Psalms · chapter 91 · verse 13
Psalm 91:13 in Telugu
నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు కొదమ సింహములను భుజంగములను అణగ ద్రొక్కెదవు.
Neevu sinhamulanu naagupaamulanu trokkedavu kodama sinhamulanu bhujangamulanu anaga drokkedavu.
Psalm 91:13 in English
- King James Version (KJV)
- Thou shalt tread upon the lion and adder: the young lion and the dragon shalt thou trample under feet.
- World English Bible (WEB)
- You will tread on the lion and cobra. You will trample the young lion and the serpent underfoot.
- American Standard Version (ASV)
- Thou shalt tread upon the lion and adder: The young lion and the serpent shalt thou trample under foot.
- Bible in Basic English (BBE)
- You will put your foot on the lion and the snake; the young lion and the great snake will be crushed under your feet.
- Darby Translation (DBY)
- Thou shalt tread upon the lion and the adder; the young lion and the dragon shalt thou trample under foot.
- Webster's Bible (WBS)
- Thou shalt tread upon the lion and adder: the young lion and the dragon shalt thou trample under feet.
- Young's Literal Translation (YLT)
- On lion and asp thou treadest, Thou trampest young lion and dragon.
Read in context
- 11నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును
- 12నీ పాదములకు రాయి తగులకుండ వారు నిన్ను తమ చేతులమీద ఎత్తి పట్టుకొందురు
- 13నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు కొదమ సింహములను భుజంగములను అణగ ద్రొక్కెదవు.
- 14అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించెదను అతడు నా నామము నెరిగినవాడు గనుక నేనతని ఘనపరచెదను
- 15అతడు నాకు మొఱ్ఱపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చె దను శ్రమలో నేనతనికి తోడై యుండెదను అతని విడిపించి అతని గొప్ప చేసెదను
Cross references
- Luke 10:19 లూకా 10:19ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటిమీదను మీకు అధికారము అనుగ్రహించియున్నాను; ఏదియు మీ కెంతమాత్రమును హానిచేయదు.
- Mark 16:18 మార్కు 16:18పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను.
- Daniel 6:22 దానియేలు 6:22నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూత నంపించి, సింహములు నాకు ఏహానియు చేయకుండ వాటి నోళ్లు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసినవాడను కాను గదా అనెను.
- 1 Samuel 17:37 1 సమూయేలు 17:37సింహముయొక్క బలమునుండియు, ఎలుగుబంటి యొక్క బలమునుండియు నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలోనుండికూడను నన్ను విడిపించుననియు చెప్పెను. అందుకు సౌలుపొమ్ము; యెహోవా నీకు తోడుగానుండునుగాక అని దావీదుతో అనెను.
- Romans 16:20 రోమీయులకు 16:20సమాధాన కర్తయగు దేవుడు సాతానును మీ కాళ్లక్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై యుండును గాక.
- Judges 14:5–6 న్యాయాధిపతులు 14:5–6అప్పుడు సమ్సోను తన తలిదండ్రులతోకూడ తిమ్నాతు నకుపోయి, తిమ్నాతు ద్రాక్షతోటలవరకు వచ్చినప్పుడు, కొదమసింహము అతని యెదుటికి బొబ్బరించుచువచ్చెను. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతనిచేతిలో ఏమియు లేకపోయినను, ఒకడు మేకపిల్లను చీల్చునట్లు అతడు దానిని చీల్చెను. అతడు తాను చేసినది తన తండ్రితోనైనను తల్లితో నైనను చెప్పలేదు.
- Acts 28:3–6 అపొస్తలుల కార్యములు 28:3–6అప్పుడు పౌలు మోపెడు పుల్లలేరి నిప్పులమీద వేయగా ఒక సర్పము కాకకు బయటికి వచ్చి అతని చెయ్యిపట్టెను ఆ ద్వీపవాసులు ఆ జంతువతని చేతిని వ్రేలాడుట చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుష్యుడు నరహంతకుడు; ఇతడు సముద్రమునుండి తప్పించుకొనినను న్యాయమాతనిని బ్రదుకనియ్యదని తమలో తాము చెప్పు కొనిరి. అతడైతే ఆ విషజంతువును అగ్నిలో జాడించి వేసి, యే హానియు పొందలేదు. వారతని శరీరము వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడిచచ్చునో అని కనిపెట్టుచుండిరి. చాలసేపు కనిపెట్టుచుండిన తరువాత అతనికి ఏ హానియు కలుగకుండుట చూచి ఆ అభిప్రాయము మాని ఇతడొక దేవత అని చెప్పసాగిరి.
- 2 Timothy 4:17 2 తిమోతికి 4:17అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును, అన్య జనులందరును దాని విను నిమిత్తమును, ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను గనుక నేను సింహము నోటనుండి తప్పింపబడితిని.
- Revelation 20:1–2 ప్రకటన 20:1–2మరియు పెద్దసంకెళ్లను చేత పట్టుకొని అగాధము యొక్క తాళపుచెవిగల యొక దేవదూత పరలోకమునుండి దిగివచ్చుట చూచితిని. అతడు ఆదిసర్పమును, అనగా అపవాదియు సాతానును అను ఆ ఘటసర్పమును పట్టుకొని వెయ్యి సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి,
- Isaiah 27:1 యెషయా 27:1ఆ దినమున యెహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గము పట్టుకొనును తీవ్రసర్పమైన మకరమును వంకరసర్పమైన మకరమును ఆయన దండించును సముద్రముమీదనున్న మకరమును సంహరించును.
- Psalm 58:4 కీర్తనలు 58:4వారి విషము నాగుపాము విషమువంటిది మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను
- Job 5:23 యోబు 5:23ప్రళయమును క్షామమును వచ్చునప్పుడు నీవు వాటిని నిర్లక్ష్యము చేయుదువు అడవిమృగములకు నీవు ఏమాత్రమును భయపడవు