Psalms · chapter 29 · verse 10
Psalm 29:10 in Telugu
యెహోవా ప్రళయజలములమీద ఆసీనుడాయెను యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడైయున్నాడు.
Yehovaa pralayajalamulameeda aaseenudaayenu yehovaa nityamu raajugaa aaseenudaiyunnaadu.
Psalm 29:10 in English
- King James Version (KJV)
- The LORD sitteth upon the flood; yea, the LORD sitteth King for ever.
- World English Bible (WEB)
- The LORD sat enthroned at the Flood. Yes, the LORD sits as King forever.
- American Standard Version (ASV)
- Jehovah sat [as King] at the Flood; Yea, Jehovah sitteth as King for ever.
- Bible in Basic English (BBE)
- The Lord had his seat as king when the waters came on the earth; the Lord is seated as king for ever.
- Darby Translation (DBY)
- Jehovah sitteth upon the flood; yea, Jehovah sitteth as king for ever.
- Webster's Bible (WBS)
- The LORD sitteth upon the flood; yes, the LORD sitteth king for ever.
- Young's Literal Translation (YLT)
- Jehovah on the deluge hath sat, And Jehovah sitteth king — to the age,
Read in context
- 8యెహోవా స్వరము అరణ్యమును కదలించును యెహోవా కాదేషు అరణ్యమును కదలించును
- 9యెహోవా స్వరము లేళ్ళను ఈనజేయును అది ఆకులు రాల్చును. ఆయన ఆలయములో నున్నవన్నియు ఆయనకే ప్రభావము అనుచున్నవి.
- 10యెహోవా ప్రళయజలములమీద ఆసీనుడాయెను యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడైయున్నాడు.
- 11యెహోవా తన ప్రజలకు బలము ననుగ్రహించును యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారి నాశీర్వదించును.
Cross references
- 1 Timothy 1:17 1 తిమోతికి 1:17సకల యుగములలో రాజైయుండి, అక్షయుడును అదృ శ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగును గాక. ఆమేన్.
- Psalm 10:16 కీర్తనలు 10:16యెహోవా నిరంతరము రాజై యున్నాడుఆయన దేశములోనుండి అన్యజనులు నశించి పోయిరి.
- Genesis 6:17 ఆదికాండము 6:17ఇదిగో నేనే జీవ వాయువుగల సమస్త శరీరులను ఆకాశము క్రింద నుండ కుండ నాశము చేయుటకు భూమిమీదికి జలప్రవాహము రప్పించుచున్నాను. లోకమందున్న సమస్తమును చని పోవును;
- Mark 4:41 మార్కు 4:41వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడు చున్నవని యొకనితో ఒకడు చెప్పుకొనిరి.
- Genesis 8:1–2 ఆదికాండము 8:1–2దేవుడు నోవహును అతనితోకూడ ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసికొనెను. దేవుడు భూమిమీద వాయువు విసరునట్లు చేయుటవలన నీళ్లు తగ్గిపోయెను. అగాధ జలముల ఊటలును ఆకాశపు తూములును మూయబడెను; ఆకాశమునుండి కురియుచున్న ప్రచండ వర్షము నిలిచి పోయెను.
- Job 38:8–11 యోబు 38:8–11సముద్రము దాని గర్భమునుండి పొర్లి రాగా తలుపులచేత దానిని మూసినవాడెవడు? నేను మేఘమును దానికి వస్త్రముగాను గాఢాంధకారమును దానికి పొత్తిగుడ్డగాను వేసి నప్పుడు నీవుంటివా? దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డగడియలను తలుపులను పెట్టించినప్పుడు నీవు ఇంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదనియు ఇక్కడనే నీ తరంగముల పొంగు అణపబడుననియు నేను చెప్పినప్పుడు నీవుంటివా?
- Psalm 99:1 కీర్తనలు 99:1యెహోవా రాజ్యము చేయుచున్నాడు జనములు వణకును ఆయన కెరూబులమీద ఆసీనుడై యున్నాడు భూమి కదలును.
- Psalm 65:7 కీర్తనలు 65:7ఆయనే సముద్రముల ఘోషను వాటి తరంగముల ఘోషను అణచువాడు జనముల అల్లరిని చల్లార్చువాడు.
- Job 38:25 యోబు 38:25నిర్మానుష్య ప్రదేశముమీదను జనులులేని యెడారిలోను వర్షము కురిపించుటకును
- Daniel 2:44 దానియేలు 2:44ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. దానికెన్నటికిని నాశనము కలుగదు, ఆ రాజ్యము దాని పొందినవారికి గాక మరెవరికిని చెందదు; అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగములవరకు నిలుచును.
- Matthew 6:13 మత్తయి 6:13మమ్మును శోధనలోకి తేక దుష్టునినుండి మమ్మును తప్పించుము.
- Psalm 93:1 కీర్తనలు 93:1యెహోవా రాజ్యము చేయుచున్నాడు ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించియున్నాడు యెహోవా బలముధరించి బలముతో నడుము కట్టు కొనియున్నాడు కదలకుండునట్లు భూలోకము స్థిరపరచబడియున్నది.