Psalms · chapter 123 · verse 2
Psalm 123:2 in Telugu
దాసుల కన్నులు తమ యజమానుని చేతితట్టును దాసి కన్నులు తన యజమానురాలి చేతితట్టును చూచునట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించువరకు మన కన్నులు ఆయనతట్టు చూచుచున్నవి.
Daasula kannulu tama yajamaanuni chetitattunu daasi kannulu tana yajamaanuraali chetitattunu choochunatlu mana devudaina yehovaa manalanu karuninchuvaraku mana kannulu aayanatattu choochuchunnavi.
Psalm 123:2 in English
- King James Version (KJV)
- Behold, as the eyes of servants [look] unto the hand of their masters, [and] as the eyes of a maiden unto the hand of her mistress; so our eyes [wait] upon the LORD our God, until that he have mercy upon us.
- World English Bible (WEB)
- Behold, as the eyes of servants look to the hand of their master, as the eyes of a maid to the hand of her mistress, so our eyes look to the LORD, our God, until he has mercy on us.
- American Standard Version (ASV)
- Behold, as the eyes of servants [look] unto the hand of their master, As the eyes of a maid unto the hand of her mistress; So our eyes [look] unto Jehovah our God, Until he have mercy upon us.
- Bible in Basic English (BBE)
- See! as the eyes of servants are turned to the hands of their masters, and the eyes of a servant-girl to her owner, so our eyes are waiting for the Lord our God, till he has mercy on us.
- Darby Translation (DBY)
- Behold, as the eyes of servants [look] unto the hand of their masters, as the eyes of a maiden unto the hand of her mistress, so our eyes [are directed] to Jehovah our God, until he be gracious unto us.
- Webster's Bible (WBS)
- Behold, as the eyes of servants [look] to the hand of their masters, [and] as the eyes of a maiden to the hand of her mistress; so our eyes [wait] upon the LORD our God, until he shall have mercy upon us.
- Young's Literal Translation (YLT)
- Lo, as eyes of men-servants [Are] unto the hand of their masters, As eyes of a maid-servant [Are] unto the hand of her mistress, So [are] our eyes unto Jehovah our God, Till that He doth favour us.
Read in context
- 1ఆకాశమందు ఆసీనుడవైనవాడా, నీ తట్టు నా కన్ను లెత్తుచున్నాను.
- 2దాసుల కన్నులు తమ యజమానుని చేతితట్టును దాసి కన్నులు తన యజమానురాలి చేతితట్టును చూచునట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించువరకు మన కన్నులు ఆయనతట్టు చూచుచున్నవి.
- 3యెహోవా, మేము అధిక తిరస్కారము పాలైతివిు అహంకారుల నిందయు గర్విష్ఠుల తిరస్కారమును మామీదికి అధికముగా వచ్చియున్నవి.
- 4మమ్మును కరుణింపుము మమ్మును కరుణింపుము.
Cross references
- Psalm 130:5–6 కీర్తనలు 130:5–6యెహోవాకొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను నా ప్రాణము ఆయనకొరకు కనిపెట్టుకొనుచున్నది ఆయన మాటమీద నేను ఆశపెట్టుకొనియున్నాను. కావలివారు ఉదయముకొరకు కనిపెట్టుటకంటె ఎక్కు వగా నా ప్రాణము ప్రభువుకొరకు కనిపెట్టుచున్నది కావలివారు ఉదయముకొరకు కనిపెట్టుటకంటె ఎక్కు వగా నా ప్రాణము కనిపెట్టుచున్నది.
- Lamentations 3:25–26 విలాపవాక్యములు 3:25–26తన్ను ఆశ్రయించువారియెడల యెహోవా దయాళుడు తన్ను వెదకువారియెడల ఆయన దయచూపువాడు. నరులు ఆశకలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది.
- Psalm 25:15 కీర్తనలు 25:15నా కనుదృష్టి యెల్లప్పుడు యెహోవావైపునకే తిరిగియున్నది ఆయన నా పాదములను వలలోనుండి విడిపించును.
- Psalm 40:1–3 కీర్తనలు 40:1–3యెహోవాకొరకు నేను సహనముతో కనిపెట్టు కొంటిని ఆయన నాకు చెవియొగ్గి నా మొఱ్ఱ ఆలకించెను. నాశనకరమైన గుంటలోనుండియు జిగటగల దొంగ ఊబిలో నుండియు. ఆయన నన్ను పైకెత్తెను నా పాదములు బండమీద నిలిపి నా అడుగులు స్థిర పరచెను. తనకు స్తోత్రరూపమగు క్రొత్తగీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాని చూచి భయభక్తులుగలిగి యెహోవా యందు నమ్మికయుంచెదరు.
- Genesis 49:18 ఆదికాండము 49:18యెహోవా, నీ రక్షణకొరకు కనిపెట్టి యున్నాను.
- Psalm 119:123–125 కీర్తనలు 119:123–125నీ రక్షణకొరకు నీతిగల నీ మాటకొరకు కనిపెట్టుచు నా కన్నులు క్షీణించుచున్నవి. నీ కృపచొప్పున నీ సేవకునికి మేలుచేయుము నీ కట్టడలను నాకు బోధింపుము నేను నీ సేవకుడను నీ శాసనములను గ్రహించునట్లు నాకు జ్ఞానము కలుగ జేయుము
- Luke 18:1 లూకా 18:1వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలె ననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను.
- Genesis 32:26 ఆదికాండము 32:26ఆయన - తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు - నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనియ్యననెను.
- Joshua 10:6 యెహోషువ 10:6గిబియోనీయులుమన్యములలో నివసించు అమోరీయుల రాజులందరు కూడి మా మీదికిదండెత్తి వచ్చియున్నారు గనుక, నీ దాసులను చెయ్యి విడువక త్వరగా మాయొద్దకు వచ్చి మాకు సహా యముచేసి మమ్మును రక్షించుమని గిల్గాలులో దిగియున్న పాళెములో యెహోషువకు వర్తమానము పంపగా
- Psalm 119:82 కీర్తనలు 119:82నన్ను ఎప్పుడు ఆదరించెదవో అని నా కన్నులు నీవిచ్చిన మాటకొరకు కనిపెట్టి క్షీణించు చున్నవి
- Joshua 9:27 యెహోషువ 9:27అయితే సమాజము కొరకును యెహోవా ఏర్పరచుకొను చోటుననుండు బలి పీఠము కొరకును కట్టెలు నరుకువారుగాను నీళ్లు చేదువారు గాను యెహోషువ ఆ దినమందే వారిని నియమించెను. నేటివరకు వారు ఆ పని చేయువారై యున్నారు.
- Joshua 9:23 యెహోషువ 9:23ఆ హేతువుచేతను మీరు శాపగ్రస్తులగుదురు, దాస్యము మీకెన్నడును మానదు, నా దేవుని ఆలయమునకు మీరు కట్టెలు నరుకువారును నీళ్లు చేదువారునై యుండకమానరు.