2 Corinthians · chapter 11 · verse 15
2 Corinthians 11:15 in Telugu
గనుక వాని పరిచారకులును నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతికాదు. వారి క్రియల చొప్పున వారి కంతము కలుగును.
Ganuka vaani parichaarakulunu neeti parichaarakula veshamu dharinchukonuta goppa sangatikaadu. Vaari kriyala choppuna vaari kantamu kalugunu.
2 Corinthians 11:15 in English
- King James Version (KJV)
- Therefore [it is] no great thing if his ministers also be transformed as the ministers of righteousness; whose end shall be according to their works.
- World English Bible (WEB)
- It is no great thing therefore if his servants also masquerade as servants of righteousness, whose end will be according to their works.
- American Standard Version (ASV)
- It is no great thing therefore if his ministers also fashion themselves as ministers of righteousness; whose end shall be according to their works.
- Bible in Basic English (BBE)
- So it is no great thing if his servants make themselves seem to be servants of righteousness; whose end will be the reward of their works.
- Darby Translation (DBY)
- It is no great thing therefore if his ministers also transform themselves as ministers of righteousness; whose end shall be according to their works.
- Webster's Bible (WBS)
- Therefore [it is] no great thing if his ministers also are transformed as the ministers of righteousness; whose end shall be according to their works.
- Young's Literal Translation (YLT)
- no great thing, then, if also his ministrants do transform themselves as ministrants of righteousness — whose end shall be according to their works.
Read in context
- 13ఏలయనగా అట్టి వారు క్రీస్తుయొక్క అపొస్తలుల వేషము ధరించుకొనువారై యుండి, దొంగ అపొస్తలులును మోసగాండ్రగు పనివారునై యున్నారు.
- 14ఇది ఆశ్చర్యము కాదు; సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు
- 15గనుక వాని పరిచారకులును నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతికాదు. వారి క్రియల చొప్పున వారి కంతము కలుగును.
- 16నేను అవివేకినని యెవడును తలంచవద్దని మరల చెప్పు చున్నాను. అట్లు తలంచినయెడల నేను కొంచెము అతిశయపడునట్లు నన్ను అవివేకినైనట్టు గానే చేర్చు కొనుడి.
- 17నేను చెప్పుచున్నది ప్రభువు మాట ప్రకారము చెప్పుటలేదు గాని ఇట్లు అతిశయపడుటకు ఆధారము కలిగి అవివేకివలె చెప్పుచున్నాను.
Cross references
- Philippians 3:19 ఫిలిప్పీయులకు 3:19నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు; వారు తాము సిగ్గుపడవలసిన సంగతులయందు అతిశయపడుచున్నారు, భూసంబంధమైనవాటి యందే మనస్సు నుంచుచున్నారు.
- 2 Corinthians 3:9 2 కొరింథీయులకు 3:9శిక్షా విధికి కారణమైన పరిచర్యయే మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య యెంతో అధికమైన మహిమ కల దగును.
- Revelation 9:11 ప్రకటన 9:11పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు; హెబ్రీభాషలో వానికి అబద్దోనని పేరు, గ్రీసుదేశపు భాషలో వానిపేరు అపొల్లుయోను.
- Isaiah 9:14–15 యెషయా 9:14–15కావున యెహోవా ఇశ్రాయేలులోనుండి తలను తోకను తాటికమ్మను రెల్లును ఒక్క దినమున కొట్టివేయును. పెద్దలును ఘనులును తల; కల్లలాడు ప్రవక్తలు తోక.
- Jude 1:4 యూదా 1:4ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడియున్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగ పరచుచు, మన అద్వితీయనాధుడును ప్రభువునైన యేసు క్రీస్తును విసర్జించుచున్నారు; ఈ తీర్పుపొందుటకు వారు పూర్వమందే సూచింపబడినవారు.
- Acts 13:10 అపొస్తలుల కార్యములు 13:10అతని తేరిచూచి సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధీ, నీవు ప్రభువు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా?
- 2 Peter 2:13–22 2 పేతురు 2:13–22ఒకనాటి సుఖాను భవము సంతోషమని యెంచుకొందురు. వారు కళంకములును నిందాస్పదములునై తమ ప్రేమవిందులలో మీతోకూడ అన్నపానములు పుచ్చుకొనుచు తమ భోగ ములయందు సుఖించుదురు. వ్యభిచారిణిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును, అస్థిరులైనవారి మనస్సులను మరులుకొల్పుచు లోభిత్వ మందు సాధకముచేయబడిన హృదయముగలవారును, శాప గ్రస్తులునైయుండి, తిన్ననిమార్గమును విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమునుబట్టి త్రోవ తప్పిపోయిరి. ఆ బిలాము దుర్నీతివలన కలుగు బహుమానమును ప్రేమించెను; అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను, ఎట్లనగా నోరులేని గార్దభము మానవస్వరముతో మాటలాడి ఆ ప్రవక్తయొక్క వెఱ్ఱితనము అడ్డగించెను. వీరు నీళ్లులేని బావులును, పెనుగాలికి కొట్టుకొనిపోవు మేఘములునై యున్నారు. వీరికొరకు గాఢాంధకారము భద్రము చేయబడియున్నది. వీరు వ్యర్థమైన డంబపుమాటలు పలుకుచు, తామే శరీరసంబంధమైన దురాశలుగలవారై, తప్పుమార్గమందు నడుచువారిలోనుండి అప్పుడే తప్పించు కొనినవారిని పోకిరిచేష్టలచేత మరలుకొల్పుచున్నారు. తామే భ్రష్టత్వమునకు దాసులైయుండియు, అట్టివారికి స్వాతంత్ర్యము ఇత్తుమని చెప్పుదురు. ఒకడు దేనివలన జయింపబడునో దానికి దాసుడగును గదా వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానముచేత ఈ లోకమాలిన్యములను తప్పించుకొనిన తరువాత మరల వాటిలో చిక్కుబడి వాటిచేత జయింప బడినయెడల, వారి కడవరి స్థితి మొదటి స్థితికంటె మరి చెడ్డదగును. వారు నీతిమార్గమును అనుభవపూర్వకముగా తెలిసి కొని, తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞనుండి తొలగిపోవుటకంటె ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియక యుండుటయే వారికి మేలు. కుక్కతన వాంతికి తిరిగినట్టును, కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్లి నట్టును అను నిజమైన సామితె చొప్పున వీరికి సంభవించెను.
- Matthew 7:15–16 మత్తయి 7:15–16అబద్ధ ప్రవక్తలనుగూర్చి జాగ్రత్తపడుడి. వారు గొఱ్ఱెల చర్మములు వేసికొని మీయొద్దకు వత్తురు కాని లోపల వారు క్రూరమైన తోడేళ్లు. వారి ఫలములవలన మీరు వారిని తెలిసికొందురు. ముండ్లపొదలలో ద్రాక్ష పండ్లనైనను, పల్లేరుచెట్లను అంజూరపు పండ్లనైనను కోయుదురా?
- 2 Peter 2:3 2 పేతురు 2:3వారు అధిక లోభులై, కల్పనావాక్యములు చెప్పుచు, మీవలన లాభము సంపాదించుకొందురు; వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు.
- Jeremiah 23:14–15 యిర్మీయా 23:14–15యెరూషలేము ప్రవక్తలు ఘోరమైన క్రియలు చేయగా నేను చూచితిని, వారు వ్యభిచారులు అసత్య వర్తనులు, ఎవడును తన దుర్మార్గతనుండి మరలక దుర్మార్గుల చేతులను బలపరచుదురు, వారందరు నా దృష్టికి సొదొమ వలెనైరి, దాని నివాసులు గొమొఱ్ఱావలెనైరి. కావున సైన్యములకధిపతియగు యెహోవా ఈ ప్రవక్తలనుగూర్చి సెలవిచ్చునదేమనగా యెరూషలేము ప్రవక్తల అపవిత్రత దేశమంతట వ్యాపించెను గనుక తినుటకు మాచిపత్రియు త్రాగుటకు చేదునీళ్లును నేను వారి కిచ్చుచున్నాను.
- 2 Corinthians 11:23 2 కొరింథీయులకు 11:23వారు క్రీస్తు పరిచారకులా? వెఱ్ఱివానివలె మాటలాడు చున్నాను, నేనును మరి యెక్కువగా క్రీస్తు పరిచారకుడను. మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని; అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేకమారులు ప్రాణాపాయములలో ఉంటిని.
- Galatians 1:8–9 గలతీయులకు 1:8–9మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరియొక సువార్తను మేమైనను పరలోకమునుండి వచ్చిన యొక దూతయైనను మీకు ప్రకటించినయెడల అతడు శాపగ్రస్తుడవును గాక. మేమిది వరకు చెప్పిన ప్రకారమిప్పుడును మరల చెప్పుచున్నాము; మీరు అంగీకరించిన సువార్త గాక మరియొకటి యెవడైనను మీకు ప్రకటించిన యెడల వాడు శాపగ్రస్తుడవును గాక.
Original words (Greek)
- Therefore · G3767οὖν oûn
- no · G3756οὐ ou
- thing · G3173μέγας mégas
- if · G1487εἰ ei
- his · G846αὐτός autós
- ministers · G1249διάκονος diákonos
- also · G2532καί kaí
- transformed · G3345μετασχηματίζω metaschēmatízō
- as · G5613ὡς hōs
- ministers · G1249διάκονος diákonos
- righteousness · G1343δικαιοσύνη dikaiosýnē
- whose · G3739ὅς hós
- end · G5056τέλος télos
- be · G2071ἔσομαι ésomai
- to · G2596κατά katá
- their · G846αὐτός autós
- works · G2041ἔργον érgon