1 Kings · chapter 6 · verse 12
1 Kings 6:12 in Telugu
ఈ మందిరమును నీవు కట్టించుచున్నావే; నీవు నా కట్టడలను న్యాయవిధులను అనుసరించి నడుచుకొనుచు, నేను నియమించిన ఆజ్ఞలన్నిటిని గైకొనిన యెడల నీ తండ్రియైన దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరచెదను;
Ee mandiramunu neevu kattinchuchunnaave; neevu naa kattadalanu nyaayavidhulanu anusarinchi naduchukonuchu, nenu niyaminchina aajnyalannitini gaikonina yedala nee tandriyaina daaveeduto nenu chesina vaagdaanamunu nee pakshamugaa sthiraparachedanu;
1 Kings 6:12 in English
- King James Version (KJV)
- [Concerning] this house which thou art in building, if thou wilt walk in my statutes, and execute my judgments, and keep all my commandments to walk in them; then will I perform my word with thee, which I spake unto David thy father:
- World English Bible (WEB)
- “Concerning this house which you are building, if you will walk in my statutes, and execute my ordinances, and keep all my commandments to walk in them, then I will establish my word with you, which I spoke to David your father.
- American Standard Version (ASV)
- Concerning this house which thou art building, if thou wilt walk in my statutes, and execute mine ordinances, and keep all my commandments to walk in them; then will I establish my word with thee, which I spake unto David thy father.
- Bible in Basic English (BBE)
- About this house which you are building: if you will keep my laws and give effect to my decisions and be guided by my rules, I will give effect to my word which I gave to David your father.
- Darby Translation (DBY)
- As to this house which thou art building, if thou wilt walk in my statutes, and practise mine ordinances, and keep all my commandments to walk in them, then will I perform my word as to thee which I spoke unto David thy father;
- Webster's Bible (WBS)
- [Concerning] this house which thou art in building, if thou wilt walk in my statutes, and execute my judgments, and keep all my commandments to walk in them; then will I perform my word with thee, which I spoke to David thy father:
- Young's Literal Translation (YLT)
- 'This house that thou art building — if thou dost walk in My statutes, and My judgments dost do, yea, hast done all My commands, to walk in them, then I have established My word with thee, which I spake unto David thy father,
Read in context
- 10మరియు మందిరమునకు చుట్టు గదులను కట్టించెను; ఇవి అయిదు మూరల యెత్తుగలవై దేవదారు దూలములచేత మందిరముతో దిట్టముగా సంధింపబడెను.
- 11అంతలో యెహోవా వాక్కు సొలొమోనునకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.
- 12ఈ మందిరమును నీవు కట్టించుచున్నావే; నీవు నా కట్టడలను న్యాయవిధులను అనుసరించి నడుచుకొనుచు, నేను నియమించిన ఆజ్ఞలన్నిటిని గైకొనిన యెడల నీ తండ్రియైన దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరచెదను;
- 13నా జనులైన ఇశ్రాయేలీయులను విడిచిపెట్టక నేను వారిమధ్య నివాసము చేసెదను.
- 14ఈ ప్రకారము సొలొమోను మందిరమును కట్టించి ముగించెను.
Cross references
- 1 Chronicles 22:10 1 దినవృత్తాంతములు 22:10అతడు నా నామమునకు ఒక మందిరమును కట్టించును, అతడు నాకు కుమారుడై యుండును, నేనతనికి తండ్రినై యుందును, ఇశ్రాయేలీయులమీద అతని రాజ్య సింహాసనమును నిత్యము స్థిరపరచుదును.
- Colossians 1:23 కొలొస్సయులకు 1:23పునాదిమీద కట్టబడినవారై స్థిరముగా ఉండి, మీరు విన్నట్టియు, ఆకాశముక్రింద ఉన్న సమస్తసృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్తవలన కలుగు నిరీక్షణనుండి తొలగిపోక, విశ్వాసమందు నిలిచి యుండినయెడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని.
- 2 Samuel 7:12–16 2 సమూయేలు 7:12–16నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడ నిద్రించిన తరువాత నీ గర్భములోనుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి, రాజ్యమును అతనికి స్థిరపరచెదను. అతడు నా నామ ఘనతకొరకు ఒక మందిరమును కట్టించును; అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను; నేనతనికి తండ్రినై యుందును. అతడు నాకు కుమారుడై యుండును; అతడు పాపముచేసినయెడల నరులదండముతోను మనుష్యులకు తగులు దెబ్బలతోను అతని శిక్షింతును గాని నిన్ను స్థాపించుటకై నేను కొట్టి వేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను.
- 1 Kings 9:3–6 1 రాజులు 9:3–6అతనితో ఈలాగు సెలవిచ్చెను - నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించితిని, నా నామమును అక్కడ సదాకాలము ఉంచుటకు నీవు కట్టించిన యీ మందిరమును పరిశుద్ధపరచియున్నాను; నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడు అక్కడ ఉండును. నీ తండ్రి యైన దావీదు నడిచినట్లు నీవును యథార్థహృద యుడవై నీతిని బట్టి నడుచుకొని, నేను నీకు సెలవిచ్చిన దంతటిప్రకారము చేసి నా కట్టడలను విధులను అను సరించిన యెడల నీ సంతతిలో ఒకడు ఇశ్రాయేలీయులమీద సింహాసనాసీనుడై యుండక మానడని నీ తండ్రియైన దావీదునకు నేను సెల విచ్చియున్నట్లు ఇశ్రాయేలీయుల మీద నీ సింహాసనమును చిరకాలమువరకు స్థిరపరచుదును. అయితే మీరేగాని మీ కుమారులే గాని యేమాత్రమైనను నన్ను వెంబడించుట మాని, నేనిచ్చిన ఆజ్ఞలను కట్టడలను అనుసరింపక యితరమైన దేవతలను కొలిచి పూజిం చినయెడల
- Psalm 132:12 కీర్తనలు 132:12యెహోవా సత్యప్రమాణము దావీదుతో చేసెను ఆయన మాట తప్పనివాడు.
- 1 Kings 3:14 1 రాజులు 3:14మరియు నీ తండ్రియైన దావీదు నా మార్గములలో నడచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనినట్లు నీవు నడచి వాటిని గైకొనిన యెడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసెదను అనెను.
- 1 Chronicles 28:9 1 దినవృత్తాంతములు 28:9సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రియొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటిని సంకల్పములన్నిటిని ఎరిగినవాడునై యున్నాడు. నీవు ఆయనను తెలిసికొని హృదయపూర్వకముగాను మనః పూర్వకముగాను ఆయనను సేవించుము, ఆయనను వెదకినయెడల ఆయన నీకు ప్రత్యక్షమగును, నీవు ఆయనను విసర్జించినయెడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసి వేయును.
- Zechariah 3:7 జెకర్యా 3:7సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగానా మార్గములలొ నడుచుచు నేను నీ కప్పగించిన దానిని భద్రముగా గైకొనిన యెడల, నీవు నా మందిరముమీద అధికారివై నా ఆవరణ ములను కాపాడువాడవగుదువు; మరియు ఇక్కడ నిలువ బడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీ కిత్తును.
- 1 Kings 8:25 1 రాజులు 8:25యెహోవా ఇశ్రాయేలీయుల దేవానీ కుమారులు సత్ ప్రవర్తనగలవారై, నీవు నా యెదుట నడచి నట్లు నా యెదుట నడచినయెడల, నా దృష్టికి అనుకూలుడై ఇశ్రాయేలీయులమీద సింహాసనాసీనుడగువాడు నీకుండక మానడని సెలవిచ్చితివి. నీవు నీ దాసుడును నా తండ్రియునగు దావీదునకు ఇచ్చిన వాగ్దానమును స్థిర పరచుము.
- 2 Chronicles 7:17–18 2 దినవృత్తాంతములు 7:17–18నీ తండ్రియైన దావీదు నడచినట్లుగా నీవును నా కనుకూల వర్తనుడవై నడచి, నేను నీకాజ్ఞాపించిన దానియంతటి ప్రకారముచేసి, నా కట్టడలను నా న్యాయ విధులను అనుసరించినయెడల ఇశ్రాయేలీయులను ఏలు టకు స్వసంతతివాడు ఒకడు నీకుండకపోడని నేను నీ తండ్రియైన దావీదుతో చేసియున్న నిబంధననుబట్టి నేను నీ రాజ్యసింహాసనమును స్థిరపరచుదును.
- 1 Kings 2:3–4 1 రాజులు 2:3–4నీ దేవుడైన యెహోవా అప్పగించినదానిని కాపాడి, ఆయన మార్గముల ననుసరించిన యెడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడియున్న దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మమంతటిని ఆయన న్యాయ విధులను శాసనములను గైకొనుము; అప్పుడునీ పిల్లలు తమ ప్రవర్తన విషయములో జాగ్రత్తగా నుండి నాయెదుట తమ పూర్ణహృద యముతోను పూర్ణమనస్సుతోను సత్యము ననుసరించి నడుచుకొనిన యెడల ఇశ్రాయేలీయుల రాజ్య సింహాసనము మీద ఆసీనుడగు ఒకడు నీకు ఉండక మానడని యెహోవా నన్ను గూర్చి ప్రమాణము చేసిన మాటను స్థిరపరచును.
- 1 Samuel 12:14–15 1 సమూయేలు 12:14–15మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగముచేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించినయెడల మీకు క్షేమము కలుగును. అయితే యెహోవా మాట వినక ఆయన ఆజ్ఞను భంగము చేసినయెడల యెహోవా హస్తము మీ పితరులకు విరోధ ముగా నుండినట్లు మీకును విరోధముగా నుండును.
Original words (Hebrew)
- house · H1004בַּיִת bayith
- building · H1129בָּנָה bânâh
- walk · H3212יָלַךְ yâlak
- statutes · H2708חֻקָּה chuqqâh
- execute · H6213עָשָׂה ʻâsâh
- judgments · H4941מִשְׁפָּט mishpâṭ
- keep · H8104שָׁמַר shâmar
- commandments · H4687מִצְוָה mitsvâh
- walk · H3212יָלַךְ yâlak
- perform · H6965קוּם qûwm
- word · H1697דָּבָר dâbâr
- spake · H1696דָבַר dâbar
- David · H1732דָּוִד Dâvid
- father · H1אָב ʼâb