Skip to content
ThuthiThuthiThuthi
Bible verses by topic

Peace Bible Verses in Telugu

సమాధానము వాక్యాలు

Verses of peace for an anxious heart.

  1. శాంతి మీ కనుగ్రహించి వెళ్లుచున్నాను; నా శాంతినే మీ కనుగ్రహించుచున్నాను; లోకమిచ్చు నట్టుగా నేను మీ కనుగ్రహించుటలేదు; మీ హృదయ మును కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి.

    Peace I leave with you, my peace I give unto you: not as the world giveth, give I unto you. Let not your heart be troubled, neither let it be afraid.

    John 14:27 (యోహాను 14:27)
  2. దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తువలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి యుండును.

    Be careful for nothing; but in every thing by prayer and supplication with thanksgiving let your requests be made known unto God. And the peace of God, which passeth all understanding, shall keep your hearts and minds through Christ Jesus.

    Philippians 4:6–7 (ఫిలిప్పీయులకు 4:6–7)
  3. ఎవనిమనస్సు నీమీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతిగలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీయందు విశ్వాసముంచి యున్నాడు.

    Thou wilt keep [him] in perfect peace, [whose] mind [is] stayed [on thee:] because he trusteth in thee.

    Isaiah 26:3 (యెషయా 26:3)
  4. నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి యున్నాననెను.

    These things I have spoken unto you, that in me ye might have peace. In the world ye shall have tribulation: but be of good cheer; I have overcome the world.

    John 16:33 (యోహాను 16:33)
  5. యెహోవా నీమీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక.

    The LORD lift up his countenance upon thee, and give thee peace.

    Numbers 6:26 (సంఖ్యాకాండము 6:26)
  6. కాగా మీరు పరిశుద్ధాత్మశక్తి పొంది, విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక.

    Now the God of hope fill you with all joy and peace in believing, that ye may abound in hope, through the power of the Holy Ghost.

    Romans 15:13 (రోమీయులకు 15:13)
  7. క్రీస్తు అను గ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలు చుండ నియ్యుడి; ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి; మరియు కృతజ్ఞులై యుండుడి.

    And let the peace of God rule in your hearts, to the which also ye are called in one body; and be ye thankful.

    Colossians 3:15 (కొలొస్సయులకు 3:15)
  8. యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవుదునునేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు.

    I will both lay me down in peace, and sleep: for thou, LORD, only makest me dwell in safety.

    Psalm 4:8 (కీర్తనలు 4:8)
  9. సమాధానకర్తయగు ప్రభువు తానే యెల్లప్పుడును ప్రతి విధముచేతను మీకు సమాధానము అనుగ్రహించును గాక. ప్రభువు మీకందరికి తోడైయుండును గాక.

    Now the Lord of peace himself give you peace always by all means. The Lord [be] with you all.

    2 Thessalonians 3:16 (2 థెస్సలొనీకయులకు 3:16)
  10. ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.

    For unto us a child is born, unto us a son is given: and the government shall be upon his shoulder: and his name shall be called Wonderful, Counsellor, The mighty God, The everlasting Father, The Prince of Peace.

    Isaiah 9:6 (యెషయా 9:6)
  11. సమాధానపరచువారు ధన్యులు; వారు దేవుని కుమారులనబడుదురు.

    Blessed [are] the peacemakers: for they shall be called the children of God.

    Matthew 5:9 (మత్తయి 5:9)
  12. యెహోవా తన ప్రజలకు బలము ననుగ్రహించును యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారి నాశీర్వదించును.

    The LORD will give strength unto his people; the LORD will bless his people with peace.

    Psalm 29:11 (కీర్తనలు 29:11)

More Bible verses in Telugu

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.