Psalms · chapter 25 · verse 18
Psalm 25:18 in Telugu
నా బాధను నా వేదనను కనుగొనుము నా పాపములన్నిటిని క్షమింపుము.
Naa baadhanu naa vedananu kanugonumu naa paapamulannitini kshamimpumu.
Psalm 25:18 in English
- King James Version (KJV)
- Look upon mine affliction and my pain; and forgive all my sins.
- World English Bible (WEB)
- Consider my affliction and my travail. Forgive all my sins.
- American Standard Version (ASV)
- Consider mine affliction and my travail; And forgive all my sins.
- Bible in Basic English (BBE)
- Give thought to my grief and my pain; and take away all my sins.
- Darby Translation (DBY)
- Consider mine affliction and my travail, and forgive all my sins.
- Webster's Bible (WBS)
- Look upon my affliction and my pain; and forgive all my sins.
- Young's Literal Translation (YLT)
- See mine affliction and my misery, And bear with all my sins.
Read in context
- 16నేను ఏకాకిని, బాధపడువాడను నా వైపు తిరిగి నన్ను కరుణింపుము.
- 17నా హృదయవేదనలు అతివిస్తారములు ఇక్కట్టులోనుండి నన్ను విడిపింపుము.
- 18నా బాధను నా వేదనను కనుగొనుము నా పాపములన్నిటిని క్షమింపుము.
- 19నా శత్రువులను చూడుము, వారు అనేకులు క్రూరద్వేషముతో వారు నన్ను ద్వేషించుచున్నారు.
- 20నేను నీ శరణుజొచ్చి యున్నాను, నన్ను సిగ్గుపడ నియ్యకుము నా ప్రాణమును కాపాడుము, నన్ను రక్షింపుము.
Cross references
- 2 Samuel 16:12 2 సమూయేలు 16:12యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయునేమో.
- Psalm 119:132 కీర్తనలు 119:132నీ నామమును ప్రేమించువారికి నీవు చేయదగునట్లు నాతట్టు తిరిగి నన్ను కరుణింపుము.
- Lamentations 5:1 విలాపవాక్యములు 5:1యెహోవా, మాకు కలిగిన శ్రమ జ్ఞాపకము చేసికొనుము దృష్టించి మామీదికి వచ్చిన నింద యెట్టిదో చూడుము.
- Psalm 32:1–5 కీర్తనలు 32:1–5తన అతిక్రమములకు పరిహారమునొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవాచేత నిర్దోషి అని యెంచబడినవాడు ఆత్మలో కపటములేనివాడు ధన్యుడు. నేను మౌనినై యుండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వనివలన నాయెముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చెయ్యి నామీద బరువుగా నుండెను నా సారము వేసవికాలమున ఎండినట్టాయెను. (సెలా. ) నా దోషమును కప్పుకొనక నీ యెదుట నాపాపము ఒప్పుకొంటిని యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందు ననుకొంటిని. నీవు నా పాపదోషమును పరిహరించియున్నావు. (సెలా. )
- Matthew 9:2 మత్తయి 9:2ఇదిగో జనులు పక్ష వాయువుతో మంచముపట్టియున్న యొకని ఆయన యొద్దకు తీసికొనివచ్చిరి. యేసు వారి విశ్వాసముచూచి కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడియున్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను.
- Psalm 51:8–9 కీర్తనలు 51:8–9ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము అప్పుడు నీవు విరిచిన యెముకలు హర్షించును. నా పాపములకు విముఖడవు కమ్ము నా దోషములన్నిటిని తుడిచివేయుము.
- 1 Samuel 1:11 1 సమూయేలు 1:11సైన్యములకధి పతివగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగియున్న శ్రమను చూచి, నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసికొని, నీ సేవకురాలనైన నాకు మగ పిల్లను దయచేసినయెడల, వాని తలమీదికి క్షౌరపుకత్తి యెన్నటికి రానియ్యక, వాడు బ్రదుకు దినములన్నిటను నేను వానిని యెహోవావగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసికొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను,
- Psalm 119:153 కీర్తనలు 119:153(రేష్) నేను నీ ధర్మశాస్త్రమును మరచువాడను కాను నా శ్రమను విచారించి నన్ను విడిపింపుము
- Luke 1:25 లూకా 1:25నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు ఈలాగున చేసెననుకొని, అయిదు నెలలు ఇతరుల కంట బడకుండెను.