును గాక. నా అంత్యదశ వారి అంతమువంటి దగును గాక అనెను.
Yaakobu renuvulanu evaru lekkinchedaru?ishraayelu naalgavapaalunu evaru lekkapettagalaru? Neetimantula maranamuvanti maranamu naaku labhinchunu gaaka. Naa antyadasha vaari antamuvanti dagunu gaaka anenu.
Numbers 23:10 in English
- King James Version (KJV)
- Who can count the dust of Jacob, and the number of the fourth [part] of Israel? Let me die the death of the righteous, and let my last end be like his!
- World English Bible (WEB)
- Who can count the dust of Jacob, or count the fourth part of Israel? Let me die the death of the righteous! Let my last end be like his!”
- American Standard Version (ASV)
- Who can count the dust of Jacob, Or number the fourth part of Israel? Let me die the death of the righteous, And let my last end be like his!
- Bible in Basic English (BBE)
- Who is able to take the measure of the dust of Jacob or the number of the thousands of Israel? May my death be the death of the upright and my last end like his!
- Darby Translation (DBY)
- Who can count the dust of Jacob, and the number of the fourth part of Israel? Let my soul die the death of the righteous, and let my end be like his!
- Webster's Bible (WBS)
- Who can count the dust of Jacob, and the number of the fourth [part] of Israel? Let me die the death of the righteous, and let my last end be like his!
- Young's Literal Translation (YLT)
- Who hath counted the dust of Jacob, And the number of the fourth of Israel? Let me die the death of upright ones, And let my last end be like his!'
Read in context
- 8ఏమని శపింపగలను? దేవుడు శపింపలేదే ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదే.
- 9మెట్టల శిఖరమునుండి అతని చూచుచున్నాను కొండలనుండి అతని కనుగొనుచున్నాను ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును జనములలో లెక్కింపబడరు.
- 10యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు?ఇశ్రాయేలు నాల్గవపాలును ఎవరు లెక్కపెట్టగలరు? నీతిమంతుల మరణమువంటి మరణము నాకు లభించును గాక. నా అంత్యదశ వారి అంతమువంటి దగును గాక అనెను.
- 11అంతట బాలాకు బిలాముతో నీవు నాకేమి చేసితివి? నా శత్రువులను శపించుటకు నిన్ను రప్పించితిని; అయితే నీవు వారిని పూర్తిగా దీవించితివనెను.
- 12అందు కతడుయెహోవా నా నోట ఉంచినదాని నేను శ్రధ్ధగా పలుక వద్దా? అని ఉత్తరమిచ్చెను.
Cross references
- Genesis 13:16 ఆదికాండము 13:16మరియు నీ సంతానమును భూమి మీదనుండు రేణువులవలె విస్తరింపచేసెదను; ఎట్లనగా ఒకడు భూమిమీదనుండు రేణువులను లెక్కింప గలిగినయెడల నీ సంతానమును కూడ లెక్కింపవచ్చును.
- Psalm 37:37 కీర్తనలు 37:37నిర్దోషులను కనిపెట్టుము యథార్థవంతులను చూడుము సమాధానపరచువారి సంతతి నిలుచును గాని ఒకడైనను నిలువకుండ అపరాధులు నశించుదురు
- Psalm 116:15 కీర్తనలు 116:15యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది
- Revelation 14:13 ప్రకటన 14:13అంతట ఇప్పటినుండి ప్రభువునందు మృతినొందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకమునుండి యొక స్వరము చెప్పగా వింటిని. నిజమే; వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు; వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు.
- 2 Timothy 4:6–8 2 తిమోతికి 4:6–8నేనిప్పుడే పానార్పణముగ పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై యున్నది. మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడ ముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇకమీదట నా కొరకు నీతికిరీట ముంచబడియున్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధి పతియైన ప్రభువు అది నాకును, నాకు మాత్రమే కాకుండ తన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికిని అనుగ్రహించును.
- Genesis 22:17 ఆదికాండము 22:17నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్రతీరమందలి యిసుకవలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసెదను; నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు.
- 2 Corinthians 5:1 2 కొరింథీయులకు 5:1భూమిమీద మన గుడారమైన యీ నివాసము శిథిలమైపోయినను, చేతిపనికాక దేవునిచేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని యెరుగుదుము.
- Isaiah 57:1–2 యెషయా 57:1–2నీతిమంతులు నశించుట చూచి యెవరును దానిని మనస్సున పెట్టరు భక్తులైనవారు తీసికొనిపోబడుచున్నారు కీడు చూడకుండ నీతిమంతులు కొనిపోబడుచున్నారని యెవనికిని తోచదు. వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు తమకు సూటిగానున్న మార్గమున నడచువారు తమ పడకలమీద పరుండి విశ్రమించుచున్నారు.
- Proverbs 14:32 సామెతలు 14:32అపాయము రాగా భక్తిహీనుడు నశించును మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయము కలదు.
- Numbers 2:31 సంఖ్యాకాండము 2:31దాను పాళెములో లెక్కింపబడినవారందరు లక్ష యేబదియేడువేల ఆరువందలమంది. వారు తమ ధ్వజముల ప్రకారము కడపటి గుంపులో నడవవలెను.
- 1 Corinthians 15:53–57 1 కొరింథీయులకు 15:53–57క్షయమైన యీ శరీరము అక్షయతను ధరించుకొనవలసి యున్నది; మర్త్యమైన యీ శరీరము అమర్త్యతను ధరించు కొనవలసియున్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్య మైనది అమర్త్యతను ధరించు కొనినప్పుడు, విజయమందు మరణము మింగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా, నీ విజయమెక్కడ? ఓ మరణమా, నీ ముల్లెక్కడ? మరణపు ముల్లు పాపము; పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక.
- Genesis 28:14 ఆదికాండము 28:14నీ సంతానము భూమిమీద లెక్కకు ఇసుక రేణువులవలెనగును; నీవు పడమటి తట్టును తూర్పు తట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించెదవు, భూమియొక్క వంశములన్నియు నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును.