Skip to content
ThuthiThuthiThuthi

Krotta Yedu Modalu Bettenu Mana Song Lyricsక్రొత్త యేడు మొదలు బెట్టెను మన

Also searched as: krotha yedu modalu

Krotta Yedu Modalu Bettenu Mana Lyrics in Telugu & English

Present

Chorus

క్రొత్త యేడు మొదలు బెట్టెను మన బ్రతుకునందుఁ క్రొత్త మనసు తోడ

మీరు క్రొత్త యేటఁ బ్రభుని నేవఁ దత్తర పడకుండఁ జేయు

టుత్తమోత్తమంబుఁ జూడఁ ||క్రొత్త||

Krotta Yedu Modalu Bettenu Mana Bratukunandun Krotta Manasu Toda

Meeru Krotta Yetan Brabhuni Nevan Dattara Padakundan Jeyu

Tuttamottamambun Joodan ||Krotta||

Verse 1

పొంది యున్న మేలు లన్నియుఁ బొంకబు మీఱ డెందమందు స్మరణ

జేయుఁడీ యిందు మీరు మొదలు బెట్టు పందెమందుఁ గెల్వ వలయు

నందముగను రవినిఁబోలి నలయకుండ మెలయకుండఁ ||క్రొత్త||

Pondi Yunna Melu Lanniyun Bonkabu Meera Dendamandu Smarana

Jeyundee Yindu Meeru Modalu Bettu Pandemandun Gelva Valayu

Nandamuganu Ravininboli Nalayakunda Melayakundan ||Krotta||

Verse 2

మేలు సేయఁ దడ వొనర్పఁగా మీరెఱుఁగునట్లు కాలమంత నిరుడు

గడ చెఁగా ప్రాలుమాలి యుండకుండ జాల మేలు సేయవలయుఁ

జాల జనముల కిమ్మాను యేలు నామ ఘనతకొఱకుఁ ||క్రొత్త||

Melu Seyan Dada Vonarpangaa Meererungunatlu Kaalamanta Nirudu

Gada Chengaa Praalumaali Yundakunda Jaala Melu Seyavalayun

Jaala Janamula Kimmaanu Yelu Naama Ghanatakorakun ||Krotta||

Verse 3

బలము లేని వార మయ్యును బల మొంద వచ్చుఁ గలిమి మీఱఁ గర్త

వాక్కున నలయకుండ నలగకుండ మోద మొంది బల మొసంగు సర్వవిధుల

నెలమి మీ రొనర్చుచుండఁ ||క్రొత్త||

Balamu Leni Vaara Mayyunu Bala Monda Vachchun Galimi Meeran Garta

Vaakkuna Nalayakunda Nalagakunda Moda Mondi Bala Mosangu Sarvavidhula

Nelami Mee Ronarchuchundan ||Krotta||

Verse 4

ఇద్ధరిత్రి నుండు నప్పుడే యీశ్వరుని జనులు వృద్ధిబొందఁ జూడ

వలయును బుద్ధి నీతి శుద్ధులందు వృద్ధినొంద శ్రద్ధఁ జేయ శుద్ధు లైన

వారిలోఁ ప్ర సిద్ధు లగుచు వెలుఁగ వచ్చుఁ ||క్రొత్త||

Iddharitri Nundu Nappude Yeeshvaruni Janulu Vruddhibondan Jooda

Valayunu Buddhi Neeti Shuddhulandu Vruddhinonda Shraddhan Jeya Shuddhu Laina

Vaarilon Pra Siddhu Laguchu Velunga Vachchun ||Krotta||

Verse 5

పాపపంక మంటినప్పుడు ప్రభు క్రీస్తు యేసు ప్రాపుఁ జూరి మీరు వేఁ

డ గా నేపుమీఱఁ దనదు కరుణఁ బాప మంతఁ గడిగివేసి పాపరోగ

చిహ్న లన్ని బాపివేసి శుద్ధిఁ జేయుఁ ||క్రొత్త||

Paapapanka Mantinappudu Prabhu Kreestu Yesu Praapun Joori Meeru Ven

Da Gaa Nepumeeran Danadu Karunan Baapa Mantan Gadigivesi Paaparoga

Chihna Lanni Baapivesi Shuddhin Jeyun ||Krotta||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with K