Deuteronomy · chapter 28 · verse 43
Deuteronomy 28:43 in Telugu
నీ మధ్యనున్న పరదేశి నీ కంటె మిక్కిలి హెచ్చగును నీవు మిక్కిలి తగ్గిపోదువు.
Nee madhyanunna paradeshi nee kante mikkili hechchagunu neevu mikkili taggipoduvu.
Deuteronomy 28:43 in English
- King James Version (KJV)
- The stranger that [is] within thee shall get up above thee very high; and thou shalt come down very low.
- World English Bible (WEB)
- The foreigner who is among you will mount up above you higher and higher, and you will come down lower and lower.
- American Standard Version (ASV)
- The sojourner that is in the midst of thee shall mount up above thee higher and higher; and thou shalt come down lower and lower.
- Bible in Basic English (BBE)
- The man from a strange land who is living among you will be lifted up higher and higher over you, while you go down lower and lower.
- Darby Translation (DBY)
- The sojourner that is in thy midst shall rise above thee higher and higher, and thou shalt sink down lower and lower.
- Webster's Bible (WBS)
- The stranger that [is] within thee shall rise above thee very high; and thou shalt come down very low.
- Young's Literal Translation (YLT)
- the sojourner who [is] in thy midst goeth up above thee very high, and thou goest down very low;
Read in context
- 41కుమా రులను కుమార్తెలను కందువుగాని వారు నీయొద్ద నుండరు, వారు చెరపట్ట బడుదురు.
- 42మిడతల దండు నీ చెట్లన్నిటిని నీ భూమి పంటను ఆక్రమించుకొనును.
- 43నీ మధ్యనున్న పరదేశి నీ కంటె మిక్కిలి హెచ్చగును నీవు మిక్కిలి తగ్గిపోదువు.
- 44అతడు నీకు అప్పిచ్చునుగాని నీవు అతనికి అప్పియ్యలేవు. అతడు తలగానుండును నీవు తోకగా నుందువు.
- 45నీవు నాశనము చేయబడువరకు ఈ శాపము లన్నియు నీమీదికి వచ్చి నిన్ను తరిమి నిన్ను పట్టు కొనును; ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీకాజ్ఞా పించిన ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనునట్లు నీవు ఆయన మాట వినలేదు.
Cross references
- Deuteronomy 28:13 ద్వితీయోపదేశకాండము 28:13నేడు నేను మీకా జ్ఞాపించు మాటలన్నిటిలో దేనివిషయములోను కుడికి గాని యెడమకుగాని తొలగి
- 1 Samuel 13:19–23 1 సమూయేలు 13:19–23హెబ్రీయులు కత్తులను ఈటెలను చేయించుకొందు రేమో అని ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల దేశమందంతట కమ్మరవాండ్రు లేకుండచేసియుండిరి. కాబట్టి ఇశ్రా యేలీయులందరు తమ నక్కులను పారలను గొడ్డండ్రను పోటకత్తులను పదును చేయించుటకై ఫిలిష్తీయులదగ్గరకు పోవలసి వచ్చెను. అయితే నక్కులకును పారలకును మూడు ముండ్లుగల కొంకులకును గొడ్డండ్రకును మునుకోల కఱ్ఱలు సరిచేయుటకును ఆకు రాళ్లుమాత్రము వారియొద్ద నుండెను. కాబట్టి యుద్ధదినమందు సౌలునొద్దను యోనా తాను నొద్దను ఉన్నజనులలోఒకని చేతిలోనైనను కత్తియే గాని యీటెయేగాని లేకపోయెను, సౌలునకును అతని కుమారుడైన యోనాతానునకును మాత్రము అవి యుండెను. ఫిలిష్తీయుల దండు కావలివారు కొందరు మిక్మషు కనుమకు వచ్చిరి.
- John 19:15 యోహాను 19:15అందుకు వారు ఇతనిని సంహ రించుము, సంహరించుము, సిలువవేయుము అని కేకలు వేసిరి. పిలాతుమీ రాజును సిలువవేయుదునా? అని వారిని అడుగగా ప్రధానయాజకులుకైసరు తప్ప మాకు వేరొక రాజు లేడనిరి.
- 2 Kings 24:14–16 2 రాజులు 24:14–16అదియుగాక అతడు దేశపు జనులలో అతి బీదలైనవారు తప్ప మరి ఎవరును లేకుండ యెరూషలేము పట్టణమంతటిలోనున్న అధిపతులను పరాక్రమశాలులను పదివేలమందిని, వీరు గాక కంసాలివారిని కమ్మరివారిని చెరతీసికొని పోయెను. అతడు యెహోయాకీనును రాజు తల్లిని రాజు భార్యలను అతని పరివారమును దేశములోని గొప్పవారిని చెరపట్టి యెరూషలేమునుండి బబులోను పురమునకు తీసికొనిపోయెను. ఏడు వేలమంది పరాక్రమ శాలులను వెయ్యిమంది కంసాలివారిని కమ్మరివారిని యుద్ధ మందు తేరిన శక్తిమంతులనందరిని బబులోనురాజు చెరపట్టి బబులోనుపురమునకు తీసికొనివచ్చెను.
- Judges 10:7–10 న్యాయాధిపతులు 10:7–10యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద మండగా ఆయన ఫిలిష్తీయుల చేతికిని అమ్మోనీయుల చేతికిని వారినప్పగించెను గనుక వారు ఆ సంవత్సరము మొదలుకొని ఇశ్రాయేలీయులను, అనగా యొర్దాను అవతల నున్న గిలాదునందలి అమోరీయుల దేశములో కాపుర మున్న ఇశ్రాయేలీయులను పదునెనిమిది సంవత్సరములు చితుకగొట్టి అణచివేసిరి. మరియు అమ్మోనీయులు యూదాదేశస్థులతోను బెన్యామీనీయులతోను ఎఫ్రాయి మీయులతోను యుద్ధముచేయుటకు యొర్దానును దాటిరి గనుక ఇశ్రాయేలీయులకు మిక్కిలి శ్రమ కలిగెను అప్పుడు ఇశ్రాయేలీయులుమేము నీ సన్నిధిని పాపము చేసియున్నాము, మా దేవుని విడిచి బయలులను పూజించి యున్నామని యెహోవాకు మొఱ్ఱపెట్టగా
- Judges 15:11–12 న్యాయాధిపతులు 15:11–12అందుకు యూదా జనులలో మూడువేలమంది ఏతాములోని బండ యొద్దకు పోయి సమ్సోనును చూచిఫిలిష్తీయులు మనకు ఏలికలని నీకు తెలియదా? నీవు మాకేమి చేసితివని చెప్పగా అతడువారు నాకెట్లు చేసిరో అట్లే నేను వారికి చేసితి ననెను. అందుకు వారుమేము ఫిలిష్తీయుల చేతికి అప్ప గించుటకు నిన్ను కట్టవచ్చితిమని అతనితో అనగా సమ్సోనుమీరు నామీద పడకుండునట్లు నాతో ప్రమాణము చేయుడనెను.
- Judges 4:2–3 న్యాయాధిపతులు 4:2–3యెహోవా హాసోరులో ఏలు కనాను రాజైన యాబీనుచేతికి వారిని అప్పగించెను. అతని సేనాధిపతి అన్యుల హరోషెతులో నివసించిన సీసెరా. అతనికి తొమ్మిదివందల ఇనుపరథము లుండెను. అతడు ఇరువది సంవత్సరములు ఇశ్రాయేలీయు లను కఠినమైన బాధపెట్టగా ఇశ్రాయేలీయులు యెహోవాకు మొఱ్ఱపెట్టిరి.
- 2 Kings 17:23 2 రాజులు 17:23తన సేవకులైన ప్రవక్తలద్వారా యెహోవా సెల విచ్చిన మాటచొప్పున, ఆయన ఇశ్రాయేలువారిని తన సముఖములోనుండి వెళ్లగొట్టెను. ఆ హేతువుచేత వారు తమ స్వదేశములోనుండి అష్షూరు దేశ ములోనికి చెరగొని పోబడిరి; నేటివరకు వారచ్చట ఉన్నారు.
- Judges 2:3 న్యాయాధిపతులు 2:3మీరు చేసినపని యెట్టిది? కావున నేనుమీ యెదుటనుండి ఈ దేశనివాసులను వెళ్లగొట్టను, వారు మీ ప్రక్కలకు శూలములుగా నుందురు, వారి దేవతలు మీకు ఉరిగా నుందురని చెప్పుచున్నాను.
- 2 Kings 17:20 2 రాజులు 17:20అంతట యెహోవా ఇశ్రాయేలువారి సంతతివారినందరిని విసర్జించి, వారిని శ్రమపెట్టి దోపుడుగాండ్ల చేతికప్పగించి, వారిని తన సముఖమునుండి వెళ్లగొట్టెను.
- John 18:31 యోహాను 18:31పిలాతు మీరతని తీసికొనిపోయి మీ ధర్మశాస్త్రముచొప్పున అతనికి తీర్పుతీర్చుడనగా
- Judges 2:11–15 న్యాయాధిపతులు 2:11–15ఇశ్రాయేలీయులు యెహోవా కన్నులయెదుట కీడుచేసి, ఐగుప్తుదేశములోనుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలు దేవతలను పూజించి తమ చుట్టునుండు జనుల దేవతలలో ఇతరదేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహో వాకు కోపము పుట్టించిరి. వారు యెహోవాను విసర్జించి బయలును అష్తారోతును పూజించిరి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయులమీద మండెను; ఆయన దోచు కొనువారిచేతికి వారిని అప్పగించెను. వారు ఇశ్రాయేలీ యులను దోచుకొనిరి; ఆయన వారి చుట్టునున్నవారి శత్రువులచేతికి వారిని అప్పగించెను గనుక వారు తమ శత్రువుల యెదుట నిలువలేకపోయిరి. యెహోవా వారితో చెప్పినట్లు, యెహోవా వారితో ప్రమాణము చేసినట్లు, వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగజేయుటకు యెహోవా వారికి శత్రువాయెను గనుక వారికి మిక్కిలి యిబ్బంది కలిగెను.