Proverbs · chapter 2 · verse 12
Proverbs 2:12 in Telugu
అది దుష్టుల మార్గమునుండియు మూర్ఖముగా మాటలాడువారి చేతిలోనుండియు నిన్ను రక్షించును.
Adi dushtula maargamunundiyu moorkhamugaa maatalaaduvaari chetilonundiyu ninnu rakshinchunu.
Proverbs 2:12 in English
- King James Version (KJV)
- To deliver thee from the way of the evil [man], from the man that speaketh froward things;
- World English Bible (WEB)
- to deliver you from the way of evil, from the men who speak perverse things,
- American Standard Version (ASV)
- To deliver thee from the way of evil, From the men that speak perverse things;
- Bible in Basic English (BBE)
- Giving you salvation from the evil man, from those whose words are false;
- Darby Translation (DBY)
- To deliver thee from the way of evil, from the man that speaketh froward things;
- Webster's Bible (WBS)
- To deliver thee from the way of the evil [man] , from the man that speaketh froward things;
- Young's Literal Translation (YLT)
- To deliver thee from an evil way, From any speaking froward things,
Read in context
- 10జ్ఞానము నీ హృదయమున జొచ్చును తెలివి నీకు మనోహరముగా నుండును
- 11బుద్ధి నిన్ను కాపాడును వివేచన నీకు కావలి కాయును.
- 12అది దుష్టుల మార్గమునుండియు మూర్ఖముగా మాటలాడువారి చేతిలోనుండియు నిన్ను రక్షించును.
- 13అట్టివారు చీకటి త్రోవలలో నడువవలెనని యథార్థ మార్గములను విడిచిపెట్టెదరు
- 14కీడుచేయ సంతోషించుదురు అతిమూర్ఖుల ప్రవర్తనయందు ఉల్లసించుదురు.
Cross references
- 1 Corinthians 15:33 1 కొరింథీయులకు 15:33మోసపోకుడి. దుష్టసాంగత్యము మంచి నడవడిని చెరుపును.
- Proverbs 13:20 సామెతలు 13:20జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానముగలవా డగును. మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును.
- Proverbs 8:13 సామెతలు 8:13యెహోవాయందు భయభక్తులు గలిగియుండుట చెడుతనము నసహ్యించుకొనుటయే. గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యములు.
- 2 Corinthians 6:17 2 కొరింథీయులకు 6:17కావున మీరు వారి మధ్యనుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి; అపవిత్రమైనదానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు.
- Isaiah 59:3–5 యెషయా 59:3–5మీ చేతులు రక్తముచేతను మీ వ్రేళ్లు దోషముచేతను అపవిత్రపరచబడియున్నవి మీ పెదవులు అబద్ధములాడుచున్నవి మీ నాలుక కీడునుబట్టి మాటలాడుచున్నది. నీతినిబట్టి యెవడును సాక్ష్యము పలుకడు సత్యమునుబట్టి యెవడును వ్యాజ్యెమాడడు అందరు వ్యర్థమైనదాని నమ్ముకొని మోసపుమాటలు పలుకుదురు చెడుగును గర్భము ధరించి పాపమును కందురు. వారు మిడునాగుల గుడ్లను పొదుగుదురు సాలెపురుగు వల నేయుదురు ఆ గుడ్లు తినువాడు చచ్చును వాటిలో ఒకదానిని ఎవడైన త్రొక్కినయెడల విష సర్పము పుట్టును.
- Proverbs 16:28–30 సామెతలు 16:28–30మూర్ఖుడు కలహము పుట్టించును కొండెగాడు మిత్రభేదము చేయును. బలాత్కారి తన పొరుగువానిని లాలనచేయును కానిమార్గములో వాని నడిపించును. కృత్రిమములు కల్పింపవలెనని కన్నులు మూసికొని తన పెదవులు బిగబట్టువాడే కీడు పుట్టించువాడు.
- Psalm 17:4–5 కీర్తనలు 17:4–5మనుష్యుల కార్యముల విషయమైతే బలాత్కారుల మార్గముల తప్పించుకొనుటకైనీ నోటిమాటనుబట్టి నన్ను నేను కాపాడుకొనియున్నాను. నీ మార్గములయందు నా నడకలను స్థిరపరచుకొని యున్నాను. నాకు కాలు జారలేదు.
- Proverbs 9:6 సామెతలు 9:6ఇక జ్ఞానము లేనివారై యుండక బ్రదుకుడి తెలివి కలుగజేయు మార్గములో చక్కగా నడువుడి.
- Proverbs 1:10–19 సామెతలు 1:10–19నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము. మాతోకూడ రమ్ము మనము ప్రాణముతీయుటకై పొంచియుందము నిర్దోషియైన యొకని పట్టుకొనుటకు దాగియుందము పాతాళము మనుష్యులను మింగివేయునట్లు వారిని జీవముతోనే మింగివేయుదము సమాధిలోనికి దిగువారు మింగబడునట్లు వారు పూర్ణ బలముతోనుండగా మనము వారిని మింగివేయుదము రమ్ము అని వారు చెప్పునప్పుడు ఒప్పకుము. పలువిధములైన మంచి సొత్తులు మనకు దొరుకును మన యిండ్లను దోపుడుసొమ్ముతో నింపుకొందము నీవు మాతో పాలివాడవై యుండుము మనకందరికిని సంచి ఒక్కటే యుండును అని వారు నీతో చెప్పుదురు. నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకుము వారి త్రోవలయందు నడువకుండ నీ పాదము వెనుకకు తీసికొనుము. కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు. పక్షి చూచుచుండగా వల వేయుట వ్యర్థము. వారు స్వనాశనమునకే పొంచియుందురు తమ్మును తామే పట్టుకొనుటకై దాగియుందురు. ఆశాపాతకులందరి గతి అట్టిదే దానిని స్వీకరించువారి ప్రాణము అది తీయును.
- Proverbs 4:14–17 సామెతలు 4:14–17భక్తిహీనుల త్రోవను చేరకుము దుష్టుల మార్గమున నడువకుము. దానియందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము. దానినుండి తొలగి సాగిపొమ్ము. అట్టివారు కీడుచేయనిది నిద్రింపరు ఎదుటివారిని పడద్రోయనిది వారికి నిద్రరాదు. కీడుచేత దొరికినదానిని వారు భుజింతురు బలాత్కారముచేత దొరికిన ద్రాక్షారసమును త్రాగు దురు
- Psalm 141:4 కీర్తనలు 141:4పాపము చేయువారితో కూడ నేను దుర్నీతికార్యములలో చొరబడకుండునట్లు నా మనస్సు దుష్కార్యమునకు తిరుగనియ్యకుము వారి రుచిగల పదార్థములు నేను తినకయుందును గాక.
- Psalm 26:4–5 కీర్తనలు 26:4–5పనికిమాలిన వారితో నేను సాంగత్యము చేయను వేషధారులతో పొందుచేయను. దుష్టుల సంఘము నాకు అసహ్యము భక్తిహీనులతో సాంగత్యముచేయను