Proverbs · chapter 10 · verse 17
Proverbs 10:17 in Telugu
ఉపదేశము నంగీకరించువాడు జీవమార్గములో ఉన్నాడు గద్దింపునకు లోబడనివాడు త్రోవ తప్పును.
Upadeshamu nangeekarinchuvaadu jeevamaargamulo unnaadu gaddimpunaku lobadanivaadu trova tappunu.
Proverbs 10:17 in English
- King James Version (KJV)
- He [is in] the way of life that keepeth instruction: but he that refuseth reproof erreth.
- World English Bible (WEB)
- He is in the way of life who heeds correction, but he who forsakes reproof leads others astray.
- American Standard Version (ASV)
- He is in the way of life that heedeth correction; But he that forsaketh reproof erreth.
- Bible in Basic English (BBE)
- He who takes note of teaching is a way of life, but he who gives up training is a cause of error.
- Darby Translation (DBY)
- Keeping instruction is the path to life; but he that forsaketh reproof goeth astray.
- Webster's Bible (WBS)
- He [is in] the way of life that keepeth instruction: but he that refuseth reproof erreth.
- Young's Literal Translation (YLT)
- A traveller to life [is] he who is keeping instruction, And whoso is forsaking rebuke is erring.
Read in context
- 15ధనవంతుని ఆస్తి వానికి ఆశ్రయపట్టణము దరిద్రుని పేదరికము వానికి నాశనకరము.
- 16నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము భక్తిహీనునికి కలుగు వచ్చుబడి పాపము పుట్టించును.
- 17ఉపదేశము నంగీకరించువాడు జీవమార్గములో ఉన్నాడు గద్దింపునకు లోబడనివాడు త్రోవ తప్పును.
- 18అంతరంగమున పగ ఉంచుకొనువాడు అబద్ధికుడు కొండెము ప్రచురము చేయువాడు బుద్ధిహీనుడు.
- 19విస్తారమైన మాటలలో దోషముండక మానదు తన పెదవులను మూసికొనువాడు బుద్ధిమంతుడు.
Cross references
- Proverbs 15:10 సామెతలు 15:10మార్గము విడిచినవానికి కఠినశిక్ష కలుగును గద్దింపును ద్వేషించువారు మరణము నొందుదురు.
- Proverbs 5:12 సామెతలు 5:12అయ్యో, ఉపదేశము నేనెట్లు త్రోసివేసితిని? నా హృదయము గద్దింపు నెట్లు తృణీకరించెను?
- Luke 11:28 లూకా 11:28ఆయన అవునుగాని దేవుని వాక్యము విని దానిని గైకొనువారు మరి ధన్యులని చెప్పెను.
- Proverbs 6:23 సామెతలు 6:23ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు.
- 2 Peter 1:5–11 2 పేతురు 1:5–11ఆ హేతువుచేతనే మీమట్టుకు మీరు పూర్ణజాగ్రత్తగలవారై, మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్ర హమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనము నందు భక్తిని, భక్తియందు సహోదరప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించినయెడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తునుగూర్చిన అనుభవజ్ఞానవిషయములో మిమ్మును సోమరులైనను నిష్ఫలు లైనను కాకుండ చేయును. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వపాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచి పోయి, గ్రుడ్డివాడును దూరదృష్టిలేనివాడునగును. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసికొనుటకు మరి జాగ్రత్తపడుడి. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడును తొట్రిల్లరు. ఆలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును.
- Proverbs 29:1 సామెతలు 29:1ఎన్నిసారులు గద్దించినను లోబడనివాడు మరి తిరుగులేకుండ హఠాత్తుగా నాశనమగును.
- Proverbs 3:18 సామెతలు 3:18దాని నవలంబించువారికి అది జీవవృక్షము దాని పట్టుకొనువారందరు ధన్యులు.
- Proverbs 4:13 సామెతలు 4:13ఉపదేశమును విడిచిపెట్టక దాని గట్టిగా పట్టుకొనుము అది నీకు జీవము గనుక దాని పొందియుండుము
- Proverbs 12:1 సామెతలు 12:1శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు గద్దింపును అసహ్యించుకొనువాడు పశుప్రాయుడు
- Proverbs 4:4 సామెతలు 4:4ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టు కొననిమ్ము నా ఆజ్ఞలను గైకొనినయెడల నీవు బ్రతుకుదువు.
- Matthew 7:24–27 మత్తయి 7:24–27కాబట్టి యీ నా మాటలు విని వాటిచొప్పున చేయు ప్రతివాడును బండమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ యింటిమీద కొట్టెను గాని దాని పునాది బండమీద వేయబడెను గనుక అది పడలేదు. మరియు యీ నా మాటలు విని వాటిచొప్పున చేయని ప్రతివాడు ఇసుకమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ యింటిమీద కొట్టెను, అప్పుడది కూల బడెను; దాని పాటు గొప్పదని చెప్పెను.
- Proverbs 3:1–2 సామెతలు 3:1–2నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడచు సంవ త్సరములను శాంతిని నీకు కలుగజేయును.