Psalms · chapter 78 · verse 72
Psalm 78:72 in Telugu
అతడు యథార్థహృదయుడై వారిని పాలించెను కార్యములయందు నేర్పరియై వారిని నడిపించెను.
Atadu yathaarthahrudayudai vaarini paalinchenu kaaryamulayandu nerpariyai vaarini nadipinchenu.
Psalm 78:72 in English
- King James Version (KJV)
- So he fed them according to the integrity of his heart; and guided them by the skilfulness of his hands.
- World English Bible (WEB)
- So he was their shepherd according to the integrity of his heart, and guided them by the skillfulness of his hands.
- American Standard Version (ASV)
- So he was their shepherd according to the integrity of his heart, And guided them by the skilfulness of his hands.
- Bible in Basic English (BBE)
- So he gave them food with an upright heart, guiding them by the wisdom of his hands.
- Darby Translation (DBY)
- And he fed them according to the integrity of his heart, and led them by the skilfulness of his hands.
- Webster's Bible (WBS)
- So he fed them according to the integrity of his heart; and guided them by the skillfulness of his hands.
- Young's Literal Translation (YLT)
- And he ruleth them according to the integrity of his heart, And by the skilfulness of his hands leadeth them!
Read in context
- 70తన దాసుడైన దావీదును కోరుకొని గొఱ్ఱెల దొడ్లలోనుండి అతని పిలిపించెను.
- 71పాడిగొఱ్ఱెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును, తన స్వాస్థ్యమైన ఇశ్రా యేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను.
- 72అతడు యథార్థహృదయుడై వారిని పాలించెను కార్యములయందు నేర్పరియై వారిని నడిపించెను.
Cross references
- 1 Kings 9:4 1 రాజులు 9:4నీ తండ్రి యైన దావీదు నడిచినట్లు నీవును యథార్థహృద యుడవై నీతిని బట్టి నడుచుకొని, నేను నీకు సెలవిచ్చిన దంతటిప్రకారము చేసి నా కట్టడలను విధులను అను సరించిన యెడల
- 2 Timothy 2:15 2 తిమోతికి 2:15దేవునియెదుట యోగ్యునిగాను, సిగ్గుపడ నక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనుపరచు కొనుటకు జాగ్రత్తపడుము.
- Isaiah 11:2–4 యెషయా 11:2–4యెహోవా ఆత్మ జ్ఞానవివేకములకు ఆధారమగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ తెలివిని యెహోవాయెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతనిమీద నిలుచును యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. కంటి చూపునుబట్టి అతడు తీర్పుతీర్చడు తాను వినుదానినిబట్టి విమర్శచేయడు నీతినిబట్టి బీదలకు తీర్పుతీర్చును భూనివాసులలో దీనులైనవారికి యథార్థముగావిమర్శ చేయును తన వాగ్దండము చేత లోకమును కొట్టును తన పెదవుల ఊపిరిచేత దుష్టులను చంపును
- 1 Kings 15:5 1 రాజులు 15:5దావీదు నిమిత్తము అతని తరువాత అతని కుమారుని నిలుపుటకును, యెరూష లేమును స్థిరపరచుటకును, అతని దేవుడైన యెహోవా యెరూషలేమునందు దావీదునకు దీపముగా అతని ఉండ నిచ్చెను.
- Psalm 101:1–8 కీర్తనలు 101:1–8నేను కృపనుగూర్చియు న్యాయమునుగూర్చియు పాడెదను యెహోవా, నిన్ను కీర్తించెదను. నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను. నీవు ఎప్పుడు నాయొద్దకు వచ్చెదవు? నా యింట యథార్థహృదయముతో నడుచుకొందును నా కన్నులయెదుట నేను ఏ దుష్కార్యమును ఉంచు కొనను భక్తిమార్గము తొలగినవారి క్రియలు నాకు అసహ్యములు అవి నాకు అంటనియ్యను మూర్ఖచిత్తుడు నా యొద్దనుండి తొలగిపోవలెను దౌష్ట్యమును నేననుసరింపను. తమ పొరుగువారిని చాటున దూషించువారిని నేను సంహరించెదను అహంకార దృష్టిగలవారిని గర్వించిన హృదయము గలవారిని నేను సహింపను నాయొద్ద నివసించునట్లు దేశములో నమ్మకస్థులైన వారిని నేను కనిపెట్టుచున్నాను నిర్దోషమార్గమందు నడచువారు నాకు పరిచారకులగుదురు. మోసము చేయువాడు నా యింట నివసింపరాదు అబద్ధములాడువాడు నా కన్నులయెదుట నిలువడు. యెహోవా పట్టణములోనుండి పాపము చేయువారినందరిని నిర్మూలము చేయుటకై దేశమందలి భక్తిహీనులందరిని ప్రతి ఉదయమున నేను సంహరించెదను.
- Acts 13:22 అపొస్తలుల కార్యములు 13:22తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయననేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని; అతడు నా యిష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నియు నెరవేర్చునని చెప్పి అతనినిగూర్చి సాక్ష్యమిచ్చెను.
- 2 Samuel 8:15 2 సమూయేలు 8:15దావీదు ఇశ్రాయేలీయులందరిమీద రాజై తన జనుల నందరిని నీతి న్యాయములనుబట్టి యేలుచుండెను.
- 1 Kings 3:6–9 1 రాజులు 3:6–9సొలొమోను ఈలాగు మనవి చేసెనునీ దాసుడును నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్య మును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించెను గనుక నీవు అతనియెడల పరిపూర్ణ కటాక్షమగు పరచి, యీ దినముననున్నట్లుగా అతని సింహా సనముమీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతనియందుమహాకృపను చూపియున్నావు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రియైన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి యున్నావు; అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు; నీ దాసుడనైన నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను; వారు విస్తరించియున్నందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాలదేశమును తనకీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవ్వడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చునట్లు నీ దాసుడనైన నాకు వివేకముగల హృదయము దయ చేయుము.
- Zechariah 11:15–17 జెకర్యా 11:15–17అప్పుడు యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా ఇప్పుడు బుద్ధిలేని యొక కాపరి పనిముట్లను తీసికొమ్ము. ఏలయనగా దేశమందు నేనొక కాపరిని నియమింపబోవు చున్నాను; అతడు నశించుచున్న గొఱ్ఱెలను కనిపెట్టడు, చెదరిపోయినవాటిని వెదకడు, విరిగిపోయినదాని బాగు చేయడు, పుష్టిగా ఉన్నదాని కాపుకాయడు గాని క్రొవ్వినవాటి మాంసమును భక్షించుచు వాటి డెక్కలను తుత్తునియలగా చేయుచుండును. మందను విడనాడు పనికిమాలిన కాపరికి శ్రమ; అతని చెయ్యియు కుడికన్నును తెగవేయబడును; అతని చెయ్యి బొత్తిగా ఎండిపోవును అతని కుడికంటికి దృష్టి బొత్తిగా తప్పును.
- Psalm 75:2 కీర్తనలు 75:2నేను యుక్తకాలమును కనిపెట్టుచున్నాను నేనే న్యాయమునుబట్టి తీర్పు తీర్చుచున్నాను.
- Acts 13:36 అపొస్తలుల కార్యములు 13:36దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరమువారికి సేవచేసి నిద్రించి,
- James 1:5 యాకోబు 1:5మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్నయెడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్ర హింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగ దయచేయువాడు.