Thanksgiving Bible Verses in Telugu
కృతజ్ఞత వాక్యాలు
Verses of thanksgiving and praise.
కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి ఆయనను స్తుతించుడి ఆయన నామమును ఘనపరచుడి.
Enter into his gates with thanksgiving, [and] into his courts with praise: be thankful unto him, [and] bless his name.
Psalm 100:4 (కీర్తనలు 100:4) యెహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన కృప నిత్యముండును.
O give thanks unto the LORD, for [he is] good: for his mercy [endureth] for ever.
Psalm 107:1 (కీర్తనలు 107:1) ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము.
In every thing give thanks: for this is the will of God in Christ Jesus concerning you.
1 Thessalonians 5:18 (1 థెస్సలొనీకయులకు 5:18) నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. నా అంతరంగముననున్న సమస్తమా, ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము
[A Psalm] of David. Bless the LORD, O my soul: and all that is within me, [bless] his holy name. Bless the LORD, O my soul, and forget not all his benefits:
Psalm 103:1–2 (కీర్తనలు 103:1–2) మరియు మాటచేత గాని క్రియచేత గాని, మీరేమి చేసినను ప్రభువైన యేసుద్వారా తండ్రియైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, సమస్తమును ఆయన పేరట చేయుడి.
And what soever ye do in word or deed, [do] all in the name of the Lord Jesus, giving thanks to God and the Father by him.
Colossians 3:17 (కొలొస్సయులకు 3:17) యెహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముండును.
O give thanks unto the LORD; for [he is] good: for his mercy [endureth] for ever.
Psalm 136:1 (కీర్తనలు 136:1) మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమునుగూర్చి తండ్రియైన దేవునికి ఎల్లప్పుడును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు,
Giving thanks always for all things unto God and the Father in the name of our Lord Jesus Christ;
Ephesians 5:20 (ఎఫెసీయులకు 5:20) నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను యెహోవా, నీ అద్భుతకార్యములన్నిటిని నేను వివరించెదను.
I will praise [thee], O LORD, with my whole heart; I will shew forth all thy marvellous works.
Psalm 9:1 (కీర్తనలు 9:1) కాబట్టి ఆయనద్వారా మనము దేవునికి ఎల్లప్పుడును స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు, జిహ్వాఫలము అర్పించుదము.
By him therefore let us offer the sacrifice of praise to God continually, that is, the fruit of [our] lips giving thanks to his name.
Hebrews 13:15 (హెబ్రీయులకు 13:15) ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము దీనియందు మనము ఉత్సహించి సంతోషించెదము.
This [is] the day [which] the LORD hath made; we will rejoice and be glad in it.
Psalm 118:24 (కీర్తనలు 118:24) సకలప్రాణులు యెహోవాను స్తుతించుదురు గాక యెహోవాను స్తుతించుడి.
Let every thing that hath breath praise the LORD. Praise ye the LORD.
Psalm 150:6 (కీర్తనలు 150:6) దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి.
Be careful for nothing; but in every thing by prayer and supplication with thanksgiving let your requests be made known unto God.
Philippians 4:6 (ఫిలిప్పీయులకు 4:6)
More Bible verses in Telugu
- Blessing ఆశీర్వాదము
- Comfort ఆదరణ
- Strength బలము
- Motivation and success విజయము
- Love ప్రేమ
- Peace సమాధానము
- Faith విశ్వాసము
- Healing స్వస్థత
- Prayer ప్రార్థన
- Birthday పుట్టినరోజు
- Wedding and marriage వివాహము
- New Year నూతన సంవత్సరము
- Children పిల్లలు
- Fear and worry భయము, చింత
- Forgiveness క్షమాపణ
- Salvation రక్షణ
- Holy Spirit పరిశుద్ధాత్మ
- Christmas క్రిస్మస్
- Good Friday and Easter గుడ్ ఫ్రైడే, ఈస్టర్