Esther · chapter 10 · verse 1
Esther 10:1 in Telugu
రాజైన అహష్వేరోషు రాజ్యమును సముద్రద్వీపములును పన్ను చెల్లింప నిర్ణయించెను.
Raajaina ahashveroshu raajyamunu samudradveepamulunu pannu chellimpa nirnayinchenu.
Esther 10:1 in English
- King James Version (KJV)
- And the king Ahasuerus laid a tribute upon the land, and [upon] the isles of the sea.
- World English Bible (WEB)
- King Ahasuerus laid a tribute on the land and on the islands of the sea.
- American Standard Version (ASV)
- And the king Ahasuerus laid a tribute upon the land, and upon the isles of the sea.
- Bible in Basic English (BBE)
- And King Ahasuerus put a tax on the land and on the islands of the sea.
- Darby Translation (DBY)
- And king Ahasuerus laid a tribute upon the land and the isles of the sea.
- Webster's Bible (WBS)
- And the king Ahasuerus laid a tribute upon the land, and [upon] the isles of the sea.
- Young's Literal Translation (YLT)
- And the king Ahasuerus setteth a tribute on the land and the isles of the sea;
Read in context
- 1రాజైన అహష్వేరోషు రాజ్యమును సముద్రద్వీపములును పన్ను చెల్లింప నిర్ణయించెను.
- 2మొర్దెకై యొక్క బలమును గూర్చియు, అతడు సామర్థ్యముచేత చేసిన కార్యములన్నిటిని గూర్చియు, రాజు అతనిని ఘన పరచిన సంగతిని గూర్చియు మాదీయులయొక్కయు పారసీకులయొక్కయు రాజ్యసమాచార గ్రంథమందు వ్రాయబడియున్నది.
- 3యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగానుండి, తనవారందరితో సమాధానముగా మాటలాడుచు, తన జనులయొక్కక్షేమమును విచారించువాడును యూదులలో గొప్ప వాడునై తన దేశస్థులలో చాలామందికి ఇష్టుడుగా ఉండెను.
Cross references
- Isaiah 24:15 యెషయా 24:15అందునుబట్టి తూర్పుదిశనున్నవారలారా, యెహో వాను ఘనపరచుడి సముద్ర ద్వీపవాసులారా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామమును ఘనపరచుడి.
- Psalm 72:10 కీర్తనలు 72:10తర్షీషు రాజులు ద్వీపముల రాజులు కప్పము చెల్లించెదరు షేబరాజులును సెబారాజులును కానుకలు తీసికొని వచ్చెదరు.
- Daniel 11:18 దానియేలు 11:18అతడు ద్వీపముల జనములతట్టు తన మనస్సును త్రిప్పుకొని యనేకులను పట్టుకొనును. అయితే అతనివలన కలిగిన యవమానమును ఒక యధికారి నివారణ చేయును. మరియు ఆయన యవమానము అతనిమీదికి మరల వచ్చునట్లు చేయును, అది అతనికి రాక తప్పదు.
- Esther 1:1 ఎస్తేరు 1:1అహష్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరము; హిందూదేశము మొదలుకొని కూషు దేశమువరకు నూట ఇరువది యేడు సంస్థానములను అహష్వేరోషు ఏలెను.
- Isaiah 11:11 యెషయా 11:11ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును అష్షూరులోనుండియు ఐగుప్తులోనుండియు పత్రోసులోనుండియు కూషులోనుండియు ఏలాములోనుండియు షీనారులోనుండియు హమాతులో నుండియు సముద్రద్వీపములలోనుండియు విడిపించి రప్పించుటకు యెహోవా రెండవమారు తన చెయ్యి చాచును
- Luke 2:1 లూకా 2:1ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలెనని కైసరు ఔగుస్తువలన ఆజ్ఞ ఆయెను.
- Esther 8:9 ఎస్తేరు 8:9సీవాను అను మూడవ నెలలో ఇరువది మూడవ దిన మందు రాజుయొక్క వ్రాతగాండ్రు పిలువబడిరి; మొర్దెకై ఆజ్ఞాపించిన ప్రకారమంతయు యూదులకును, హిందూ దేశము మొదలుకొని కూషుదేశమువరకు వ్యాపించియున్న నూట ఇరువది యేడు సంస్థానములలోనున్న అధిపతులకును అధికారులకును, ఆయా సంస్థానములకును దాని దాని వ్రాతనుబట్టియు దాని దాని భాషనుబట్టియు తాకీదులు వ్రాయబడెను.
- Genesis 10:5 ఆదికాండము 10:5వీరినుండి సముద్ర తీరమందుండిన జనములు వ్యాపించెను. వారివారి జాతుల ప్రకారము, వారివారి భాషలప్రకారము, వారివారి వంశముల ప్రకారము, ఆయా దేశములలో వారు వేరైపోయిరి.