Psalms · chapter 66 · verse 7
Psalm 66:7 in Telugu
ఆయన తన పరాక్రమమువలన నిత్యము ఏలుచున్నాడు? అన్యజనులమీద ఆయన తన దృష్టియుంచియున్నాడు. ద్రోహులు తమ్ము తాము హెచ్చించుకొన తగదు. (సెలా. )
Aayana tana paraakramamuvalana nityamu eluchunnaadu? Anyajanulameeda aayana tana drushtiyunchiyunnaadu. Drohulu tammu taamu hechchinchukona tagadu. (selaa. )
Psalm 66:7 in English
- King James Version (KJV)
- He ruleth by his power for ever; his eyes behold the nations: let not the rebellious exalt themselves. Selah.
- World English Bible (WEB)
- He rules by his might forever. His eyes watch the nations. Don’t let the rebellious rise up against him. Selah.
- American Standard Version (ASV)
- He ruleth by his might for ever; His eyes observe the nations: Let not the rebellious exalt themselves. [Selah
- Bible in Basic English (BBE)
- He is ruling in power for ever; his eyes are watching the nations: may his haters have no strength against him. (Selah.)
- Darby Translation (DBY)
- He ruleth by his power for ever; his eyes observe the nations: let not the rebellious exalt themselves. Selah.
- Webster's Bible (WBS)
- He ruleth by his power for ever; his eyes behold the nations: let not the rebellious exalt themselves. Selah.
- Young's Literal Translation (YLT)
- Ruling by His might to the age, His eyes among the nations do watch, The refractory exalt not themselves. Selah.
Read in context
- 5దేవుని ఆశ్చర్యకార్యములను చూడ రండి నరులయెడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై యున్నాడు.
- 6ఆయన సముద్రమును ఎండిన భూమిగా జేసెను జనులు కాలినడకచే దాటిరి. అక్కడ ఆయనయందు మేము సంతోషించితివిు.
- 7ఆయన తన పరాక్రమమువలన నిత్యము ఏలుచున్నాడు? అన్యజనులమీద ఆయన తన దృష్టియుంచియున్నాడు. ద్రోహులు తమ్ము తాము హెచ్చించుకొన తగదు. (సెలా. )
- 8జనములారా, మా దేవుని సన్నుతించుడి గొప్ప స్వరముతో ఆయన కీర్తి వినిపించుడి.
- 9జీవప్రాప్తులనుగా మమ్మును కలుగజేయువాడు ఆయనే ఆయన మా పాదములు కదలనియ్యడు.
Cross references
- Psalm 11:4 కీర్తనలు 11:4యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు యెహోవా సింహాసనము ఆకాశమందున్నదిఆయన నరులను కన్నులార చూచుచున్నాడు తన కనుదృష్టిచేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు.
- Matthew 28:18 మత్తయి 28:18అయితే యేసు వారియొద్దకు వచ్చి పరలోకమందును భూమిమీదను నాకు సర్వాధి కారము ఇయ్యబడియున్నది.
- 2 Chronicles 16:9 2 దినవృత్తాంతములు 16:9తనయెడల యథార్థహృదయముగలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది; యీ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును.
- Psalm 33:13 కీర్తనలు 33:13యెహోవా ఆకాశములోనుండి కనిపెట్టుచున్నాడు ఆయన నరులందరిని దృష్టించుచున్నాడు.
- Psalm 62:11 కీర్తనలు 62:11బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను రెండు మారులు ఆ మాట నాకు వినబడెను.
- Psalm 140:8 కీర్తనలు 140:8యెహోవా, భక్తిహీనుల కోరికలను తీర్చకుము వారు అతిశయించకుండునట్లు వారి ఆలోచనను కొన సాగింపకుము. (సెలా. )
- Job 9:4 యోబు 9:4ఆయన మహా వివేకి, అధిక బలసంపన్నుడుఆయనతో పోరాడ తెగించి హాని నొందనివాడెవడు?
- Daniel 4:35 దానియేలు 4:35భూనివాసులందరు ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు; ఆయన పరలోక సేనయెడలను భూనివాసులయెడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు; ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడుకాడు.
- Psalm 75:4–5 కీర్తనలు 75:4–5అహంకారులై యుండకుడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి పొగరుపట్టిన మాటలాడకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను.
- Daniel 5:20–28 దానియేలు 5:20–28అయితే అతడు మనస్సున అతిశయించి, బలాత్కారము చేయుటకు అతని హృదయమును కఠినము చేసి కొనగా దేవుడు అతని ప్రభుత్వము నతనియొద్దనుండి తీసి వేసి అతని ఘనతను పోగొట్టెను. అప్పుడతడు మానవుల యొద్దనుండి తరమబడి పశువులవంటి మనస్సుగలవాడా యెను. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్య ములలో ఏలుచు, ఎవరిని స్థాపింపగోరునో వారిని స్థాపించు నని అతడు తెలిసికొనువరకు అతడు అడవి గాడిదలమధ్య నివసించుచు పశువులవలె గడ్డి మేయుచు ఆకాశపు మంచు చేత తడిసిన శరీరము గలవాడాయెను. బెల్షస్సరూ, అతని కుమారుడవగు నీవు ఈ సంగతియంతయు ఎరిగి యుండియు, నీ మనస్సును అణచుకొనక, పరలోకమందున్న ప్రభువుమీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి. ఎట్లనగా నీవును నీ యధిపతులును నీ రాణులును నీ ఉపపత్నులును దేవుని ఆలయసంబంధమగు ఉపకరణములలో ద్రాక్షారసము పోసి త్రాగవలెనని వాటిని తెచ్చియుంచు కొని వాటితో త్రాగుచు, చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కఱ్ఱ రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించితిరి గాని, నీ ప్రాణమును నీ సకల మార్గములును ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనను నీవు ఘనపరచలేదు. కావున ఆయన యెదుటనుండి ఈ యరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసెను; వ్రాసిన శాసనమేదనగా, మెనే మెనే టెకేల్ ఉఫార్సీన్. ఈ వాక్యభావమేమనగా, మినే అనగా దేవుడు నీ ప్రభుత్వవిషయములో లెక్కచూచి దాని ముగించెను. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. ఫెరేన్ అనగా నీ రాజ్యము నీయొద్దనుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడును. బెల్షస్సరు ఆజ్ఞ ఇయ్యగా వారు దానియేలునకు ఊదారంగు వస్త్రము తొడిగించి యతని
- Isaiah 37:28–29 యెషయా 37:28–29నీవు కూర్చుండుటయు బయలువెళ్లుటయు లోపలికి వచ్చుటయు నామీదవేయు రంకెలును నాకు తెలిసేయున్నవి. నామీద నీవు వేయు రంకెలును నీవు చేసిన కలహమును నా చెవులలో జొచ్చెను నా గాలము నీ ముక్కునకు తగిలించెదను నా కళ్లెము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్లించెదను నీవు వచ్చిన మార్గముననే నిన్ను మళ్లించెదను.
- Psalm 73:3–12 కీర్తనలు 73:3–12భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించువారినిబట్టి నేను మత్సరపడితిని. మరణమందు వారికి యాతనలు లేవు వారు పుష్టిగా నున్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు ఇతరులకు పుట్టునట్లు వారికి తెగులు పుట్టదు. కావున గర్వము కంఠహారమువలె వారిని చుట్టుకొను చున్నది వస్త్రమువలె వారు బలాత్కారము ధరించుకొందురు. క్రొవ్వుచేత వారి కన్నులు మెరకలై యున్నవి వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చు చున్నవి ఎగతాళి చేయుచు బలాత్కారముచేత జరుగు కీడును గూర్చి వారు మాటలాడుదురు. గర్వముగా మాటలాడుదురు. ఆకాశముతట్టు వారు ముఖము ఎత్తుదురు వారి నాలుక భూసంచారము చేయును. వారి జనము వారిపక్షము చేరును వారు జలపానము సమృద్ధిగా చేయుదురు. దేవుడు ఎట్లు తెలిసికొనును మహోన్నతునికి తెలివియున్నదా? అని వారను కొందురు. ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు. వీరు ఎల్లప్పుడు నిశ్చింతగలవారై ధనవృద్ధి చేసికొందురు.