Genesis · chapter 31 · verse 44
Genesis 31:44 in Telugu
కావున నేనును నీవును నిబంధన చేసికొందము రమ్ము, అది నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని యాకోబుతో ఉత్తరమియ్యగా
Kaavuna nenunu neevunu nibandhana chesikondamu rammu, adi naakunu neekunu madhya saakshigaa undunani yaakobuto uttaramiyyagaa
Genesis 31:44 in English
- King James Version (KJV)
- Now therefore come thou, let us make a covenant, I and thou; and let it be for a witness between me and thee.
- World English Bible (WEB)
- Now come, let’s make a covenant, you and I. Let it be for a witness between me and you.”
- American Standard Version (ASV)
- And now come, let us make a covenant, I and thou; and let it be for a witness between me and thee.
- Bible in Basic English (BBE)
- Come, let us make an agreement, you and I; and let it be for a witness between us.
- Darby Translation (DBY)
- And now, come, let us make a covenant, I and thou; and let it be a witness between me and thee.
- Webster's Bible (WBS)
- Now therefore come thou, let us make a covenant, I and thou; and let it be for a witness between me and thee.
- Young's Literal Translation (YLT)
- and now, come, let us make a covenant, I and thou, and it hath been for a witness between me and thee.'
Read in context
- 42నా తండ్రి దేవుడు, అబ్రాహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడైయుండనియెడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి యుందువు. దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి, పోయిన రాత్రి నిన్ను గద్దించెనని లాబానుతో చెప్పెను.
- 43అందుకు లాబాను ఈ కుమార్తెలు నా కుమార్తెలు, ఈ కుమారులు నా కుమారులు, ఈ మంద నా మంద, నీకు కనబడుచున్నది అంతయు నాది, ఈ నా కుమార్తెలనైనను వీరు కనిన కుమారుల నైనను నేనేమి చేయగలను.
- 44కావున నేనును నీవును నిబంధన చేసికొందము రమ్ము, అది నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని యాకోబుతో ఉత్తరమియ్యగా
- 45యాకోబు ఒక రాయి తీసికొని దానిని స్తంభముగా నిలువబెట్టెను.
- 46మరియు యాకోబు రాళ్లు కూర్చుడని తన బంధువులతో చెప్పెను. వారు రాళ్లు తెచ్చి కుప్ప వేసిరి; అక్కడ వారు ఆ కుప్ప యొద్ద భోజనము చేసిరి.
Cross references
- Joshua 24:25–27 యెహోషువ 24:25–27అట్లు యెహోషువ ఆ దినమున ప్రజలతో నిబంధన చేసి వారికి షెకెములో కట్టడను విధిని నియమించి దేవుని ధర్మశాస్త్రగ్రంథములో ఆ వాక్యములను వ్రాయించి పెద్ద రాతిని తెప్పించి యెహోవా పరిశుద్ధస్థలములో నున్న సిందూర వృక్షముక్రింద దాని నిలువబెట్టి జను లందరితో ఇట్లనెనుఆలోచించుడి, యెహోవా మనతో చెప్పిన మాటలన్నియు ఈ రాతికి వినబడెను గనుక అది మనమీద సాక్షిగా ఉండును. మీరు మీ దేవుని విసర్జించిన యెడల అది మీమీద సాక్షిగా ఉండును.
- 1 Samuel 20:14–17 1 సమూయేలు 20:14–17అయితే నేను బ్రదికియుండినయెడల నేను చావకుండ యెహోవా దయచూపునట్లుగా నీవు నాకు దయచూపక పోయిన యెడలనేమి, నేను చనిపోయినయెడల యెహోవా దావీదు శత్రువులను ఒకడైన భూమిమీద నిలువకుండ నిర్మూలము చేసిన తరువాత నీవు నా సంతతివారికి దయ చూపక పోయిన యెడలనేమి యెహోవా నిన్ను విసర్జించును గాక. ఈలాగున యెహోవా దావీదుయొక్క శత్రువుల చేత దాని విచారించునట్లుగా యోనాతాను దావీదు సంతతివారిని బట్టి నిబంధన చేసెను. యోనాతాను దావీదును తన ప్రాణస్నేహితునిగా ప్రేమించెను గనుక ఆ ప్రేమనుబట్టి దావీదుచేత మరల ప్రమాణము చేయించెను.
- Deuteronomy 31:21 ద్వితీయోపదేశకాండము 31:21విస్తారమైన కీడులు ఆపదలు వారికి సంభవించిన తరువాత ఈ కీర్తన వారియెదుట సాక్షిగానుండి సాక్ష్యము పలు కును. అది మరువబడక వారి సంతతి వారినోట నుండును. నేను ప్రమాణము చేసిన దేశమున వారిని ప్రవేశపెట్టక మునుపే, నేడే వారు చేయు ఆలోచన నేనెరుగుదును అనెను.
- Genesis 26:28–31 ఆదికాండము 26:28–31వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడైయుండుట చూచితివిు గనుక మనకు, అనగా మాకును నీకును మధ్య నొక ప్రమాణముండవలె ననియు మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమియు చేయక నిన్ను సమాధానముగా పంపి వేసితివిు గనుక నీవును మాకు కీడు చేయకుండునట్లు నీతో నిబంధన చేసికొందుమనియు అనుకొంటిమి; ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందిన వాడవనిరి. అతడు వారికి విందుచేయగా వారు అన్నపానములు పుచ్చుకొనిరి. తెల్లవారినప్పుడు వారు లేచి ఒకనితో ఒకడు ప్రమాణము చేసికొనిరి; తరువాత ఇస్సాకు వారిని సాగనంపగా వారు అతని యొద్దనుండి సమాధానముగా వెళ్లిరి.
- Joshua 22:27 యెహోషువ 22:27మన దహనబలుల విషయములోను బలుల విషయములోను సమాధానబలుల విషయములోను మనము యెహోవా సన్నిధిని ఆయన సేవచేయవలయు ననుటకుయెహోవాయందు మీకు పాలు ఏదియు లేదను మాట మీ సంతతివారు మా సంతతివారికి చెప్పజాలకుండు నట్లు అది మాకును మీకును మన తరువాత మన మన తరములవారికిని మధ్య సాక్షియైయుండును.
- Genesis 31:48 ఆదికాండము 31:48లాబాను నేడు ఈ కుప్ప నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని చెప్పెను. కాబట్టి దానికి గలేదను పేరుపెట్టెను. మరియు మనము ఒకరికొకరము దూరముగా నుండగా యెహోవా నాకును నీకును మధ్య జరుగునది కనిపెట్టునని చెప్పెను గనుక దానికి మిస్పా అను పేరు పెట్టబడెను.
- Deuteronomy 31:19 ద్వితీయోపదేశకాండము 31:19కాబట్టి మీరు కీర్తన వ్రాసి ఇశ్రాయేలీయులకు నేర్పుడి. ఈ కీర్తన ఇశ్రాయేలీయుల మీద నాకు సాక్ష్యార్థముగా నుండునట్లు దానిని వారికి కంఠపాఠముగా చేయించుము.
- Deuteronomy 31:26 ద్వితీయోపదేశకాండము 31:26అది అక్కడ నీమీద సాక్ష్యార్థముగా ఉండును.
- Genesis 21:22–32 ఆదికాండము 21:22–32ఆ కాలమందు అబీమెలెకును అతని సేనాధిపతియైన ఫీకోలును అబ్రాహాముతో మాటలాడినీవు చేయు పనులన్నిటిలోను దేవుడు నీకు తోడైయున్నాడు గనుక. నీవు నన్నైనను నా పుత్ర పౌత్రాదులనైనను వంచింపక, నేను నీకు చేసిన ఉపకారము చొప్పున నాకును నీవు పరదేశివైయున్న యీ దేశమునకు చేసెదనని దేవుని పేరట ఇక్కడ నాతో ప్రమాణము చేయుమని చెప్పెను. అందుకు అబ్రాహాము ప్రమాణము చేసెదననెను. అబీమెలెకు దాసులు బలాత్కారముగా తీసికొనిన నీళ్ల బావివిషయమై అబ్రాహాము అబీమెలెకును ఆక్షేపింపగా అబీమెలెకు ఈ పని యెవరు చేసిరో నేనెరుగను; నీవును నాతో చెప్పలేదు; నేను నేడే గాని యీ సంగతి వినలేదని చెప్పగా. అబ్రాహాము గొఱ్ఱెలను గొడ్లను తెప్పించి అబీమెలెకుకిచ్చెను. వారిద్దరు ఇట్లు ఒక నిబంధన చేసికొనిరి. తరువాత అబ్రాహాము తన గొఱ్ఱెల మందలో నుండి యేడు పెంటి పిల్లలను వేరుగా నుంచెను గనుక అబీమెలెకు అబ్రాహాముతో నీవు వేరుగా ఉంచిన యీ యేడు గొఱ్ఱెపిల్లలు ఎందుకని యడిగెను. అందుకతడు నేనే యీ బావిని త్రవ్వించినందుకు నా సాక్ష్యార్థముగా ఈ యేడు గొఱ్ఱె పిల్లలను నీవు నాచేత పుచ్చుకొనవలెనని చెప్పెను. అక్కడ వారిద్దరు అట్లు ప్రమాణము చేసికొనినందున ఆ చోటు బెయేర్షెబా అనబడెను. బెయేర్షెబాలో వారు ఆలాగు ఒక నిబంధన చేసికొనిన తరువాత అబీమెలెకు లేచి తన సేనాధిపతియైన ఫీకోలుతో ఫిలిష్తీయుల దేశమునకు తిరిగి వెళ్లెను.
- Genesis 31:52 ఆదికాండము 31:52హానిచేయవలెనని నేను ఈ కుప్ప దాటి నీ యొద్దకు రాకను, నీవు ఈ కుప్పను ఈ స్తంభమును దాటి నా యొద్దకు రాకను ఉండుటకు ఈ కుప్ప సాక్షి యీ స్తంభమును సాక్షి.
- Genesis 15:18 ఆదికాండము 15:18ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నదియైన యూఫ్రటీసు నదివరకు ఈ దేశమును, అనగా