Proverbs · chapter 7 · verse 17
Proverbs 7:17 in Telugu
నా పరుపుమీద బోళము అగరు కారపుచెక్క చల్లి యున్నాను.
Naa parupumeeda bolamu agaru kaarapuchekka challi yunnaanu.
Proverbs 7:17 in English
- King James Version (KJV)
- I have perfumed my bed with myrrh, aloes, and cinnamon.
- World English Bible (WEB)
- I have perfumed my bed with myrrh, aloes, and cinnamon.
- American Standard Version (ASV)
- I have perfumed my bed With myrrh, aloes, and cinnamon.
- Bible in Basic English (BBE)
- I have made my bed sweet with perfumes and spices.
- Darby Translation (DBY)
- I have perfumed my couch with myrrh, aloes, and cinnamon.
- Webster's Bible (WBS)
- I have perfumed my bed with myrrh, aloes, and cinnamon.
- Young's Literal Translation (YLT)
- I sprinkled my bed — myrrh, aloes, and cinnamon.
Read in context
- 15కాబట్టి నేను నిన్ను కలిసికొనవలెనని రాగా నిన్ను ఎదుర్కొనవలెనని బయలుదేరగా నీవేకనబడితివి
- 16నా మంచముమీద రత్నకంబళ్లను ఐగుప్తునుండి వచ్చు విచిత్రపుపనిగల నారదుప్పట్లను నేను పరచియున్నాను.
- 17నా పరుపుమీద బోళము అగరు కారపుచెక్క చల్లి యున్నాను.
- 18ఉదయము వరకు వలపుదీర తృప్తిపొందుదము రమ్ము పరస్పరమోహముచేత చాలా సంతుష్టి నొందుదము రమ్ము.
- 19పురుషుడు ఇంట లేడు దూరప్రయాణము వెళ్లియున్నాడు
Cross references
- Psalm 45:8 కీర్తనలు 45:8నీ వస్త్రములెల్ల గోపరస వాసనే అగరు వాసనే లవంగిపట్ట వాసనే దంతముతో కట్టిన నగరులలో తంతివాద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి.
- Isaiah 57:7–9 యెషయా 57:7–9ఉన్నతమైన మహాపర్వతముమీద నీ పరుపు వేసి కొంటివి బలి అర్పించుటకు అక్కడికే యెక్కితివి తలుపువెనుకను ద్వారబంధము వెనుకను నీ జ్ఞాపకచిహ్నము ఉంచితివి నాకు మరుగై బట్టలు తీసి మంచమెక్కితివి నీ పరుపు వెడల్పుచేసికొని నీ పక్షముగా వారితో నిబంధన చేసితివి నీవు వారి మంచము కనబడిన చోట దాని ప్రేమిం చితివి. నీవు తైలము తీసికొని రాజునొద్దకు పోతివి పరిమళ ద్రవ్యములను విస్తారముగా తీసికొని నీ రాయబారులను దూరమునకు పంపితివి పాతాళమంత లోతుగా నీవు లొంగితివి
- Exodus 30:23 నిర్గమకాండము 30:23పరిశుద్ధ స్థల సంబంధమైన తులముచొప్పున, అచ్చమైన గోపరసము ఐదువందల తులములును సుగంధముగల లవంగిపట్ట సగము, అనగా రెండువందల ఏబది తులముల యెత్తును
- Song of Solomon 3:6 పరమగీతము 3:6ధూమ స్తంభములవలె అరణ్యమార్గముగా వచ్చు ఇది ఏమి? గోపరసముతోను సాంబ్రాణితోను వర్తకులమ్ము వివిధమైన సుగంధ చూర్ణములతోను పరిమళించుచు వచ్చు ఇది ఏమి?
- Song of Solomon 4:13–14 పరమగీతము 4:13–14నీ చిగురులు దాడిమవనము వింతైన శ్రేష్ఠ ఫలవృక్షములు కర్పూరవృక్షములు జటామాంసి వృక్షములు జటామాంసియు కుంకుమయు నిమ్మగడ్డియు లవంగపట్టయు వివిధమైన పరిమళతైల వృక్షములు గోపరసమును అగరు వృక్షములు నానావిధ శ్రేష్ఠ పరిమళద్రవ్యములు.