Numbers · chapter 30 · verse 1
Numbers 30:1 in Telugu
మోషే ఇశ్రాయేలీయులయొక్క గోత్రాధిపతు లతో ఇట్లనెను
Moshe ishraayeleeyulayokka gotraadhipatu lato itlanenu
Numbers 30:1 in English
- King James Version (KJV)
- And Moses spake unto the heads of the tribes concerning the children of Israel, saying, This [is] the thing which the LORD hath commanded.
- World English Bible (WEB)
- Moses spoke to the heads of the tribes of the children of Israel, saying, “This is the thing which the LORD has commanded.
- American Standard Version (ASV)
- And Moses spake unto the heads of the tribes of the children of Israel, saying, This is the thing which Jehovah hath commanded.
- Bible in Basic English (BBE)
- And Moses said to the heads of the tribes of the children of Israel, This is the order of the Lord.
- Darby Translation (DBY)
- And Moses spoke to the heads of the tribes of the children of Israel, saying, This is what Jehovah hath commanded.
- Webster's Bible (WBS)
- And Moses spoke to the heads of the tribes concerning the children of Israel, saying, This [is] the thing which the LORD hath commanded.
- Young's Literal Translation (YLT)
- And Moses speaketh unto the heads of the tribes of the sons of Israel, saying, 'This [is] the thing which Jehovah hath commanded:
Read in context
- 1మోషే ఇశ్రాయేలీయులయొక్క గోత్రాధిపతు లతో ఇట్లనెను
- 2ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి. ఒకడు యెహోవాకు మ్రొక్కుకొనిన యెడల, లేక తాను బద్ధుడగుటకు ప్రమాణము చేసిన యెడల, అతడు తన మాటతప్పక తన నోటనుండి వచ్చినదంతయు నెరవేర్చ వలెను.
- 3మరియు ఒక స్త్రీ బాల్యమున తన తండ్రి యింట నుండగా యెహోవాకు మ్రొక్కుకొని బద్ధురా లైన యెడల, ఆమె తండ్రి ఆమె మ్రొక్కుబడిని ఆమె కలుగజేసికొనిన బాధ్యతను విని దానిగూర్చి ఊరకొనిన యెడల, ఆమె మ్రొక్కుబడులన్నియు నిలుచును.
Cross references
- Numbers 7:2 సంఖ్యాకాండము 7:2దాని ఉపకరణములన్నిటిని బలి పీఠమును దాని పాత్రలన్నిటిని చేయించి, అభిషేకించి వాటిని ప్రతిష్ఠించిన దినమున తమ తమ పితరుల కుటుంబ ములలో ప్రధానులును గోత్ర ముఖ్యులును లెక్కింప బడిన వారిమీద అధిపతులునైన ఇశ్రాయేలీయులలోని ప్రధానులు అర్పణములను తెచ్చిరి.
- Deuteronomy 1:13–17 ద్వితీయోపదేశకాండము 1:13–17జ్ఞానవివేకములు కలిగి, మీ మీ గోత్రము లలో ప్రసిద్ధిచెందిన మనుష్యులను ఏర్పరచుకొనుడి; వారిని మీమీద నియమించెదనని మీతో చెప్పగా మీరునీవు చెప్పిన మాటచొప్పున చేయుట మంచిదని నాకు ఉత్తరమిచ్చితిరి. కాబట్టి బుద్ధి కలిగి ప్రసిద్ధులైన మీ మీ గోత్రములలోని ముఖ్యులను పిలిపించుకొని, మీ గోత్రములకు న్యాయాధిపతులుగా ఉండుటకై వెయ్యి మందికి ఒకడును, నూరుమందికి ఒకడును ఏబదిమందికి ఒకడును, పదిమందికి ఒకడును వారిని, మీమీద నేను నియమించితిని. అప్పుడు నేను మీ న్యాయాధిపతులతోమీ సహోదరుల వ్యాజ్యెములను తీర్చి, ప్రతి మనుష్యుని కిని వాని సహోదరునికిని వానియొద్దనున్న పరదేశికిని న్యాయమునుబట్టి మీరు తీర్పు తీర్చవలెను. తీర్పు తీర్చు నప్పుడు అల్పుల సంగతి గాని ఘనుల సంగతి గాని పక్ష పాతములేకుండ వినవలెను; న్యాయపుతీర్పు దేవునిదే. కాబట్టి మీరు మనుష్యుని ముఖము చూచి భయపడవద్దు. మీకు అసాధ్యమైన కఠినవ్యాజ్యెమును నాయొద్దకు తీసి కొని రావలెను; నేను దానిని విచారించెదనని వారి కాజ్ఞా పించితిని.
- Numbers 1:4–16 సంఖ్యాకాండము 1:4–16మరియు ప్రతి గోత్రములో ఒకడు, అనగా తన పితరుల కుటుంబములో ముఖ్యుడు, మీతో కూడ ఉండవలెను. మీతో కూడ ఉండవలసినవారి పేళ్లు ఏవేవనగా రూబేను గోత్రములో షెదేయూరు కుమారుడైన ఏలీసూరు; షిమ్యోను గోత్రములో సూరీషద్దాయి కుమారుడైన షెలుమీయేలు యూదా గోత్రములో అమ్మినాదాబు కుమారుడైన నయస్సోను ఇశ్శాఖారు గోత్రములో సూయారు కుమారుడైననెత నేలు జెబూ లూను గోత్రములో హేలోను కుమారుడైన ఏలీయాబు యోసేపు సంతానమందు, అనగా ఎఫ్రాయిము గోత్రములో అమీహూదు కుమారుడైన ఎలీషామాయు; మనష్షే గోత్రములో పెదాసూరు కుమారుడైన గమలీయేలు బెన్యామీను గోత్రములో గిద్యోనీ కుమారుడైన అబీదాను దాను గోత్రములో ఆమీషద్దాయి కుమారుడైన అహీయెజెరు ఆషేరు గోత్రములో ఒక్రాను కుమారు డైన పగీయేలు గాదు గోత్రములో దెయూవేలు కుమారుడైన ఎలాసాపు నఫ్తాలి గోత్రములో ఏనాను కుమారుడైన అహీర అనునవి. వీరు సమాజములో పేరు పొందినవారు. వీరు తమ తమ పితరుల గోత్రములలో ప్రధానులు ఇశ్రాయేలీయుల కుటుంబములకు పెద్దలును.
- Numbers 34:17–28 సంఖ్యాకాండము 34:17–28ఆ దేశమును మీకు స్వాస్థ్యముగా పంచిపెట్టవలసినవా రెవరనగా, యాజకుడైన ఎలియాజరును నూను కుమారు డైన యెహోషువయు. మరియు ఆ దేశమును మీకు స్వాస్థ్యముగా పంచిపెట్టుటకు ప్రతి గోత్రములో ఒక్కొక ప్రధానుని ఏర్పరచుకొనవలెను. వారెవ రనగా, యూదావారి గోత్రములో యెఫున్నె కుమారు డైన కాలేబు. షిమ్యోనీయుల గోత్రములో అమీహూదు కుమారుడైన షెమూయేలు, బెన్యామీనీయుల గోత్ర ములో కిస్లోను కుమారుడైన ఎలీదాదు. దానీయుల గోత్రములో యొగ్లి కుమారుడైన బుక్కీ ప్రధాని, యోసేపు పుత్రులలో ఏఫోదు కుమారుడైన హన్నీయేలు మనష్షీయుల గోత్రప్రధాని, ఎఫ్రాయిమీయుల గోత్ర ములో షిప్తాను కుమారుడైన కెమూయేలు ప్రధాని, జెబూలూనీయుల గోత్రములో పర్నాకు కుమారుడైన ఎలీషాపాను ప్రధాని, ఇశ్శాఖారీయుల గోత్రములో అజాను కుమారుడైన పల్తీయేలు ప్రధాని, ఆషేరీయుల గోత్రములో షెలోమి కుమారుడైన అహీహూదు ప్రధాని. నఫ్తాలీయుల గోత్రములో అమీహూదు కుమారుడైన పెదహేలు ప్రధాని.
- Exodus 18:25 నిర్గమకాండము 18:25ఇశ్రాయేలీయులందరిలో సామర్థ్యముగల మనుష్యులను ఏర్పరచుకొని, వెయ్యిమందికి ఒకనిగాను, నూరు మందికి ఒకనిగాను, ఏబదిమందికి ఒకనిగాను, పదిమందికి ఒకనిగాను, న్యాయాధిపతులను ఏర్పాటు చేసి వారిని ప్రజలమీద ప్రధానులనుగా నియమించెను.