Genesis · chapter 44 · verse 7
Genesis 44:7 in Telugu
వారు మా ప్రభువు ఇట్లు మాటలాడనేల? ఇట్టి పని చేయుట నీ దాసులకు దూరమవును గాక.
Vaaru maa prabhuvu itlu maatalaadanela? Itti pani cheyuta nee daasulaku dooramavunu gaaka.
Genesis 44:7 in English
- King James Version (KJV)
- And they said unto him, Wherefore saith my lord these words? God forbid that thy servants should do according to this thing:
- World English Bible (WEB)
- They said to him, “Why does my lord speak such words as these? Far be it from your servants that they should do such a thing!
- American Standard Version (ASV)
- And they said unto him, Wherefore speaketh my lord such words as these? Far be it from thy servants that they should do such a thing.
- Bible in Basic English (BBE)
- And they said to him, Why does my lord say such words as these? far be it from your servants to do such a thing:
- Darby Translation (DBY)
- And they said to him, Why does my lord speak such words as these? Far be it from thy servants to do such a thing!
- Webster's Bible (WBS)
- And they said to him, Why saith my lord these words? Far be it from us that thy servants should do according to this thing:
- Young's Literal Translation (YLT)
- and they say unto him, 'Why doth my lord speak according to these words? far be it from thy servants to do according to this word;
Read in context
- 5దేనితో నా ప్రభువు పానము చేయునో దేనివలన అతడు శకునములు చూచునో అది యిదే కదా? మీరు దీని చేయుటవలన కాని పని చేసితిరని వారితో చెప్పుమనెను.
- 6అతడు వారిని కలిసికొని ఆ మాటలు వారితో చెప్పినప్పుడు
- 7వారు మా ప్రభువు ఇట్లు మాటలాడనేల? ఇట్టి పని చేయుట నీ దాసులకు దూరమవును గాక.
- 8ఇదిగో మా గోనెలమూతులలో మాకు దొరికిన రూకలను కనాను దేశములోనుండి తిరిగి తీసికొనివచ్చితివిు; నీ ప్రభువు ఇంటిలోనుండి మేము వెండినైనను బంగారము నైనను ఎట్లు దొంగిలుదుము?
- 9నీ దాసులలో ఎవరియొద్ద అది దొరుకునో వాడు చచ్చును గాక; మరియు మేము మా ప్రభువునకు దాసులముగా నుందుమని అతనితో అనిరి.
Cross references
- Genesis 38:16–18 ఆదికాండము 38:16–18ఆ మార్గమున ఆమె దగ్గరకు బోయి, ఆమె తన కోడలని తెలియక - నీతో పోయెదను రమ్మని చెప్పెను. అందుకామె - నీవు నాతో వచ్చినయెడల నా కేమి యిచ్చెదవని అడిగెను. అందుకతడు - నేను మందలోనుండి మేక పిల్లను పంపెదనని చెప్పినప్పుడు ఆమె అది పంపువరకు ఏమైన కుదువ పెట్టినయెడల సరే అని చెప్పెను. అతడు - నేను నీయొద్ద ఏమి కుదువ పెట్టవలెనని అడిగినప్పుడు ఆమె - నీ ముద్రయు దాని దారమును నీ చేతి కఱ్ఱయునని చెప్పెను. అతడు వాటిని ఆమెకిచ్చి ఆమెతో పోయెను; ఆమె అతనివలన గర్భవతి
- Genesis 35:22 ఆదికాండము 35:22ఇశ్రాయేలు ఆ దేశములో నివసించుచున్నప్పుడు రూబేను వెళ్లి తన తండ్రి ఉపపత్నియైన బిల్హాతో శయనించెను; ఆ సంగతి ఇశ్రాయేలునకు వినబడెను.
- Ecclesiastes 7:1 ప్రసంగి 7:1సుగంధతైలముకంటె మంచి పేరు మేలు; ఒకని జన్మ దినముకంటె మరణదినమే మేలు.
- Joshua 22:22–29 యెహోషువ 22:22–29దేవుళ్లలో యెహోవా దేవుడు, దేవుళ్లలో యెహోవాయే దేవుడు; సంగతి ఆయనకు తెలి యును, ఇశ్రాయేలీయులు తెలిసి కొందురు, ద్రోహము చేతనైనను యెహోవామీద తిరుగు బాటుచేతనైనను మేము ఈ పని చేసినయెడల నేడు మమ్ము బ్రదుకనియ్యకుడి. యెహోవాను అనుసరింపక తొలగిపోయి, దహనబలినైనను నైవేద్య మునైనను దానిమీద అర్పించుటకే గాని సమా ధాన బలులను దానిమీద అర్పించుటకే గాని మేము ఈ బలిపీఠమును కట్టినయెడల యెహోవా తానే విమర్శ చేయునుగాక. వేరొక హేతువుచేతనే ఈ బలిపీఠమును కట్టితివిు. ఏమనగా రాబోవుకాలమున మీ సంతానపు వారు మా సంతానపువారితోఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాతో మీకేమి సంబంధము? రూబేనీయులారా గాదీయులారా, మీకును మాకును మధ్య యెహోవా యొర్దానును సరిహద్దుగా నియమించెను గదా యెహోవా యందు మీకు పాలేదియు లేదని చెప్పుటవలన మీ సంతా నపువారు మా సంతానపువా రిని యెహోవా విషయములో భయభక్తులులేని వార గునట్లు చేయుదురేమో అని భయపడి ఆ హేతువు చేతనే దీని చేసితివిు. కాబట్టి మేముమనము బలిపీఠమును కట్టుటకు సిద్ధపరచుదము రండని చెప్పు కొంటిమి; అది దహనబలుల నర్పించుటకైనను బలి నర్పిం చుటకైనను కాదు. మన దహనబలుల విషయములోను బలుల విషయములోను సమాధానబలుల విషయములోను మనము యెహోవా సన్నిధిని ఆయన సేవచేయవలయు ననుటకుయెహోవాయందు మీకు పాలు ఏదియు లేదను మాట మీ సంతతివారు మా సంతతివారికి చెప్పజాలకుండు నట్లు అది మాకును మీకును మన తరువాత మన మన తరములవారికిని మధ్య సాక్షియైయుండును. అందుకు మేముఇకమీదట వారు మాతోనే గాని మా తరముల వారితోనే గాని అట్లు చెప్పినయెడల మేముమన పిత రులు చేసిన బలిపీఠపు ఆకారమును చూడుడి; యిది దహనబలి నర్పించుటకు కాదు బలి నర్పించుటకు కాదుగాని, మాకును మీకును మధ్యసాక్షియై యుండుటకే యని చెప్పుదమని అనుకొంటిమి. ఆయన మందిరము నెదుట నున్న మన దేవుడైన యెహోవా బలిపీఠము తప్ప దహన బలులకైనను నైవేద్యములకైనను బలులకైనను వేరొక బలి పీఠమును కట్టునట్లు నేడు యెహోవాను అనుసరింపక తొలగి పోయినయెడల నేమి యెహోవామీద ద్రోహము చేసినయెడల నేమి మేము శాపగ్రస్తులమగుదుము గాక.
- Genesis 34:25–31 ఆదికాండము 34:25–31మూడవ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారులలో నిద్దరు, అనగా దీనా సహోదరులైన షిమ్యోనును లేవియు, తమ కత్తులు చేతపట్టుకొని యెవరికి తెలియకుండ ఆ ఊరిమీద పడి ప్రతి పురుషుని చంపిరి. వారు హమోరును అతని కుమారుడైన షెకెమును కత్తివాత చంపి షెకెము ఇంటనుండి దీనాను తీసికొని వెళ్లిపోయిరి తమ సహోదరిని చెరిపినందున యాకోబు కుమారులు చంపబడినవారు ఉన్నచోటికి వచ్చి ఆ ఊరు దోచుకొని వారి గొఱ్ఱెలను పశువులను గాడిదలను ఊరిలోని దేమి పొలములోని దేమి వారి ధనము యావత్తును తీసికొని, వారి పిల్లలనందరిని వారి స్త్రీలను చెరపట్టి, యిండ్లలోనున్న దంతయు దోచుకొనిరి. అప్పుడు యాకోబు షిమ్యోనును లేవీని చూచి మీరు నన్ను బాధపెట్టి యీ దేశ నివాసులైన కనానీయులలోను పెరిజ్జీయులలోను అసహ్యునిగా చేసితిరి; నా జనసంఖ్య కొంచెమే; వారు నామీదికి గుంపుగా వచ్చి నన్ను చంపెదరు;నేనును నాయింటివారును నాశనమగుదుమని చెప్పెను అందుకు వారు - వేశ్యయెడల జరిగించినట్లు మా సహోదరియెడల ప్రవర్తింపవచ్చునా అనిరి.
- Proverbs 22:1 సామెతలు 22:1గొప్ప ఐశ్వర్యముకంటె మంచి పేరును వెండి బంగారములకంటె దయయు కోరదగినవి.
- 2 Kings 8:13 2 రాజులు 8:13అందుకు హజాయేలుకుక్కవంటివాడనగు నీ దాసుడనైన నేను ఇంత కార్యము చేయుటకు ఎంతటి వాడను అని అతనితో అనగా, ఎలీషానీవు సిరియామీద రాజవగుదువని యెహోవా నాకు బయలుపరచి యున్నాడనెను.
- Hebrews 13:18 హెబ్రీయులకు 13:18మా నిమిత్తము ప్రార్థనచేయుడి; మేమన్ని విషయములలోను యోగ్యముగా ప్రవర్తింప గోరుచు మంచి మనస్సాక్షి కలిగియున్నామని నమ్ముకొనుచున్నాను.
- Genesis 37:18–32 ఆదికాండము 37:18–32అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరము నుండి అతని చూచి అతని చంపుటకు దురాలోచన చేసిరి. వారు - ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు; వీని చంపి యిక్కడనున్న ఒక గుంటలో పారవేసి, దుష్టమృగము వీని తినివేసెనని చెప్పుదము, అప్పుడు వీని కలలేమగునో చూతము రండని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి. రూబేను ఆ మాట వినిమనము వానిని చంపరాదని చెప్పి వారి చేతులలో పడకుండ అతని విడిపించెను. ఎట్లనగా రూబేను అతని తండ్రికి అతని నప్పగించుటకై వారి చేతులలో పడకుండ అతని విడిపింప దలచిరక్తము చిందింపకుడి; అతనికి హాని ఏమియు చేయక అడవిలోనున్న యీ గుంటలో అతని పడద్రోయుడని వారితో చెప్పెను. యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని అతడు తొడుగుకొని యుండిన ఆ విచిత్రమైన నిలువుటంగీని తీసివేసి, అతని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట వట్టిది అందులో నీళ్లులేవు. వారు భోజనముచేయ కూర్చుండి, కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసికొని పోవుటకు గుగ్గిలము మస్తకియు బోళమును మోయుచున్న ఒంటెలతో ఇష్మాయేలీయులైన మార్గస్థులు గిలాదునుండి వచ్చుచుండిరి. అప్పుడు యూదా మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచి పెట్టినందువలన ఏమి ప్రయోజనము? ఈ ఇష్మాయేలీయులకు వానిని అమ్మి వేయుదము రండి; వాడు మన సహోదరుడు మన రక్త సంబంధిగదా? వానికి హాని యేమియు చేయరాదని తన సహోదరులతో చెప్పెను. అందుకతని సహోదరులు సమ్మతించిరి. మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్లుచుండగా, వారు ఆ గుంటలోనుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీయులకు ఇరువది తులముల వెండికి అతనిని అమ్మివేసిరి. వారు యోసేపును ఐగుప్తునకు తీసికొనిపోయిరి. రూబేను ఆ గుంటకు తిరిగివచ్చినప్పుడు యోసేపు గుంటలో లేకపోగా అతడు తన బట్టలు చింపుకొని తన సహోదరుల యొద్దకు తిరిగివెళ్లి - చిన్నవాడు లేడే; అయ్యో నేనెక్కడికి పోదుననగా వారు యోసేపు అంగీని తీసికొని, ఒక మేకపిల్లను చంపి, దాని రక్తములో ఆ అంగీముంచి ఆ విచిత్రమైన నిలువు టంగీని పంపగా వారు తండ్రియొద్దకు దానిని తెచ్చి - ఇది మాకు దొరికెను, ఇది నీ కుమారుని అంగీ అవునో కాదో గురుతుపట్టుమని చెప్పిరి
- 2 Samuel 20:20 2 సమూయేలు 20:20యోవాబునిర్మూలము చేయను, లయ పరచను, ఆలాగున చేయనే చేయను, సంగతి అది కానే కాదు.