Romans · chapter 2 · verse 26
Romans 2:26 in Telugu
కాబట్టి సున్నతి లేనివాడు ధర్మ శాస్త్రపు నీతి విధులను గైకొనిన యెడల అతడు సున్నతి లేనివాడై యుండియు సున్నతిగలవాడుగా ఎంచబడును గదా?
Kaabatti sunnati lenivaadu dharma shaastrapu neeti vidhulanu gaikonina yedala atadu sunnati lenivaadai yundiyu sunnatigalavaadugaa enchabadunu gadaa?
Romans 2:26 in English
- King James Version (KJV)
- Therefore if the uncircumcision keep the righteousness of the law, shall not his uncircumcision be counted for circumcision?
- World English Bible (WEB)
- If therefore the uncircumcised keep the ordinances of the law, won’t his uncircumcision be accounted as circumcision?
- American Standard Version (ASV)
- If therefore the uncircumcision keep the ordinances of the law, shall not his uncircumcision be reckoned for circumcision?
- Bible in Basic English (BBE)
- If those who have not circumcision keep the rules of the law, will it not be credited to them as circumcision?
- Darby Translation (DBY)
- If therefore the uncircumcision keep the requirements of the law, shall not his uncircumcision be reckoned for circumcision,
- Webster's Bible (WBS)
- Therefore, if the uncircumcision keepeth the righteousness of the law, shall not his uncircumcision be counted for circumcision?
- Young's Literal Translation (YLT)
- If, therefore the uncircumcision the righteousness of the law may keep, shall not his uncircumcision for circumcision be reckoned?
Read in context
- 24వ్రాయబడిన ప్రకారము మిమ్మునుబట్టియే గదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడు చున్నది?
- 25నీవు ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వాడవైతివా, సున్నతి ప్రయోజనకరమగును గాని ధర్మ శాస్త్రమును అతిక్రమించువాడవైతివా, నీ సున్నతి సున్నతి కాకపోవును.
- 26కాబట్టి సున్నతి లేనివాడు ధర్మ శాస్త్రపు నీతి విధులను గైకొనిన యెడల అతడు సున్నతి లేనివాడై యుండియు సున్నతిగలవాడుగా ఎంచబడును గదా?
- 27మరియు స్వభావమునుబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రమును నెరవేర్చినయెడల అక్షరమును సున్నతియు గలవాడవై ధర్మశాస్త్రమును అతిక్రమించు నీకు తీర్పు తీర్చడా?
- 28బాహ్యమునకు యూదుడైనవాడు యూదుడు కాడు; శరీరమందు బాహ్యమైన సున్నతి సున్నతికాదు.
Cross references
- Colossians 2:11 కొలొస్సయులకు 2:11మీరును, క్రీస్తు సున్నతియందు, శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయనయందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి.
- 1 Corinthians 7:18–19 1 కొరింథీయులకు 7:18–19సున్నతి పొందినవాడెవడైనను పిలువబడెనా? అతడు సున్నతి పోగొట్టుకొనవలదు; సున్నతి పొందనివాడెవడైనను పిలువబడెనా? సున్నతి పొందవలదు. దేవుని ఆజ్ఞలను అనుసరించుటయే ముఖ్యము గాని సున్నతి పొందుటయందు ఏమియు లేదు, సున్నతి పొందక పోవుటయందు ఏమియులేదు.
- Romans 8:4 రోమీయులకు 8:4దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి, ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను.
- Acts 11:3–18 అపొస్తలుల కార్యములు 11:3–18నీవు సున్నతి పొందనివారియొద్దకు పోయి వారితోకూడ భోజనము చేసితివని అతనితో వాదము పెట్టుకొనిరి. అందుకు పేతురు మొదటనుండి వరుసగా వారికి ఆ సంగతి ఈలాగు వివరించి చెప్పెను నేను యొప్పే పట్టణములో ప్రార్థనచేయుచుండగా పరవశుడనైతిని, అప్పుడొక దర్శనము నాకు కలిగెను; అది ఏదనగా నాలుగు చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటివంటి యొక విధమైన పాత్ర ఆకాశమునుండి దిగి నాయొద్దకు వచ్చెను. దానివైపు నేను తేరి చూచి పరీక్షింపగా భూమియందుండు చతుష్పాద జంతువులును అడవి మృగములును ప్రాకెడు పురుగులును ఆకాశపక్షులును నాకు కనబడెను. అప్పుడు పేతురూ, నీవు లేచి చంపుకొని తినుమని యొక శబ్దము నాతో చెప్పుట వింటిని. అందుకు నేనువద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదియు నా నోట ఎన్నడును పడలేదని చెప్పగా రెండవమారు ఆ శబ్దము ఆకాశము నుండిదేవుడు పవిత్రము చేసినవి నీవు నిషిద్ధమైనవిగా ఎంచవద్దని ఉత్తరమిచ్చెను. ఈలాగు ముమ్మారు జరిగెను; తరువాత అదంతయు ఆకాశమునకు తిరిగి తీసికొని పోబడెను. వెంటనే కైసరయనుండి నాయొద్దకు పంపబడిన ముగ్గురు మనుష్యులు మేమున్న యింటియొద్ద నిలిచి యుండిరి. అప్పుడు ఆత్మనీవు భేదమేమియు చేయక వారితో కూడ వెళ్లుమని నాకు సెలవిచ్చెను. ఈ ఆరుగురు సహోదరులు నాతోకూడ వచ్చిరి; మేము కొర్నేలి యింట ప్రవేశించితివిు. అప్పుడతడునీవు యొప్పేకు మనుష్యు లను పంపి పేతురు అను మారుపేరుగల సీమోనును పిలి పించుము; నీవును నీ యింటివారందరును ఏ మాటలవలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని, తన యింట నిలిచి తనతో చెప్పిన యొక దేవదూతను చూచిన సంగతి మాకు తెలిపెను. నేను మాటలాడ నారంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదికి దిగిన ప్రకారము వారి మీదికిని దిగెను. అప్పుడుయోహాను నీళ్లతో బాప్తిస్మమిచ్చెను గాని మీరు పరిశుద్ధాత్మలో బాప్తి స్మము పొందుదురని ప్రభువు చెప్పినమాట నేను జ్ఞాపకము చేసికొంటిని. కాబట్టి ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసముంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడ సమానవరము అనుగ్రహించి యుండగా, దేవుని అడ్డగించుటకు నేను ఏపాటివాడనని చెప్పెను. వారు ఈ మాటలు విని మరేమి అడ్డము చెప్పక అట్లయితే అన్య జనులకును దేవుడు జీవార్థమైన మారుమనస్సు దయచేసి యున్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమ పరచిరి.
- Romans 3:30 రోమీయులకు 3:30దేవుడు ఒకడే గనుక, ఆయన సున్నతి గలవారిని విశ్వాస మూలముగాను, సున్నతి లేనివారిని విశ్వాసముద్వారాను, నీతిమంతులనుగా తీర్చును.
- Acts 10:34–35 అపొస్తలుల కార్యములు 10:34–35దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి యున్నాను. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును.
- Matthew 15:28 మత్తయి 15:28అందుకు యేసు అమ్మా, నీ విశ్వాసము గొప్పది; నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను.
- Philippians 3:3 ఫిలిప్పీయులకు 3:3ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసికొనక దేవునియొక్క ఆత్మవలన ఆరాధించుచు, క్రీస్తుయేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము.
- Acts 10:2–4 అపొస్తలుల కార్యములు 10:2–4అతడు తన యింటి వారందరితోకూడ దేవుని యందు భయభక్తులు గలవాడైయుండి, ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడును దేవునికి ప్రార్థన చేయు వాడు. పగలు ఇంచుమించు మూడు గంటలవేళ దేవుని దూత అతనియొద్దకు వచ్చి కొర్నేలీ, అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా, యేమని అడిగెను. అందుకు దూతనీ ప్రార్థనలును నీ ధర్మకార్యములును దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి.
- Matthew 8:11–12 మత్తయి 8:11–12అనేకులు తూర్పునుండియు పడమటనుండియు వచ్చి అబ్రాహాముతో కూడను, ఇస్సాకుతో కూడను, యాకోబుతో కూడను, పరలోకరాజ్యమందు కూర్చుందురు గాని రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు; అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు నుండునని మీతో చెప్పుచున్నాననెను.
- Isaiah 56:6–7 యెషయా 56:6–7విశ్రాంతిదినమును అపవిత్రపరచకుండ ఆచరించుచు నా నిబంధనను ఆధారము చేసికొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలెనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చెదను నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేసెదను నా బలిపీఠముమీద వారర్పించు దహనబలులును బలులును నాకు అంగీకారములగును నా మందిరము సమస్తజనులకు ప్రార్థనమందిరమన బడును.
- Ephesians 2:11 ఎఫెసీయులకు 2:11కాబట్టి మునుపు శరీరవిషయములో అన్యజనులైయుండి, శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారిచేత సున్నతిలేనివారనబడిన మీరు
Original words (Greek)
- Therefore · G3767οὖν oûn
- if · G1437ἐάν eán
- uncircumcision · G203ἀκροβυστία akrobystía
- keep · G5442φυλάσσω phylássō
- righteousness · G1345δικαίωμα dikaíōma
- law · G3551νόμος nómos
- not · G3780οὐχί ouchí
- his · G846αὐτός autós
- uncircumcision · G203ἀκροβυστία akrobystía
- counted · G3049λογίζομαι logízomai
- for · G1519εἰς eis
- circumcision · G4061περιτομή peritomḗ