Proverbs · chapter 9 · verse 5
Proverbs 9:5 in Telugu
వచ్చి నేను సిద్ధపరచిన ఆహారమును భుజించుడి నేను కలిపిన ద్రాక్షారసమును పానముచేయుడి
Vachchi nenu siddhaparachina aahaaramunu bhujinchudi nenu kalipina draakshaarasamunu paanamucheyudi
Proverbs 9:5 in English
- King James Version (KJV)
- Come, eat of my bread, and drink of the wine [which] I have mingled.
- World English Bible (WEB)
- “Come, eat some of my bread, Drink some of the wine which I have mixed!
- American Standard Version (ASV)
- Come, eat ye of my bread, And drink of the wine which I have mingled.
- Bible in Basic English (BBE)
- Come, take of my bread, and of my wine which is mixed.
- Darby Translation (DBY)
- Come, eat ye of my bread, and drink of the wine that I have mingled.
- Webster's Bible (WBS)
- Come, eat of my bread, and drink of the wine [which] I have mingled.
- Young's Literal Translation (YLT)
- 'Come, eat of my bread, And drink of the wine I have mingled.
Read in context
- 3తన పనికత్తెలచేత జనులను పిలువనంపినది పట్టణమందలి మెట్టలమీద అది నిలిచి
- 4జ్ఞానము లేనివాడా, ఇక్కడికి రమ్మని ప్రకటించు చున్నది. తెలివిలేనివారితో అది ఇట్లనుచున్నది
- 5వచ్చి నేను సిద్ధపరచిన ఆహారమును భుజించుడి నేను కలిపిన ద్రాక్షారసమును పానముచేయుడి
- 6ఇక జ్ఞానము లేనివారై యుండక బ్రదుకుడి తెలివి కలుగజేయు మార్గములో చక్కగా నడువుడి.
- 7అపహాసకులకు బుద్ధిచెప్పువాడు తనకే నింద తెచ్చు కొనును. భక్తిహీనులను గద్దించువానికి అవమానమే కలుగును.
Cross references
- John 6:27 యోహాను 6:27క్షయమైన ఆహారముకొరకు కష్టపడకుడి గాని నిత్యజీవము కలుగ జేయు అక్షయమైన ఆహారముకొరకే కష్టపడుడి; మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును, ఇందుకై తండ్రియైన దేవుడు ఆయనకు ముద్రవేసియున్నాడని చెప్పెను.
- Song of Solomon 5:1 పరమగీతము 5:1నా సహోదరీ, ప్రాణేశ్వరీ, నా ఉద్యానవనమునకు నేను ఏతెంచితిని నా జటామాంసిని నా గంధవర్గములను కూర్చుకొను చున్నాను తేనెయు తేనెపట్టును భుజించుచున్నాను క్షీరసహితద్రాక్షారసము పానము చేయుచున్నాను. నా సఖులారా, భుజించుడి లెస్సగా పానము చేయుడి స్నేహితులారా, పానము చేయుడి.
- Proverbs 9:17 సామెతలు 9:17అది తెలివిలేనివాడొకడు వచ్చుట చూచిదొంగిలించిన నీళ్లు తీపి చాటున తినిన భోజనము రుచి అని చెప్పును.
- Jeremiah 31:12–14 యిర్మీయా 31:12–14వారు వచ్చి సీయోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు; యెహోవా చేయు ఉపకారమునుబట్టియు గోధుమలనుబట్టియు ద్రాక్షారసమును బట్టియు తైలమునుబట్టియు, గొఱ్ఱెలకును పశువులకును పుట్టు పిల్లలనుబట్టియు సమూహములుగా వచ్చెదరు; వారిక నెన్నటికిని కృశింపక నీళ్లుపారు తోటవలె నుందురు. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును గనుక కన్యకలును ¸యౌవనులును వృద్ధులును కూడి నాట్యమందు సంతోషించెదరు. క్రొవ్వుతో యాజకులను సంతోషపరచెదను, నా జనులు నా ఉపకారములను తెలిసికొని తృప్తినొందుదురు; ఇదే యెహోవా వాక్కు.
- Proverbs 9:2 సామెతలు 9:2పశువులను వధించి ద్రాక్షారసమును కలిపియున్నది భోజనపదార్థములను సిద్ధపరచియున్నది
- John 6:49–58 యోహాను 6:49–58మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి. దీనిని తినువాడు చావ కుండునట్లు పరలోకమునుండి దిగివచ్చిన ఆహార మిదే. పరలోకమునుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడును జీవించును; మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవముకొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. యూదులుఈయన తన శరీరమును ఏలాగు తిన నియ్యగలడని యొకనితో ఒకడు వాదించిరి. కావున యేసు ఇట్లనెనుమీరు మనుష్యకుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని, మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవము గలవాడు; అంత్యదినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై యున్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వానియందును నిలిచియుందుము. జీవముగల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. ఇదే పర లోకమునుండి దిగివచ్చిన ఆహారము; పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు గాదు; ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడును జీవించునని నిశ్చయముగా మీతో చెప్పు చున్నాననెను
- Psalm 22:26 కీర్తనలు 22:26దీనులు భోజనముచేసి తృప్తిపొందెదరు యెహోవాను వెదకువారు ఆయనను స్తుతించెదరు మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రదుకును.
- Isaiah 55:1–3 యెషయా 55:1–3దప్పిగొనినవారలారా, నీళ్లయొద్దకు రండి రూకలులేనివారలారా, మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమియు నియ్యకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. ఆహారము కానిదానికొరకు మీ రేల రూకలిచ్చెదరు? సంతుష్టి కలుగజేయనిదానికొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి మీ ప్రాణముసారమైనదానియందు సుఖింపనియ్యుడి. చెవియొగ్గి నాయొద్దకు రండి మీరు వినినయెడల మీరు బ్రదుకుదురు నేను మీతో నిత్యనిబంధన చేసెదను దావీదునకు చూపిన శాశ్వతకృపను మీకు చూపుదును.
- Psalm 22:29 కీర్తనలు 22:29భూమిమీద వర్థిల్లుచున్నవారందరు అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారము చేసెదరుతమ ప్రాణము కాపాడుకొనలేక మంటిపాలగు వారందరు ఆయన సన్నిధిని మోకరించెదరు
- Matthew 26:26–28 మత్తయి 26:26–28వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని, దాని నాశీర్వదించి, విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసికొని తినుడి; ఇది నా శరీరమని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి దీనిలోనిది మీరందరు త్రాగుడి. ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము.