Proverbs · chapter 12 · verse 7
Proverbs 12:7 in Telugu
భక్తిహీనులు పాడై లేకపోవుదురు నీతిమంతుల యిల్లు నిలుచును.
Bhaktiheenulu paadai lekapovuduru neetimantula yillu niluchunu.
Proverbs 12:7 in English
- King James Version (KJV)
- The wicked are overthrown, and [are] not: but the house of the righteous shall stand.
- World English Bible (WEB)
- The wicked are overthrown, and are no more, but the house of the righteous shall stand.
- American Standard Version (ASV)
- The wicked are overthrown, and are not; But the house of the righteous shall stand.
- Bible in Basic English (BBE)
- Evil-doers are overturned and never seen again, but the house of upright men will keep its place.
- Darby Translation (DBY)
- Overthrow the wicked, and they are no [more]; but the house of the righteous shall stand.
- Webster's Bible (WBS)
- The wicked are overthrown, and [are] not: but the house of the righteous shall stand.
- Young's Literal Translation (YLT)
- Overthrow the wicked, and they are not, And the house of the righteous standeth.
Read in context
- 5నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరములు.
- 6భక్తిహీనుల మాటలు నరహత్య చేయ పొంచువారి వంటివి యథార్థవంతుల నోరు వారిని విడిపించును.
- 7భక్తిహీనులు పాడై లేకపోవుదురు నీతిమంతుల యిల్లు నిలుచును.
- 8ఒక్కొక్క మనుష్యుడు తన వివేకముకొలది పొగడబడును కుటిలచిత్తుడు తృణీకరింపబడును.
- 9ఆహారము లేకయున్నను తనను తాను పొగడుకొను వానికంటె దాసుడుగల అల్పుడు గొప్పవాడు.
Cross references
- Matthew 7:24–27 మత్తయి 7:24–27కాబట్టి యీ నా మాటలు విని వాటిచొప్పున చేయు ప్రతివాడును బండమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ యింటిమీద కొట్టెను గాని దాని పునాది బండమీద వేయబడెను గనుక అది పడలేదు. మరియు యీ నా మాటలు విని వాటిచొప్పున చేయని ప్రతివాడు ఇసుకమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ యింటిమీద కొట్టెను, అప్పుడది కూల బడెను; దాని పాటు గొప్పదని చెప్పెను.
- Proverbs 11:21 సామెతలు 11:21నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు. నీతిమంతుల సంతానము విడిపింపబడును.
- Proverbs 10:25 సామెతలు 10:25సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును. నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడమువలె ఉన్నాడు.
- Job 18:15–20 యోబు 18:15–20వారికి అన్యులైన వారు వారి గుడారములో నివాసము చేయుదురు వారి నివాసస్థలము మీద గంధకము చల్లబడును. క్రింద వారి వేళ్లు ఎండిపోవును పైన వారి కొమ్మలు నరకబడును. భూమిమీద ఎవరును వారిని జ్ఞాపకము చేసికొనరు మైదానమందు ఎక్కడను వారిని ఎరిగినవారు ఉండరు. జనులు వారిని వెలుగులోనుండి చీకటిలోనికి తోలుదురు భూలోకములోనుండి వారిని తరుముదురు. వారి ప్రజలలో వారికి పుత్రులైనను పౌత్రులైనను ఉండరు వారు నివసించిన స్థలములో తప్పించుకొనినవాడు ఒకడైనను ఉండడు. తర్వాత వచ్చినవారు వారిమీద పడిన శిక్షను చూచి విస్మయమొందుదురు పూర్వముండినవారు దానిని చూచి దిగులుపడుదురు.
- 2 Samuel 7:26 2 సమూయేలు 7:26సైన్యములకధిపతియగు యెహోవా ఇశ్రాయేలీయులకు దేవుడై యున్నాడను మాటచేత నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లును, నీ దాసుడనైన నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచబడునట్లును నీవు సెలవిచ్చినమాట నెరవేర్చుము.
- Job 11:20 యోబు 11:20దుష్టుల కనుచూపు క్షీణించిపోవునువారికి ఆశ్రయమేమియు ఉండదు ప్రాణము ఎప్పుడు విడిచెదమా అని వారు ఎదురుచూచుచుందురు.
- Esther 9:6–10 ఎస్తేరు 9:6–10షూషను కోటయందు యూదులు ఐదువందలమందిని చంపి నాశనముచేసిరి. హమ్మెదాతా కుమారుడై యూదులకు శత్రువగు హామాను యొక్క పదిమంది కుమారులైన పర్షందాతా దల్పోను అస్పాతా పోరాతా అదల్యా అరీదాతా పర్మష్తా అరీసై అరీదై వైజాతా అను వారిని చంపిరి; అయితే కొల్ల సొమ్ము వారు పట్టుకొనలేదు.
- Job 27:18–23 యోబు 27:18–23పురుగుల గూళ్లవంటి యిండ్లు వారు కట్టుకొందురు కావలివాడు కట్టుకొను గుడిసెవంటి యిండ్లు వారు కట్టుకొందురు. వారు ధనముగలవారై పండుకొందురు గాని మరల లేవరు కన్నులు తెరవగానే లేకపోవుదురు. భయములు జలప్రవాహములవలె వారిని తరిమి పట్టు కొనును రాత్రివేళ తుఫాను వారిని ఎత్తికొనిపోవును. తూర్పుగాలి వారిని కొనిపోగా వారు సమసి పోవు దురు అది వారి స్థలములోనుండి వారిని ఊడ్చివేయును ఏమియు కరుణ చూపకుండ దేవుడు వారిమీద బాణములు వేయును వారు ఆయన చేతిలోనుండి తప్పించుకొనగోరి ఇటు అటు పారిపోవుదురు. మనుష్యులు వారిని చూచి చప్పట్లు కొట్టుదురు వారి స్థలములోనుండి వారిని చీకొట్టి తోలివేయుదురు.
- Job 5:3–4 యోబు 5:3–4మూఢుడు వేరు తన్నుట నేను చూచియున్నాను అయినను తోడనే అతని నివాసస్థలము శాపగ్రస్తమనికనుగొంటిని. అతని పిల్లలు సంరక్షణ దొరకక యుందురుగుమ్మములో నలిగిపోవుదురువారిని విడిపించువాడెవడును లేడు.
- Esther 9:14 ఎస్తేరు 9:14ఆలాగు చేయవచ్చునని రాజు సెలవిచ్చెను. షూషనులో ఆజ్ఞ ప్రకటింపబడెను; హామాను యొక్క పదిమంది కుమారులు ఉరి తీయింపబడిరి.
- Psalm 37:10 కీర్తనలు 37:10ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోవుదురు.
- 2 Samuel 7:16 2 సమూయేలు 7:16నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను.