Proverbs · chapter 2 · verse 7
Proverbs 2:7 in Telugu
ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును యుక్తమార్గము తప్పక నడుచుకొనువారికి ఆయన కేడెముగా నున్నాడు.
Aayana yathaarthavantulanu vardhillajeyunu yuktamaargamu tappaka naduchukonuvaariki aayana kedemugaa nunnaadu.
Proverbs 2:7 in English
- King James Version (KJV)
- He layeth up sound wisdom for the righteous: [he is] a buckler to them that walk uprightly.
- World English Bible (WEB)
- He lays up sound wisdom for the upright. He is a shield to those who walk in integrity,
- American Standard Version (ASV)
- He layeth up sound wisdom for the upright; [He is] a shield to them that walk in integrity;
- Bible in Basic English (BBE)
- He has salvation stored up for the upright, he is a breastplate to those in whom there is no evil;
- Darby Translation (DBY)
- He layeth up sound wisdom for the upright; [he] is a shield to them that walk in integrity;
- Webster's Bible (WBS)
- He layeth up sound wisdom for the righteous: [he is] a buckler to them that walk uprightly.
- Young's Literal Translation (YLT)
- Even to lay up for the upright substance, A shield for those walking uprightly.
Read in context
- 5యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట యెట్టిదో నీవు గ్రహించెదవు దేవునిగూర్చిన విజ్ఞానము నీకు లభించును.
- 6యెహోవాయే జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన నోటనుండి వచ్చును.
- 7ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును యుక్తమార్గము తప్పక నడుచుకొనువారికి ఆయన కేడెముగా నున్నాడు.
- 8న్యాయము తప్పిపోకుండ ఆయన కనిపెట్టును తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును.
- 9అప్పుడు నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మార్గమును నీవు తెలిసికొందువు.
Cross references
- James 3:15–17 యాకోబు 3:15–17ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చునదికాక భూసంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియునై యున్నది. ఏలయనగా, మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచకార్యమును ఉండును. అయితే పైనుండివచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరము తోను మంచి ఫలములతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణయైనను లేనిదియునై యున్నది.
- Proverbs 30:5 సామెతలు 30:5దేవుని మాటలన్నియు పుటము పెట్టబడినవే ఆయనను ఆశ్రయించువారికి ఆయన కేడెము.
- Psalm 84:11 కీర్తనలు 84:11దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై యున్నాడు యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును యథార్థముగా ప్రవర్తించువారికి ఆయన యే మేలును చేయక మానడు.
- 1 Corinthians 3:18–19 1 కొరింథీయులకు 3:18–19ఎవడును తన్నుతాను మోసపరచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకొనిన యెడల, జ్ఞాని అగునట్టు వెఱ్ఱివాడు కావలెను. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెఱ్ఱితనమే. జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయన పట్టుకొనును;
- 2 Timothy 3:15–17 2 తిమోతికి 3:15–17నీవు నేర్చుకొని రూఢియని తెలిసికొన్నవి యెవరివలన నేర్చుకొంటివో ఆ సంగతి తెలిసికొని, వాటియందు నిలుకడగా ఉండుము. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి యుండునట్లు దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది.
- 1 Corinthians 1:19 1 కొరింథీయులకు 1:19ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును. వివేకులవివేకమును శూన్యపరతును అని వ్రాయబడియున్నది.
- 1 Corinthians 1:30 1 కొరింథీయులకు 1:30అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తుయేసు నందున్నారు.
- Proverbs 28:18 సామెతలు 28:18యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును మూర్ఖప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును.
- Proverbs 14:8 సామెతలు 14:8తమ ప్రవర్తనను కనిపెట్టి యుండుట వివేకుల జ్ఞానము నకు లక్షణము మోసకృత్యములే బుద్ధిహీనులు కనుపరచు మూఢత.
- 1 Corinthians 2:6–7 1 కొరింథీయులకు 2:6–7పరిపూర్ణులైనవారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము, అది యీ లోక జ్ఞానము కాదు, నిరర్థకులై పోవుచున్న యీ లోకాధికారుల జ్ఞానమును కాదుగాని దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము; ఈ జ్ఞానము మరుగైయుండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను.
- Colossians 2:3 కొలొస్సయులకు 2:3బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయనయందే గుప్తములైయున్నవి.
- Psalm 144:2 కీర్తనలు 144:2ఆయన నాకు కృపానిధి నా కోట నా దుర్గము నన్ను తప్పించువాడు నా కేడెము నే నాశ్రయించువాడు ఆయన నా జనులను నాకు లోబరచువాడైయున్నాడు.