Proverbs · chapter 21 · verse 24
Proverbs 21:24 in Telugu
అహంకారియైన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు అట్టివాడు అమితగర్వముతో ప్రవర్తించును.
Ahankaariyaina garvishthuniki apahaasakudani peru attivaadu amitagarvamuto pravartinchunu.
Proverbs 21:24 in English
- King James Version (KJV)
- Proud [and] haughty scorner [is] his name, who dealeth in proud wrath.
- World English Bible (WEB)
- The proud and arrogant man—“Scoffer” is his name— he works in the arrogance of pride.
- American Standard Version (ASV)
- The proud and haughty man, scoffer is his name; He worketh in the arrogance of pride.
- Bible in Basic English (BBE)
- The man of pride, lifted up in soul, is named high-hearted; he is acting in an outburst of pride.
- Darby Translation (DBY)
- Proud, arrogant, scorner is his name who dealeth in proud wrath.
- Webster's Bible (WBS)
- Proud [and] haughty scorner [is] his name, who dealeth in proud wrath.
- Young's Literal Translation (YLT)
- Proud, haughty, scorner [is] his name, Who is working in the wrath of pride.
Read in context
- 22జ్ఞానియైన యొకడు పరాక్రమశాలుల పట్టణ ప్రాకార మెక్కును అట్టివాడు దానికి ఆశ్రయమైన కోటను పడగొట్టును.
- 23నోటిని నాలుకను భద్రము చేసికొనువాడు శ్రమలనుండి తన ప్రాణమును కాపాడుకొనును.
- 24అహంకారియైన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు అట్టివాడు అమితగర్వముతో ప్రవర్తించును.
- 25సోమరివాని చేతులు పనిచేయనొల్లవు వాని యిచ్ఛ వాని చంపును.
- 26దినమెల్ల ఆశలు పుట్టుచుండును నీతిమంతుడు వెనుకతీయక ఇచ్చుచుండును.
Cross references
- Psalm 1:1 కీర్తనలు 1:1దుష్టుల ఆలోచనచొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక
- Ecclesiastes 7:8–9 ప్రసంగి 7:8–9కార్యారంభముకంటె కార్యాంతము మేలు; అహంకారము గలవానికంటె శాంతముగలవాడు శ్రేష్ఠుడు ఆత్రపడి కోపపడవద్దు; బుద్ధిహీనుల అంత రింద్రియములందు కోపము సుఖనివాసము చేయును.
- Matthew 2:16 మత్తయి 2:16ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని, తాను జ్ఞానులవలన వివర ముగా తెలిసికొనిన కాలమునుబట్టి, బేత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను, రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సుగల మగపిల్లల నందరిని వధించెను.
- Proverbs 18:12 సామెతలు 18:12ఆపత్తు రాకమునుపు నరుని హృదయము అతిశయ పడును ఘనతకు ముందు వినయముండును.
- Proverbs 1:22 సామెతలు 1:22ఎట్లనగా, జ్ఞానములేనివారలారా, మీరెన్నాళ్లు జ్ఞానములేని వారుగా ఉండగోరుదురు? అపహాసకులారా, మీరెన్నాళ్లు అపహాస్యము చేయుచు ఆనందింతురు? బుద్ధిహీనులారా, మీరెన్నాళ్లు జ్ఞానమును అసహ్యించు కొందురు?
- Proverbs 19:29 సామెతలు 19:29అపహాసకులకు తీర్పులును బుద్ధిహీనుల వీపులకు దెబ్బలును నియమింపబడినవి.
- Proverbs 16:18 సామెతలు 16:18నాశనమునకు ముందు గర్వము నడచును. పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడచును
- Isaiah 16:6 యెషయా 16:6మోయాబీయులు బహు గర్వముగలవారని మేము విని యున్నాము వారి గర్వమును గూర్చియు వారి అహంకార గర్వక్రోధములను గూర్చియు విని యున్నాము. వారు వదరుట వ్యర్థము.
- Jeremiah 48:29 యిర్మీయా 48:29మోయోబీయుల గర్వమునుగూర్చి వింటిమి, వారు బహు గర్వపోతులు వారి అతిశయమునుగూర్చియు గర్వమునుగూర్చియు
- Esther 3:5–6 ఎస్తేరు 3:5–6మొర్దెకై వంగకయు నమస్కరింపకయు నుండుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించి మొర్దెకై ప్రాణము మాత్రము తీయుట స్వల్పకార్యమని యెంచి, మొర్దెకైయొక్క జనులు ఎవరైనది తెలిసికొని, అహష్వేరోషుయొక్క రాజ్యమందంతటనుండు మొర్దెకై స్వజనులగు యూదులనందరిని సంహరించుటకు ఆలోచించెను.
- Proverbs 6:17 సామెతలు 6:17అవేవనగా, అహంకారదృష్టియు కల్లలాడు నాలుకయు నిరపరాధులను చంపు చేతులును