Psalms · chapter 101 · verse 8
Psalm 101:8 in Telugu
యెహోవా పట్టణములోనుండి పాపము చేయువారినందరిని నిర్మూలము చేయుటకై దేశమందలి భక్తిహీనులందరిని ప్రతి ఉదయమున నేను సంహరించెదను.
Yehovaa pattanamulonundi paapamu cheyuvaarinandarini nirmoolamu cheyutakai deshamandali bhaktiheenulandarini prati udayamuna nenu sanharinchedanu.
Psalm 101:8 in English
- King James Version (KJV)
- I will early destroy all the wicked of the land; that I may cut off all wicked doers from the city of the LORD.
- World English Bible (WEB)
- Morning by morning, I will destroy all the wicked of the land, to cut off all the workers of iniquity from the LORD’s city.
- American Standard Version (ASV)
- Morning by morning will I destroy all the wicked of the land; To cut off all the workers of iniquity from the city of Jehovah.
- Bible in Basic English (BBE)
- Morning by morning will I put to death all the sinners in the land, so that all evil-doers may be cut off from Jerusalem.
- Darby Translation (DBY)
- Every morning will I destroy all the wicked of the land: to cut off all workers of iniquity from the city of Jehovah.
- Webster's Bible (WBS)
- I will early destroy all the wicked of the land; that I may cut off all who practice wickedness from the city of the LORD.
- Young's Literal Translation (YLT)
- At morning I cut off all the wicked of the land, To cut off from the city of Jehovah All the workers of iniquity!
Read in context
- 6నాయొద్ద నివసించునట్లు దేశములో నమ్మకస్థులైన వారిని నేను కనిపెట్టుచున్నాను నిర్దోషమార్గమందు నడచువారు నాకు పరిచారకులగుదురు.
- 7మోసము చేయువాడు నా యింట నివసింపరాదు అబద్ధములాడువాడు నా కన్నులయెదుట నిలువడు.
- 8యెహోవా పట్టణములోనుండి పాపము చేయువారినందరిని నిర్మూలము చేయుటకై దేశమందలి భక్తిహీనులందరిని ప్రతి ఉదయమున నేను సంహరించెదను.
Cross references
- Psalm 75:10 కీర్తనలు 75:10భక్తిహీనుల కొమ్ములనన్నిటిని నేను విరుగగొట్టెదను నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును.
- Jeremiah 21:12 యిర్మీయా 21:12దావీదు వంశస్థులారా, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అనుదినము న్యాయముగా తీర్పు తీర్చుడి, దోచుకొనబడినవానిని బాధపెట్టువాని చేతిలోనుండి విడిపించుడి, ఆలాగు చేయనియెడల మీ దుష్టక్రియలనుబట్టి నా క్రోధము అగ్నివలె బయలువెడలి, యెవడును ఆర్పలేకుండ మిమ్మును దహించును.
- Proverbs 16:12 సామెతలు 16:12రాజులు దుష్టక్రియలు చేయుట హేయమైనది నీతివలన సింహాసనము స్థిరపరచబడును.
- Proverbs 20:26 సామెతలు 20:26జ్ఞానముగల రాజు భక్తిహీనులను చెదరగొట్టును వారిమీద చక్రము దొర్లించును.
- Revelation 22:14–15 ప్రకటన 22:14–15జీవ వృక్షమునకు హక్కుగలవారై, గుమ్మములగుండ ఆ పట్టణములోనికి ప్రవేశించునట్లు తమ వస్త్రములను ఉదుకుకొనువారు ధన్యులు. కుక్కలును మాంత్రికులును వ్యభిచారులును నరహంతకులును విగ్రహారాధకులును అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటనుందురు.
- Psalm 48:8 కీర్తనలు 48:8సైన్యములకధిపతియగు యెహోవా పట్టణమునందు మన దేవుని పట్టణమునందు మనము వినినట్టుగానే జరుగుట మనము చూచి యున్నాము దేవుడు నిత్యముగా దానిని స్థిరపరచియున్నాడు. (సెలా. )
- Proverbs 20:8 సామెతలు 20:8న్యాయసింహాసనాసీనుడైన రాజు తన కన్నులతో చెడుతనమంతయు చెదరగొట్టును.
- Psalm 46:4 కీర్తనలు 46:4ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి.
- Micah 3:9 మీకా 3:9యాకోబు సంతతివారి ప్రధానులారా, ఇశ్రాయేలీయుల యధిపతులారా, న్యాయమును తృణీకరించుచు దుర్నీతిని నీతిగా ఎంచువారలారా, యీ మాట ఆలకించుడి.
- Hosea 9:3 హోషేయ 9:3ఎఫ్రాయిమీయులు ఐగుప్తు నకు మరలుదురు, అష్షూరు దేశములో వారు అపవిత్ర మైన వాటిని తిందురు, యెహోవా దేశములో వారు నివసింపకూడదు.
- Psalm 48:2 కీర్తనలు 48:2ఉత్తరదిక్కున మహారాజు పట్టణమైన సీయోను పర్వతము రమ్యమైన యెత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరముగా నున్నది
- Revelation 21:27 ప్రకటన 21:27గొఱ్ఱెపిల్లయొక్క జీవగ్రంథమందు వ్రాయ బడినవారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైన దేదైనను, అసహ్యమైనదానిని అబద్ధమైనదానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపడు.