1 Chronicles · chapter 12 · verse 17
1 Chronicles 12:17 in Telugu
దావీదు బయలుదేరి వారికి ఎదురుగా పోయి వారితో ఇట్లనెనుమీరు సమాధానము కలిగి నాకు సహాయముచేయుటకై నాయొద్దకు వచ్చియున్నయెడల నా హృదయము మీతో అతికియుండును; అట్లుగాక నా వలన మీకు అపకారమేదియు కలుగలేదని యెరిగి యుండియు, నన్ను నా శత్రువులచేతికి అప్పగింపవలెనని మీరు వచ్చియున్నయెడల మన పితరులయొక్క దేవుడు దీనిని చూచి మిమ్మును గద్దించును గాక.
Daaveedu bayaluderi vaariki edurugaa poyi vaarito itlanenumeeru samaadhaanamu kaligi naaku sahaayamucheyutakai naayoddaku vachchiyunnayedala naa hrudayamu meeto atikiyundunu; atlugaaka naa valana meeku apakaaramediyu kalugaledani yerigi yundiyu, nannu naa shatruvulachetiki appagimpavalenani meeru vachchiyunnayedala mana pitarulayokka devudu deenini choochi mimmunu gaddinchunu gaaka.
1 Chronicles 12:17 in English
- King James Version (KJV)
- And David went out to meet them, and answered and said unto them, If ye be come peaceably unto me to help me, mine heart shall be knit unto you: but if [ye be come] to betray me to mine enemies, seeing [there is] no wrong in mine hands, the God of our fathers look [thereon], and rebuke [it].
- World English Bible (WEB)
- David went out to meet them, and answered them, “If you have come peaceably to me to help me, my heart will be united with you; but if you have come to betray me to my adversaries, since there is no wrong in my hands, may the God of our fathers see this and rebuke it.”
- American Standard Version (ASV)
- And David went out to meet them, and answered and said unto them, If ye be come peaceably unto me to help me, my heart shall be knit unto you; but if [ye be come] to betray me to mine adversaries, seeing there is no wrong in my hands, the God of our fathers look thereon, and rebuke it.
- Bible in Basic English (BBE)
- And David went out to them, and said to them, If you have come in peace to give me help, my heart will be united with yours; but if you have come to give me up to those who would take my life, though my hands are clean from wrongdoing, then may the God of our fathers see it and give you punishment.
- Darby Translation (DBY)
- And David went out to meet them, and answered and said to them, If ye come peaceably to me to help me, my heart shall be knit unto you; but if to betray me to mine enemies, seeing there is no wrong in my hands, the God of our fathers see [it] and rebuke [it].
- Webster's Bible (WBS)
- And David went out to meet them, and answered and said to them, If ye have come peaceably to me to help me, my heart shall be knit to you: but if [ye have come] to betray me to my enemies, seeing [there is] no wrong in my hands, the God of our fathers look [on it] , and rebuke [it] .
- Young's Literal Translation (YLT)
- and David goeth out before them, and answereth and saith to them, 'If for peace ye have come in unto me, to help me, I have a heart to unite with you; and if to betray me to mine adversaries — without violence in my hands — the God of our fathers doth see and reprove.'
Read in context
- 15యొర్దాను గట్టులమీదుగా పొర్లి పారుచుండు మొదటి నెలయందు దానిని దాటిపోయి తూర్పులోయలలోను పడమటిలోయలలోను ఉన్న వారినందరిని తరిమివేసినవారు వీరే.
- 16మరియు బెన్యామీనీయులలో కొందరును యూదావారిలో కొందరును దావీదు దాగియున్న స్థలమునకు వచ్చిరి.
- 17దావీదు బయలుదేరి వారికి ఎదురుగా పోయి వారితో ఇట్లనెనుమీరు సమాధానము కలిగి నాకు సహాయముచేయుటకై నాయొద్దకు వచ్చియున్నయెడల నా హృదయము మీతో అతికియుండును; అట్లుగాక నా వలన మీకు అపకారమేదియు కలుగలేదని యెరిగి యుండియు, నన్ను నా శత్రువులచేతికి అప్పగింపవలెనని మీరు వచ్చియున్నయెడల మన పితరులయొక్క దేవుడు దీనిని చూచి మిమ్మును గద్దించును గాక.
- 18అప్పుడు ముప్పదిమందికి అధిపతియైన అమాశై ఆత్మవశుడైదావీదూ, మేము నీవారము; యెష్షయి కుమారుడా, మేము నీ పక్షమున ఉన్నాము; నీకు సమాధానము కలుగునుగాక, సమా ధానము కలుగునుగాక, నీ సహకారులకును సమాధానము కలుగునుగాక, నీ దేవుడే నీకు సహాయము చేయునని పలు కగా దావీదు వారిని చేర్చుకొని వారిని తన దండునకు అధిపతులుగా చేసెను.
- 19సౌలుమీద యుద్ధముచేయబోయిన ఫిలిష్తీయులతో కూడ దావీదు వచ్చినప్పుడు మనష్షే సంబం ధులలో కొందరును అతని పక్షముచేరిరి; దావీదు ఫిలిష్తీ యులకు సహాయము చేయకపోయెను, ఏలయనగా అతడు తన యజమానుడైన సౌలు పక్షమునకు మరలి తమకు ప్రాణ హాని చేయునని యెంచి ఫిలిష్తీయుల అధికారులు అతని పంపివేసిరి.
Cross references
- Jude 1:9 యూదా 1:9అయితే ప్రధానదూతయైన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషేయొక్క శరీరమునుగూర్చి తర్కించి నప్పుడు, దూషించి తీర్పుతీర్చ తెగింపకప్రభువు నిన్ను గద్దించును గాక అనెను.
- 1 Peter 2:23 1 పేతురు 2:23ఆయన దూషింప బడియు బదులు దూషింపలేదు; ఆయన శ్రమపెట్టబడియు బెదిరింపక, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను.
- 1 Samuel 26:23–24 1 సమూయేలు 26:23–24యెహోవా ఈ దినము నిన్ను నాకు అప్పగించినను నేను యెహోవా చేత అభిషేకము నొందినవానిని చంపనొల్లక పోయినందున ఆయన నా నీతిని నా విశ్వాస్యతను చూచి నాకు ప్రతిఫలము దయ చేయును. చిత్తగించుము, ఈ దినమున నీ ప్రాణము నా దృష్టికి ఘనమైనందున యెహోవా నా ప్రాణమును తన దృష్టికి ఘనముగా ఎంచి బాధలన్నిటిలోనుండి నన్ను రక్షించునుగాక అని చెప్పెను.
- Philippians 1:27 ఫిలిప్పీయులకు 1:27నేను వచ్చి మిమ్మును చూచినను, రాకపోయినను, మీరు ఏ విషయములోను ఎదిరించువారికి బెదరక, అందరును ఒక్క భావమఇుతో సువార్త విశ్వాసపక్షమున పోరాడుచు, ఏక మనస్సుగలవారై నిలిచియున్నారని నేను మిమ్మును గూర్చి వినులాగున, మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి.
- Psalm 7:6 కీర్తనలు 7:6యెహోవా, కోపము తెచ్చుకొని లెమ్మునా విరోధుల ఆగ్రహము నణచుటకై లెమ్మునన్ను ఆదుకొనుటకై మేల్కొనుము న్యాయవిధిని నీవు నియమించియున్నావు గదా.
- Acts 4:32 అపొస్తలుల కార్యములు 4:32విశ్వసించినవారందరును ఏకహృదయమును ఏకాత్మయు గలవారై యుండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు; వారికి కలిగినదంతయు వారికి సమష్టిగా ఉండెను.
- Jeremiah 32:39 యిర్మీయా 32:39మరియు వారికిని వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడునట్లు నేను వారికి ఏకహృదయమును ఏక మార్గమును దయచేయుదును.
- 1 Kings 2:13 1 రాజులు 2:13అంతలో హగ్గీతు కుమారుడైన అదో నీయా సొలొమోను తల్లియగు బత్షెబయొద్దకు రాగా ఆమె సమాధానముగా వచ్చుచున్నావా అని అతని నడిగెను. అతడు సమాధానముగానే వచ్చుచున్నానని చెప్పి
- Zechariah 3:2 జెకర్యా 3:2సాతానూ, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొను యెహోవా నిన్ను గద్దించును ఇతడు అగ్నిలోనుండి తీసిన కొరవివలెనే యున్నాడుగదా అని యెహోవా దూత సాతానుతో అనెను.
- Genesis 31:53 ఆదికాండము 31:53అబ్రాహాము దేవుడు నాహోరు దేవుడు వారి తండ్రి దేవుడు మన మధ్య న్యాయము తీర్చునని చెప్పెను. అప్పుడు యాకోబు తన తండ్రియైన ఇస్సాకు భయపడిన దేవునితోడని ప్రమాణము చేసెను.
- 1 Samuel 24:11–17 1 సమూయేలు 24:11–17నా తండ్రీ చూడుము, ఇదిగో, చూడుము. నిన్ను చంపక నీ వస్త్రపుచెంగు మాత్రమే కోసితిని గనుక నావలన నీకు కీడు ఎంతమాత్రుును రాదనియు, నాలో తప్పిదము ఎంతమాత్రమును లేదనియు, నీవు తెలిసికొనవచ్చును. నీ విషయమై నేను ఏపాపమును చేయనివాడనై యుండగా నీవు నా ప్రాణము తీయవలెనని నన్ను తరుముచున్నావు. నీకును నాకును మధ్య యెహోవా న్యాయము తీర్చును. యెహోవా నా విషయమై పగతీర్చునుగాని నేను నిన్ను చంపను. పూర్వికులు సామ్యము చెప్పినట్టు దుష్టుల చేతనే దౌష్ట్యము పుట్టునుగాని నేను నిన్ను చంపను. ఇశ్రాయేలీయుల రాజు ఎవని పట్టుకొన బయలుదేరి వచ్చి యున్నాడు? ఏపాటివానిని తరుముచున్నాడు? చచ్చిన కుక్కనుగదా? మిన్నల్లిని గదా? యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతియై తీర్పు తీర్చునుగాక; ఆయనే సంగతి విచారించి నా పక్షమున వ్యాజ్యెమాడి నీ వశము కాకుండ నన్ను నిర్దోషినిగా తీర్చునుగాక. దావీదు ఈ మాటలు సౌలుతో మాటలాడి చాలింపగా సౌలుదావీదా నాయనా, ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి దావీదుతో ఇట్లనెను - యెహోవా నన్ను నీచేతి కప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు
- Genesis 31:42 ఆదికాండము 31:42నా తండ్రి దేవుడు, అబ్రాహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడైయుండనియెడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి యుందువు. దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి, పోయిన రాత్రి నిన్ను గద్దించెనని లాబానుతో చెప్పెను.
Original words (Hebrew)
- David · H1732דָּוִד Dâvid
- out · H3318יָצָא yâtsâʼ
- meet · H6440פָּנִים pânîym
- answered · H6030עָנָה ʻânâh
- said · H559אָמַר ʼâmar
- come · H935בּוֹא bôwʼ
- peaceably · H7965שָׁלוֹם shâlôwm
- help · H5826עָזַר ʻâzar
- heart · H3824לֵבָב lêbâb
- knit · H3162יַחַד yachad
- betray · H7411רָמָה râmâh
- enemies · H6862צַר tsar
- no · H3808לֹא lôʼ
- wrong · H2555חָמָס châmâç
- hands · H3709כַּף kaph
- God · H430אֱלֹהִים ʼĕlôhîym
- fathers · H1אָב ʼâb
- look · H7200רָאָה râʼâh
- rebuke · H3198יָכַח yâkach