Galatians · chapter 1 · verse 19
Galatians 1:19 in Telugu
అతనిని తప్ప అపొస్తలులలో మరి ఎవనిని నేను చూడలేదు గాని, ప్రభువుయొక్క సహోదరుడైన యాకోబును మాత్రము చూచితిని.
Atanini tappa apostalulalo mari evanini nenu choodaledu gaani, prabhuvuyokka sahodarudaina yaakobunu maatramu choochitini.
Galatians 1:19 in English
- King James Version (KJV)
- But other of the apostles saw I none, save James the Lord’s brother.
- World English Bible (WEB)
- But of the other apostles I saw no one except James, the Lord’s brother.
- American Standard Version (ASV)
- But other of the apostles saw I none, save James the Lord’s brother.
- Bible in Basic English (BBE)
- But of the other Apostles I saw only James, the Lord's brother.
- Darby Translation (DBY)
- but I saw none other of the apostles, but James the brother of the Lord.
- Webster's Bible (WBS)
- But I saw no other of the apostles, save James the Lord's brother.
- Young's Literal Translation (YLT)
- and other of the apostles I did not see, except James, the brother of the Lord.
Read in context
- 17నాకంటె ముందుగా అపొస్తలులైన వారియొద్దకు యెరూషలేమునకైనను వెళ్లనులేదు గాని వెంటనే అరేబియా దేశములోనికి వెళ్లితిని;పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చితిని.
- 18అటుపైని మూడు సంవత్సరములైన తరువాత కేఫాను పరిచయము చేసికొనవలెనని యెరూషలేమునకు వచ్చి అతనితోకూడ పదునయిదు దినములుంటిని.
- 19అతనిని తప్ప అపొస్తలులలో మరి ఎవనిని నేను చూడలేదు గాని, ప్రభువుయొక్క సహోదరుడైన యాకోబును మాత్రము చూచితిని.
- 20నేను మీకు వ్రాయుచున్న యీ సంగతుల విషయమై, యిదిగో దేవుని యెదుట నేను అబద్ధమాడుట లేదు.
- 21పిమ్మట సిరియ, కిలికియ ప్రాంతములలోనికి వచ్చి తిని.
Cross references
- Matthew 13:55 మత్తయి 13:55ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లిపేరు మరియ కాదా? యాకోబు యోసేపు సీమోను యూదాయనువారు ఇతని సోదరులు కారా?
- Mark 6:3 మార్కు 6:3ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అనువారి సహోదరుడగు వడ్లవాడు కాడా? ఇతని సోదరీమణులందరు మనతో నున్నారు కారా? అని చెప్పు కొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిరి.
- Matthew 12:46 మత్తయి 12:46ఆయన జనసమూహములతో ఇంక మాటలాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులును ఆయనతో మాటలాడ గోరుచు వెలుపల నిలిచియుండిరి.
- Matthew 10:3 మత్తయి 10:3ఫిలిప్పు, బర్తొలొమయి; తోమా, సుంకరియైన మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దయియను మారుపేరుగల లెబ్బయి;
- 1 Corinthians 9:5 1 కొరింథీయులకు 9:5తక్కిన అపొస్తలులవలెను, ప్రభువుయొక్క సహోదరులవలెను, కేఫావలెను విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకొని తిరుగుటకు మాకు అధికారములేదా?
- Acts 12:17 అపొస్తలుల కార్యములు 12:17అతడు ఊరకుండుడని వారికి చేసైగచేసి, ప్రభువు తన్ను చెరసాలలోనుండి యేలాగు తీసికొనివచ్చెనో వారికి వివరించి యాకోబుకును సహోదరులకును ఈ సంగతులు తెలియజేయుడని చెప్పి బయలుదేరి వేరొక చోటికి వెళ్ళెను.
- Mark 3:18 మార్కు 3:18అంద్రెయ, ఫిలిప్పు, బర్తొలొమయి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దయి, కనానీయుడైన సీమోను,
- James 1:1 యాకోబు 1:1దేవునియొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్యదేశములయందు చెదిరియున్న పండ్రెండు గోత్రములవారికి శుభమని చెప్పి వ్రాయునది.
- Luke 6:15 లూకా 6:15మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడైన యాకోబు, జెలోతే అనబడిన సీమోను,
- Jude 1:1 యూదా 1:1యేసుక్రీస్తు దాసుడును, యాకోబు సహోదరుడునైన యూదా, తండ్రియైన దేవునియందు ప్రేమింపబడి, యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడినవారికి శుభమని చెప్పి వ్రాయునది.
- Acts 1:13 అపొస్తలుల కార్యములు 1:13వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తొలొమయి, మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యూదా అను వారు.